తెలుగులో హీరోయిన్స్‌కు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఒక్క సినిమాతో మంచి ఫామ్‌లోకి వస్తే చాలు బ్రాండింగ్ ప్రమోషన్స్, ఓపెనింగ్స్ వంటి కార్యక్రమాలతో బిజీ అయిపోతుంటారు. ఇప్పుడు అలాగే ఓ కొత్త హీరోయిన్ బిజీ అయిపోతున్నారు. ఆమెనే రితికా నాయక్.
మిరాయ్ సినిమాతో

మిరాయి సినిమాలో హీరోయిన్‌గా చేసిన రితికా నాయక్ వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే అంటూ యూత్‌ను తెగ అట్రాక్ట్ చేశారు. ఒక్క మిరాయితో మంచి క్రేజ్ తెచ్చుకున్న రితికా నాయక్ తాజాగా ఓ జ్యూవెలరీ షోరూమ్‌ను ప్రారంభించారు.
విజయనగరంలో జ్యూవెలరీ షో రూమ్
మన్నికైన నాణ్యత గల ఆభరణాల సంస్థ గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ షో రూమ్ విజయనగరం ఎంజీ రోడ్డులోని 21వ స్టోర్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ షోరూమ్‌నే టాలీవుడ్ బ్యూటిఫుల్ రితికా నాయక్ లాంఛనంగా ప్రారంభించారు.
పెద్ద సంఖ్యలో అభిమానులు
ఈ సందర్భంగా హీరోయిన్ రితికా నాయక్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతేకాకుండా రితికా నాయక్‌తో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.
మంచి సిల్వర్ కలెక్షన్స్
అనంతరం షో రూమ్ ఓపెనింగ్ సందర్బంగా జ్యూవెలరీ గురించి రితికా నాయక్ మాట్లాడారు. యువతులు అందంగా కనిపించేందుకు ఈ జ్యువెలరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ షో రూమ్‌లో మంచి సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్లు ఉన్నాయని మిరాయ్ బయూటీ రితికా నాయక్ అన్నారు.
అద్భుతమైన ఆఫర్స్
ఈ సందర్భంగా గోయాజ్ జ్యూవెలరీ ఛైర్మన్ వేములూరి రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ.. "గోయాజ్ స్టోర్ ప్రారంభం సందర్భంగా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 15 వరకు అద్భుతమైన ఆఫర్లను గొప్ప ప్రారంభ ఆఫర్లతో అందిస్తున్నాం" అని తెలిపారు.
మరో 5 జ్యూవెలరీ షోరూమ్స్
"అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు పొందిన ఏకైక సిల్వర్ జ్యువెలరీ స్టోర్ గోయాజ్‌లో వెండి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే త్వరలో దక్షిణ భారత దేశంలో మరో ఐదు జ్యూవెలరీ షో రూమ్‌లు ప్రారంభించనున్నాం" అని వేములూరి రాజేంద్ర కుమార్ వెల్లడించారు.
రితికా నాయక్ డ్యాన్స్
{{/usCountry}}"అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు పొందిన ఏకైక సిల్వర్ జ్యువెలరీ స్టోర్ గోయాజ్‌లో వెండి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే త్వరలో దక్షిణ భారత దేశంలో మరో ఐదు జ్యూవెలరీ షో రూమ్‌లు ప్రారంభించనున్నాం" అని వేములూరి రాజేంద్ర కుమార్ వెల్లడించారు.
రితికా నాయక్ డ్యాన్స్
{{/usCountry}}ఇదిలా ఉంటే, రిబ్బన్ కటింగ్, ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి గోయాజ్ జ్యూవెలరీ షోరూమ్‌ను ప్రారంభించిన రితికా నాయక్ అక్కడ అభిమానులతో సందడిగా గడిపారు. అభిమానులతో వైబ్ ఉంది అనే పాటకు డ్యాన్స్ చేస్తూ అందరిని హుషారుపరిచారు రితికా నాయక్. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విశ్వక్ సేన్, నాని మూవీలతో
కాగా, మిరాయ్ సినిమా కంటే ముందు రితికా నాయక్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన అశోక వనంలో అర్జున కల్యాణం సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాలో తన క్యారెక్టర్‌తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది రితికా. అనంతరం హాయ్ నాన్న సినిమాలో నానికి కూతురుగా యాక్ట్ చేసి అట్రాక్ట్ చేసింది రితికా నాయక్.
కమర్షియల్ బ్రాండింగ్స్‌తో
ఇప్పుడు మిరాయ్‌తో మంచి సక్సెస్ అందుకుని హీరోయిన్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న రితికా నాయక్ కమర్షియల్ బ్రాండింగ్స్‌తో దూసుకుపోతోంది.