...
...
Next Story

Monalisa: ఆ డైరెక్టర్ 10 సార్లు అసభ్యకరంగా తాకాడు.. మోనాలిసా సంచలన ఆరోపణలు.. పోక్సో కేసు.. ఇవేం ట్విస్ట్ లు బాబోయ్!

Monalisa: కుంభమేళ అమ్మాయి మోనాలిసా బాంబ్ పేల్చింది. ఆమె చుట్టూ ఇటీవల జరుగుతున్న పరిణామాల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. డైరెక్టర్ తనను 10 సార్లు అసభ్యకరంగా తాకాడని మోనాలిసా సంచలన ఆరోపణలు చేసింది. అతనిపై పోక్సో చట్టం కింద ఫిర్యాదు చేసింది.

Published on: May 2, 2026, 13:19:29 IST
Advertisement

Monalisa: కుంభమేళా అమ్మాయిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే సంచలన ఆరోపణలు చేసింది. ఇటీవల ఆమె చుట్టూ నెలకొన్న పరిణామాల్లో మరో ట్విస్ట్ చేసుకుంది. తేనే కళ్లతో రాత్రికి రాత్రి వైరల్ అయిపోయి బ్యూటీ.. ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.

మోనాలిసా ఫిర్యాదు

భర్త ఫర్మాన్ ఖాన్ తో మోనాలిసా (PTI)
భర్త ఫర్మాన్ ఖాన్ తో మోనాలిసా (PTI)

మోనాలిసాను హీరోయిన్ గా మార్చి, ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ మూవీ తీసిన డైరెక్టర్ సనోజ్ మిశ్రాపై మోనాలిసా సంచలన ఆరోపణలు చేసింది. అతనితో పాటు ముగ్గురిపై ఆమె పోక్సో (POCSO) చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ పరిణామం చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. అయితే, ఘటన జరిగిన ప్రాంతం మధ్యప్రదేశ్ కావడంతో విచారణను అక్కడికి బదిలీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఏం జరిగిందంటే?

ఏప్రిల్ 29, 2026న మోనాలిసా భోస్లే ఈ ఫిర్యాదు చేసింది. ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్ర షూటింగ్ సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కొచ్చిలో జరిగిన ఒక మీడియా సమావేశంలో మోనాలిసా తనపై జరిగిన వేధింపుల గురించి వివరంగా వెల్లడించింది.

షూటింగ్ సమయంలో దర్శకుడు తనతో పదే పదే అసభ్యకరంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పినప్పటికీ, తనకు ఎలాంటి మద్దతు దక్కలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

10 సార్లు

మోనాలిసా కేవలం దర్శకుడు సనోజ్ మిశ్రాపై మాత్రమే ఫిర్యాదు చేయలేదు. సామాజిక మాధ్యమాల ద్వారా తనను కించపరిచారంటూ న్యాయవాది అనిల్ విలాయిల్‌పై కూడా ఆమె తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న నలుగురిలో ఒకరు విశ్వహిందూ పరిషత్ (VHP) నేత కూడా ఉన్నారు.

బిగ్ ట్విస్ట్

మోనాలిసా వ్యక్తిగత జీవితంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఫర్మాన్ ఖాన్ అనే యువకుడిని మోనాలిసా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇది లవ్ జిహాద్ అంటూ ఆమె తల్లిదండ్రులు, సనోజ్ మిశ్రా ఆరోపించారు.

ఇంతలోనే పెళ్లి చేసుకునే సమయంలో మోనాలిసా మైనర్ అని తేలింది. దీంతో ఫర్మాన్ ఖాన్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఆ తర్వాత మోనాలిసా కనిపించడం లేదని ఫస్ట్ చెప్పిన ఫర్మాన్ ఖాన్.. అనంతరం ఆమె ప్రెగ్నెంట్ అని పేర్కొన్నాడు. ఇక ఫర్మాన్ ను అరెస్ట్ చేయొద్దంటూ కేరళ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసు విచారణ ఇంకా ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks