Michael Movie: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను తన సంగీతం, డ్యాన్స్ తో ఊపేసిన 'కింగ్ ఆఫ్ పాప్' మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న మూవీ 'మైఖేల్' (Michael). బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిన ఈ మూవీకి 2027 గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల వేదికపై ఒక కీలకమైన సాంకేతిక ఎదురుదెబ్బ తగిలింది.

ఈ మైఖేల్ మూవీని 'మ్యూజికల్ ఆర్ కామెడీ' (Musical or Comedy) కేటగిరీలో నామినేషన్ కోసం సమర్పించగా, గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ కమిటీ ఆ ప్రతిపాదన అభ్యర్థనను తోసిపుచ్చినట్లు ప్రముఖ హాలీవుడ్ మీడియా సంస్థ 'వెరైటీ' కథనం పేర్కొంది. దీనివల్ల ఈ మూవీ క్రిస్టోఫర్ నోలన్ మూవీ 'ది ఒడిస్సీ' (The Odyssey)తో సహా పలు దిగ్గజ సినిమాలతో తీవ్ర పోటీని ఎదుర్కొనాల్సి రానుంది.
మ్యూజికల్ కేటగిరీ కాకపోతే ఏమవుతుంది?
గోల్డెన్ గ్లోబ్స్ కమిటీ నిర్ణయంతో ఈ చిత్రం ఇప్పుడు నేరుగా 'డ్రామా రేస్' (Drama Race) విభాగంలోకి వెళ్లింది. దీనివల్ల అవార్డు పోటీ మరింత క్లిష్టంగా మారనుంది. సాధారణంగా డ్రామా కేటగిరీలో కేవలం 6 నామినేషన్ స్థానాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
దీనితో హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన 'ది ఒడిస్సీ' (The Odyssey), లాస్ జావిస్ రూపొందించిన 'లా బోలా నెగ్రా' వంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో మైఖేల్ బయోపిక్ పోటీ పడాల్సి ఉంటుంది. అయితే సహాయ నటుల కేటగిరీలలో (Supporting Acting Categories) ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదు. మైఖేల్ తల్లిదండ్రులైన జో, క్యాథరిన్ జాక్సన్ పాత్రలు పోషించిన కోల్మన్ డోమింగో, నియా లాంగ్‌లు తమ విభాగాల్లో ఎప్పటిలాగే పోటీపడవచ్చు.
లయన్స్‌గేట్ నిర్మాణ సంస్థకు ఈ నిర్ణయాన్ని సవాలు చేసేందుకు అక్టోబర్ 31 వరకు సమయం ఉంది. గోల్డెన్ గ్లోబ్స్ నిబంధనల ప్రకారం.. "కథానాయకుల సంభాషణలతో పాటు కథను ముందుకు తీసుకెళ్లడానికి పాటలను ఉపయోగించే చిత్రాలను మ్యూజికల్"గా పరిగణిస్తారు.
సీక్వెల్ కూడా లైన్లోనే..
{{/usCountry}}లయన్స్‌గేట్ నిర్మాణ సంస్థకు ఈ నిర్ణయాన్ని సవాలు చేసేందుకు అక్టోబర్ 31 వరకు సమయం ఉంది. గోల్డెన్ గ్లోబ్స్ నిబంధనల ప్రకారం.. "కథానాయకుల సంభాషణలతో పాటు కథను ముందుకు తీసుకెళ్లడానికి పాటలను ఉపయోగించే చిత్రాలను మ్యూజికల్"గా పరిగణిస్తారు.
సీక్వెల్ కూడా లైన్లోనే..
{{/usCountry}}ఒకవైపు అవార్డుల విభాగంలో చర్చలు నడుస్తుండగానే, ఈ సినిమా సీక్వెల్ ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మైఖేల్ జాక్సన్ లాయర్, మేనేజర్ జాన్ బ్రాంకా పాత్రలో నటించిన ప్రముఖ నటుడు మైల్స్ టెల్లర్ (Miles Teller) ఇప్పటికే ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ ఉందనే విషయాన్ని ధృవీకరించారు.
పాప్ కింగ్ జీవితంలోని వివాదాస్పద అంశాలు, చిన్నారుల వేధింపుల ఆరోపణలను రెండవ భాగంలో చూపిస్తారా అన్న ప్రశ్నకు జాఫర్ జాక్సన్ స్పందిస్తూ.. "రెండో భాగం గురించి నేను ఖచ్చితంగా ఏమీ చెప్పలేను, ఎందుకంటే నాకు తెలియదు. నటుడిగా నా పని ఉత్తమమైన నటనను అందించడమే. కానీ మైఖేల్ గురించి తెలుసుకోవాలంటే అది ఆయన మ్యూజిక్, సాహిత్యం, ఆయన చేసిన సామాజిక సేవలలోనే ఉంది" అని వివరించారు.
మైఖేల్ జియోహాట్‌స్టార్ ఓటీటీలో..
ఆంటోనీ ఫుక్వా (Antoine Fuqua) దర్శకత్వంలో, జాన్ లోగాన్ రచనలో తెరకెక్కిన ఈ మైఖేల్ మూవీ.. 1960ల కాలంలో 'జాక్సన్ 5' బ్యాండ్ ప్రారంభం నుంచి 1980ల నాటి బ్లాక్‌బస్టర్ 'బ్యాడ్' టూర్ వరకు మైఖేల్ ప్రయాణాన్ని ఆవిష్కరించింది. నిజ జీవితంలో మైఖేల్ జాక్సన్ మేనల్లుడైన జాఫర్ జాక్సన్ (Jaafar Jackson) ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు.
అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ ఏప్రిల్ 2026లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. ప్రస్తుతం జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి గోల్డెన్ గ్లోబ్స్ వేదికపై డ్రామా విభాగంలో ఈ సినిమా ఏమేరకు పురస్కారాలను కొల్లగొడుతుందో చూడాలి.