మలయాళ సూపర్ స్టార్స్ మోహన్‌లాల్, దిలీప్ కలిసి నటించిన క్రేజీ యాక్షన్ కామెడీ మూవీ 'భ భ బ' (భయం భక్తి బహుమానం). భారీ అంచనాల మధ్య డిసెంబర్ 18న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా కథాకమామీషు, బాక్సాఫీస్ రిపోర్ట్.. ఓటీటీ వివరాలు ఇక్కడ చూడండి.
భ భ బ ఓటీటీ రిలీజ్ డేట్

ఈ మధ్య మలయాళం సినిమాల జోరు పెంచుతున్న జీ5 ఓటీటీయే భ భ బ మూవీ హక్కులను కూడా సొంతం చేసుకుంది. తాజాగా మూవీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది. జనవరి 16న అంటే కనుమ నుంచి ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లు వసూలు చేసిన ఈ మూవీకి ఓటీటీలో మరింత మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం మలయాళం వెర్షన్ (ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో) కన్ఫర్మ్ అయ్యింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే పాన్-ఇండియా అప్పీల్ కోసం ఇతర భాషల్లోనూ అందుబాటులోకి తెచ్చే ఛాన్స్ ఉంది.
భ భ బ మూవీ గురించి..
‘భయం, భక్తి, బహుమానం’ అనే టైటిల్ ను షార్ట్ గా భ భ బ అంటూ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైటిల్ తోపాటు మోహన్‌లాల్, దిలీప్ లాంటి స్టార్ హీరోలతో మూవీ రిలీజ్ కు ముందే ఎంతో హైప్ క్రియేట్ చేసింది. యాక్షన్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్‌లాల్ గెస్ట్ రోల్ చాలా ఇంపాక్ట్ చూపించింది. ఈ ఇద్దరితోపాటు వినీత్ శ్రీనివాస్, ధ్యాన్ శ్రీనివాస్ ముఖ్య పాత్రలు పోషించారు.
ధనంజయ్ శంకర్ డైరెక్ట్ చేశాడు. ముగ్గురు వ్యక్తుల జీవితాలు ఎలా ఒకచోట కలిశాయి? అందులో గిల్లి బాల (మోహన్‌లాల్) చేసిన రచ్చ ఏంటి? అనేదే ఈ సినిమా స్టోరీ లైన్. థియేటర్లలో ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది.
{{/usCountry}}ధనంజయ్ శంకర్ డైరెక్ట్ చేశాడు. ముగ్గురు వ్యక్తుల జీవితాలు ఎలా ఒకచోట కలిశాయి? అందులో గిల్లి బాల (మోహన్‌లాల్) చేసిన రచ్చ ఏంటి? అనేదే ఈ సినిమా స్టోరీ లైన్. థియేటర్లలో ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది.
{{/usCountry}}మోహన్‌లాల్ స్క్రీన్ ప్రెజన్స్, కామెడీ సీన్స్ బాగున్నాయని ఫ్యాన్స్ సంబరపడినా, కథలో పట్టు లేకపోవడంతో సాధారణ ఆడియన్స్‌కి అంతగా కనెక్ట్ కాలేదు. బాక్సాఫీస్ పరంగా చూస్తే.. డిసెంబర్ 18న రిలీజైన ఈ మూవీ ఓ మోస్తరు వసూళ్లు సాధించింది. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. సుమారు రూ. 50 కోట్లు (గ్రాస్) రాబట్టింది.
బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోయిన 'భ భ బ'.. ఓటీటీలో కామెడీ ప్రియులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మోహన్‌లాల్ మాస్ అవతార్ చూడాలనుకునే వారికి ఇది ఓటీటీలో మంచి ఆప్షన్.