OTT Trending: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందిన తమిళ డార్క్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మొద రాతిరి' (Modha Rathiri) ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ చిత్రం ఓటీటీని షేక్ చేస్తోంది. ఇప్పుడు ఈ మూవీ గురించే ఓటీటీ ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు.
మొద రాతిరి ఓటీటీ

తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన మొద రాతిరి ఇప్పుడు ఓటీటీలోనూ తన జోరు కొనసాగిస్తోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో శుక్రవారం (సెప్టెంబర్ 18) ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
అదిరిందంటూ
మొద రాతిరి మూవీ ఓటీటీలోకి రాగానే మరోసారి టాక్ ఆఫ్ ది ఓటీటీగా మారింది. ఈ డార్క్ కామెడీ మూవీని ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ‘సినిమా బాగుంది, క్లైమాక్స్ హత్తుకుంది’, ‘టాక్సిక్ కు బదులు మొద రాతిరిని థియేటర్లో చూసిన బాగుండేది’ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
ధనుష్ ప్రశంసలు
మొద రాతిరి మూవీపై తమిళ స్టార్ హీరో, డైరెక్టర్ ధనుష్ కూడా ప్రశంసలు కురిపించారు. ఈ మూవీ థియేటర్లలో రన్ అవుతున్న సమయంలో ధనుష్ చేసిన ట్వీట్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. రిషికాంత్, అనిష్మ అనిల్‌కుమార్ జంటగా నటించిన మొద రాతిరి మూవీని మిస్ కావొద్దంటూ ధనుష్ పోస్టు పెట్టారు.
మొద రాతిరి కథేంటి?
ఒక పల్లెటూరి పెళ్లి వేడుకలో జరిగే అనూహ్య పరిణామాల నేపథ్యంలో 'మొద రాతిరి' సినిమా తెరకెక్కింది. ఇష్టం లేకపోయినా కుటుంబాల ఒత్తిడికి తలొగ్గి అమ్మాయి, అబ్బాయి పెళ్లికి రెడీ అవుతారు. పెళ్లి పీటలు ఎక్కిన ఇద్దరు అపరిచితులైన యువతీ యువకులు (రిషికాంత్, అనిష్మ) వివాహం ముగిసిన వెంటనే ఒకరికొకరు నిజాలు చెప్పుకుంటారు.
{{/usCountry}}ఒక పల్లెటూరి పెళ్లి వేడుకలో జరిగే అనూహ్య పరిణామాల నేపథ్యంలో 'మొద రాతిరి' సినిమా తెరకెక్కింది. ఇష్టం లేకపోయినా కుటుంబాల ఒత్తిడికి తలొగ్గి అమ్మాయి, అబ్బాయి పెళ్లికి రెడీ అవుతారు. పెళ్లి పీటలు ఎక్కిన ఇద్దరు అపరిచితులైన యువతీ యువకులు (రిషికాంత్, అనిష్మ) వివాహం ముగిసిన వెంటనే ఒకరికొకరు నిజాలు చెప్పుకుంటారు.
{{/usCountry}}ఈ క్రమంలోనే మొదటి రాత్రి (ఫస్ట్ నైట్) సమయంలోనే అక్కడి నుంచి తప్పించుకోవాలని వారిద్దరూ నిర్ణయించుకోవడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.
కుటుంబ సభ్యులకు షాక్ ఇస్తూ వారు చేసిన ఈ సాహస ప్రయాణంలో ఎదురైన హస్యభరిత సన్నివేశాలు, గందరగోళాలు, ఉత్కంఠరేపే భావోద్వేగాలు వీక్షకులను మొదటి నుంచి చివరి వరకు స్క్రీన్‌కు హత్తుకుపోయేలా చేస్తాయి. డార్క్ కామెడీ నేపధ్యంలో నడిచే ఈ డ్రామా నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యాకింగ్
ఈ మొద రాతిరి చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించడం విశేషం. థియేట్రికల్ ప్రీమియర్ సమయంలో సినిమాను వీక్షించిన తమిళ స్టార్ హీరో ధనుష్ ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను మిస్ అవ్వకూడదని ఆయన ప్రేక్షకులకు సూచించారు. ప్రొడక్షన్ విలువలు, నటీనటుల ప్రదర్శన సినిమా స్థాయిని పెంచాయని ప్రశంసించారు.
ఈ సినిమాలో ప్రధాన జంటతో పాటు చేతన్, ఎ. వెంకటేష్, బక్స్, అబ్దూల్ లీ, షెల్లీ కిషోర్, సంగీత బాలన్, భానుప్రియ, సుమిత్రా దేవి కీలక పాత్రలలో నటించారు.