OTT Release: హిందీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ అయిన 'మీర్జాపూర్'కు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సిరీస్ ఆధారంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమానే 'మీర్జాపూర్ ది మూవీ'. సెప్టెంబర్ 4, 2026న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం ఏకంగా రూ.336 కోట్లకు పైగా కళ్లు చెదిరే కలెక్షన్లు రాబట్టి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఓటీటీలోకి మీర్జాపూర్ మూవీ

ఇప్పుడు ఈ సూపర్ హిట్ గ్యాంగ్ స్టర్ డ్రామా మీర్జాపూర్ మూవీ ఓటీటీలోకి సైలెంట్ గా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో దీపావళి కానుకగా పండుగకు ముందే ఈ రోజు (అక్టోబర్ 30) నుంచి స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది. అంతే కాకుండా ఎక్స్‌టెండెడ్ కట్ తో సర్ ప్రైజ్ చేసింది.
రన్ టైమ్ ఎంతంటే?
సాధారణంగా థియేటర్లో రిలీజైన వెర్షన్ కు, ఓటీటీలో వచ్చే వెర్షన్ కు కొద్దిగా తేడా ఉంటుంది. సెన్సార్ బోర్డ్ (CBFC) మీర్జాపూర్ మూవీ థియేట్రికల్ రిలీజ్ సమయంలో కొన్ని అభ్యంతరకరమైన, ఇంటిమేట్ సీన్స్, బూతు పదాలను కట్ చేసింది. కానీ, ఓటీటీలో మాత్రం మేకర్స్ ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండా నేరుగా ‘ఎక్స్‌టెండెడ్ కట్’ ను ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు.
ఈ ఎక్స్‌టెండెడ్ వెర్షన్ నిడివి ఏకంగా 3 గంటల 31 నిమిషాలు ఉండటం విశేషం. అంటే దాదాపు మూడున్నర గంటల పాటు ప్రేక్షకులకు గ్యాంగ్‌స్టర్ యాక్షన్ విందు దొరకనుంది. ప్రస్తుతం ఈ సినిమా హిందీ భాషలో స్ట్రీమ్ అవుతోంది.
స్టోరీ ఏంటంటే?
ఈ సినిమా కథ మీర్జాపూర్ సిరీస్ మొదటి సీజన్ సమయంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో సాగుతుంది. సిరీస్ లో తమదైన డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన పంకజ్ త్రిపాఠి (కాలీన్ భయ్యా), అలీ ఫజల్ (గుడ్డు పండిట్), దివ్యేందు (మున్నా భయ్యా) పాత్రలు ఈ సినిమాలోనూ తమ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు.
ఎందుకు చూడాలి?
{{/usCountry}}ఈ సినిమా కథ మీర్జాపూర్ సిరీస్ మొదటి సీజన్ సమయంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో సాగుతుంది. సిరీస్ లో తమదైన డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన పంకజ్ త్రిపాఠి (కాలీన్ భయ్యా), అలీ ఫజల్ (గుడ్డు పండిట్), దివ్యేందు (మున్నా భయ్యా) పాత్రలు ఈ సినిమాలోనూ తమ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు.
ఎందుకు చూడాలి?
{{/usCountry}}మీర్జాపూర్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ దృష్టిలో ఉంచుకుని ఈ మూవీని థియేటర్లలో మిస్ అయిన వాళ్లు, ఇప్పుడు ఇంట్లోనే ప్రైమ్ వీడియోలో ఈ 'ఎక్స్‌టెండెడ్ కట్' ను చూసి థ్రిల్ ఫీల్ అవ్వొచ్చు. సిరీస్ తో సంబంధం లేకుండా నేరుగా మూవీ చూసే వాళ్లకు కూడా ఈ ఆధిపత్య పోరు, పాలిటిక్స్ స్టోరీ అద్భుతంగా కనెక్ట్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రైమ్ వీడియోలో ఈ బ్లాక్ బస్టర్ మూవీని వెంటనే చూసేయండి.