థియేటర్లలో నవ్వుల రైడ్ అంటూ సాగుతోంది ‘మిత్ర మండలి’. కానీ ఈ మూవీకి ఊహించిన టాక్ రాలేదు. నవ్వులు కూడా తక్కువే అని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలుసు కదా, కె ర్యాంప్, డ్యూడ్ వంటి సినిమాల కారణంగా మిత్ర మండలి పేరు ఎక్కువగా వినిపించడం లేదు. ప్రియదర్శి లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మిత్ర మండలి ఏ ఓటీటీలోకి వస్తుందో చూసేద్దాం.
మిత్ర మండలి ఓటీటీ

ప్రియదర్శి లీడ్ రోల్ లో నటించిన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మిత్ర మండలి. ఈ సినిమా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ మూవీలో ప్రియదర్శితో పాటు నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓఐ, రాగ్ మమూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిశోర్, సత్య తదితరులు నటించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి రానుంది.
ఓటీటీ రైట్స్
మిత్ర మండలి సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు సొంతం చేసుకుంది. ఈ రెండింటి వాల్యూ కలిపి రూ.9.50 కోట్లుగా టాక్. ఈ ప్రకారం మిత్ర మండలి మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోతో ఓటీటీలో అడుగుపెట్టబోతుంది.
ఓటీటీ రిలీజ్
మిత్ర మండలి ఓటీటీ రిలీజ్ ఎప్పుడో చూద్దాం. సాధారణంగా తెలుగు సినిమాలు థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మిత్ర మండలి నవంబర్ రెండో వారంలో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలున్నాయి. ఆ రకంగానే అమెజాన్ ప్రైమ్ వీడియోతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. దీనిపై ప్రైమ్ వీడియో త్వరలోనే ప్రకటన చేసే అవకాశముంది.
మిత్ర మండలి కథ
ఒక అమ్మాయి ప్రేమ కోసం నలుగురు కుర్రాళ్లు తిరిగే కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మిత్ర మండలి. చైతన్య (ప్రియదర్శి), సాత్విక్ (విష్ణు), రాజీవ్ (ప్రసాద్ బెహరా), అభి (రాగ్ మయూర్) ఫ్రెండ్స్. వీళ్లు జంగ్లీపట్నం అనే ఊర్లో ఉంటారు. అదే గ్రామంలో ఉండే స్వేచ్ఛ (నిహారిక ఎన్ఎమ్)ను ప్రేమిస్తుంటారు. ఆమె తండ్రి నారాయణ (వీటీవీ గణేష్)కు పులిబిడ్డ అని పేరు. అతనికి అందరూ భయపడుతుంటారు.
{{/usCountry}}ఒక అమ్మాయి ప్రేమ కోసం నలుగురు కుర్రాళ్లు తిరిగే కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మిత్ర మండలి. చైతన్య (ప్రియదర్శి), సాత్విక్ (విష్ణు), రాజీవ్ (ప్రసాద్ బెహరా), అభి (రాగ్ మయూర్) ఫ్రెండ్స్. వీళ్లు జంగ్లీపట్నం అనే ఊర్లో ఉంటారు. అదే గ్రామంలో ఉండే స్వేచ్ఛ (నిహారిక ఎన్ఎమ్)ను ప్రేమిస్తుంటారు. ఆమె తండ్రి నారాయణ (వీటీవీ గణేష్)కు పులిబిడ్డ అని పేరు. అతనికి అందరూ భయపడుతుంటారు.
{{/usCountry}}మరోవైపు చైైతన్యను స్వేచ్ఛ ప్రేమిస్తుంటుంది. ఈ క్రమంలోనే స్వేచ్ఛను ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఈ కేసును సాల్వ్ చేసేందుకు పోలీస్ ఆఫీసర్ గా వెన్నెల కిశోర్ రంగంలోకి దిగుతాడు. మరి స్వేచ్ఛను కిడ్నాప్ చేసింది ఎవరు? చైతన్య, స్వేచ్ఛ లవ్ స్టోరీ ఏమైంది? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.