ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఆర్మాక్స్ (Ormax) గత వారం అంటే డిసెంబర్ 22 నుంచి 28 మధ్య అత్యధిక వ్యూస్ సాధించిన టాప్-5 ఓటీటీ సినిమాల లిస్టును విడుదల చేసింది. ఇందులో రష్మిక మందన్న నటించిన రెండు, భాగ్యశ్రీ బోర్సే నటించిన రెండు సినిమాలు ఉండటం విశేషం. హారర్ కామెడీ 'థామ' టాప్ ప్లేస్ లో నిలవగా, 'ది గర్ల్‌ఫ్రెండ్' కూడా లిస్ట్ లో స్థానం సంపాదించుకుంది.
ఓటీటీలో టాప్ 5 సినిమాలు ఇవే

ఈ ఏడాది చివరలో ఓటీటీ ఆడియెన్స్ ఏ సినిమాలను ఎక్కువగా చూశారో తెలుసా? ఈ వారం ఆర్మాక్స్ రిలీజ్ చేసిన టాప్ 5 లిస్ట్ ఇక్కడ ఉంది. వీటిలో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నవే నాలుగు సినిమాలు ఉండటం విశేషం. మరొకటి ప్రైమ్ వీడియోలో ఉంది.
1. థామ (Thama) - ప్రైమ్ వీడియో
ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న కాంబినేషన్ లో వచ్చిన హారర్ కామెడీ సినిమా థామా ఓటీటీని షేక్ చేస్తోంది. కేవలం ఒకే వారంలో 35 లక్షల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. బాక్సాఫీస్ వద్ద హిట్టయిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ వ్యూవర్షిప్ లో కూడా నంబర్ 1 స్థానంలో ఉంది.
2. రాత్ అకేలీ హై - నెట్‌ఫ్లిక్స్
నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ రాత్ అకేలీ హై. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో ఉంది. దీనికి గత వారం 20 లక్షల వ్యూస్ వచ్చాయి. సస్పెన్స్ కంటెంట్ ఇష్టపడే ఆడియెన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే ఇది రెండో స్థానంలో నిలిచింది.
3. ఆంధ్రా కింగ్ తాలూకా - నెట్‌ఫ్లిక్స్
రామ్ పోతినేని నటించిన తెలుగు యాక్షన్ కామెడీ సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. కన్నడ స్టార్ ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే కూడా ఇందులో నటించారు. సాగర్ అనే ఒక వీరాభిమాని జీవితం తన అభిమాన తార చుట్టూ ఎలా తిరుగుతుంది అనేదే కథ. నెట్‌ఫ్లిక్స్ లో 18 లక్షల వ్యూస్ తో ఇది మూడో స్థానంలో ట్రెండ్ అవుతోంది.
4. కాంత - నెట్‌ఫ్లిక్స్
{{/usCountry}}రామ్ పోతినేని నటించిన తెలుగు యాక్షన్ కామెడీ సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. కన్నడ స్టార్ ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే కూడా ఇందులో నటించారు. సాగర్ అనే ఒక వీరాభిమాని జీవితం తన అభిమాన తార చుట్టూ ఎలా తిరుగుతుంది అనేదే కథ. నెట్‌ఫ్లిక్స్ లో 18 లక్షల వ్యూస్ తో ఇది మూడో స్థానంలో ట్రెండ్ అవుతోంది.
4. కాంత - నెట్‌ఫ్లిక్స్
{{/usCountry}}గత కొన్ని వారాలుగా టాప్ లిస్ట్ లో కొనసాగుతున్న సినిమా ఇది. ఇందులో దుల్కర్ సల్మాన్ తోపాటు భాగ్యశ్రీ బోర్సే కూడా నటించింది. ఒక డైరెక్టర్ కి, హీరోకి మధ్య జరిగే ఈగో వార్ ఇది. క్లైమాక్స్ లో ఉండే అదిరిపోయే సస్పెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.17 లక్షల వ్యూస్ తో వ్యూవర్షిప్ లో ఇది నాలుగో స్థానంలో ఉంది.
5. ది గర్ల్‌ఫ్రెండ్ - నెట్‌ఫ్లిక్స్
రష్మిక మందన్న నటించిన మరో సినిమా కూడా టాప్ 5లో చోటు దక్కించుకుంది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక అమ్మాయి (భూమ) ఒక టాక్సిక్ బాయ్‌ఫ్రెండ్ ప్రేమలో చిక్కుకుని పడే ఇబ్బందులే ఈ కథ. నెట్‌ఫ్లిక్స్ లో 15 లక్షల వ్యూస్ తో ఐదో స్థానంలో నిలిచింది.