KOTI 50: సంగీత దర్శకుడు కోటి @50- లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్- ఆయన బీట్.. మన హార్ట్ బీట్, జెన్ జీకి తెలుస్తుందని కామెంట్స్

MLA Gangula Kamalakar Launches Koti 50 Live Concert Poster: టాలీవుడ్ పాపులర్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి సినీ జీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరబాద్-ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసి పోస్టర్‌ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లాంచ్ చేశారు.

Published on: Sep 22, 2026, 16:58:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Former Minister Gangula Kamalakar Launches Koti 50 Live Concert Poster: ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ యాభై ఏళ్లలో ఎన్నెన్నో బ్లాక్ బస్టర్, క్లాసికల్ పాటల్ని అందించారు. 80, 90వ దశకంలో రాజ్ కోటి ద్వయానికి ఏర్పడిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

సంగీత దర్శకుడు కోటి @50- లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్-  ఆయన బీట్.. మన హార్ట్ బీట్, జెన్ జీకి తెలుస్తుందని కామెంట్స్
సంగీత దర్శకుడు కోటి @50- లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్- ఆయన బీట్.. మన హార్ట్ బీట్, జెన్ జీకి తెలుస్తుందని కామెంట్స్

50 ఏళ్ల సినీ జీవితాన్ని పురస్కరించుకుని

ఇక కోటి సంగీత సారథ్యంలో వచ్చిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఈ యాభై ఏళ్ల సినీ జర్నీని పురస్కరించుకుని మనతో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ‘కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరబాద్ - ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసి’ ఈవెంట్‌ను నవంబర్ 28న గ్రాండ్‌గా నిర్వహించనుంది.

కోటి మ్యూజికల్ కాన్సర్ట్ స్పాన్సర్స్

ఈ కాన్సర్ట్‌ను ఎస్ఎంఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్, ఎన్ ఎస్ ఆర్ డెవలపర్స్, నవీన్ గోల్డ్ అండ్ బ్రదర్స్, జీ ఎన్ ఆర్ మయూక ఇన్ ఫ్రా, కాంచీపురం లక్ష్మీ వారాహి సిల్క్స్ గ్రాండ్‌గా స్పాన్సర్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం గురించి సంబంధించిన ప్రకటన చేసేందుకు సోమవారం (సెప్టెంబర్ 21) నాడు మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

కోటి లైవ్ కాన్సర్ట్ పోస్టర్ రిలీజ్ చేసిన మంత్రి

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ ‘కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరబాద్ - ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసి’ ఈవెంట్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. అనంతరం కోటి గురించి మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్రెస్టింగ్ చేశారు.

గ్రామ్ ఫోన్‌లో ఆయన పాటలు వినేవాడిని

ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ .. "నా చిన్నతనంలో కోటి గారి పాటలెన్నో విన్నాను. ఈ రోజు ఇలా ఆయన్ను ఇక్కడ కలవడం ఆనందంగా ఉంది. ఈ యాభై ఏళ్లలో టెక్నాలజీ ఎంతో మారింది. ఒకప్పుడు గ్రామ్ ఫోన్‌లో ఆయన పాటలు వినేవాడ్ని. ఆయన మ్యూజిక్, పాటల వల్లే చాలా సినిమాలు విజయవంతమయ్యాయి" అని అన్నారు.

ఇప్పుడు జెన్ జీకి తెలుస్తుంది

"మా తరానికి కోటి గారి గురించి చాలా తెలుసు. కానీ ప్రస్తుతం ఉన్న జెన్ జీ ఆడియెన్స్‌కి ఈ ఈవెంట్‌తో కోటి గారు అంటే ఏంటో తెలుస్తుంది. నవంబర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి నేను కూడా వస్తాను. నేను తీస్తున్న చిత్రాలకు కూడా కోటి గారే సంగీతాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ భూమ్మీద గాలి ఉన్నంత వరకు కోటి గారి పాటలు నిలిచి ఉంటాయి" అని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

ఆయన బీట్ మన హార్ట్ బీట్

మనతో ఎంటర్టైన్మెంట్స్ శోభన్ మాట్లాడుతూ .. "కోటి గారి సంగీతంతో పాటు మనం పెరుగుతూ వచ్చాం. ఆయన బీట్.. మన హార్ట్ బీట్. ఐదు దశాబ్దాలుగా ఆయన సంగీతాన్ని ఆస్వాధిస్తూనే వస్తున్నాం. ఆడియో క్యాసిట్ నుంచి ఏఐ ఇంటెలిజెన్స్ వరకు ఉన్న ఏకైక గొప్ప సంగీత దర్శకుడు కోటి గారు. ఈ రోజు ఇలా కోటి గారి కాన్సర్ట్ గురించి ప్రకటిస్తుండటం ఆనందంగా ఉంది" అని వెల్లడించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More