Jiohotstar Web Series: ఓటీటీ ప్రియుల కోసం జియోహాట్‌స్టార్ (JioHotstar) మరో సరికొత్త ఎంటర్టైనర్ను తీసుకొచ్చింది. ఇటీవల కాలంలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్.. ఇప్పుడు వర్క్‌ప్లేస్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ కామెడీ సిరీస్‌ను మన ముందుకు తెచ్చింది.
మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్ ఓటీటీ

హాట్‌స్టార్ స్పెషల్స్‌లో భాగంగా 'మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్' (Mr & Mrs Office) అనే వెబ్ సిరీస్ ఇవాళ (నవంబర్ 18) నుంచి జియోహాట్‌స్టార్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. నేటి యువత ఎదుర్కొంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాల కష్టాలు, ఆఫీస్ రాజకీయాలు, దానికి తోడు కెరీర్-లైఫ్ బ్యాలెన్స్.. ఇలా అన్నింటినీ కలిపి ఒక అద్భుతమైన ఓటీటీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా డైరెక్టర్ అబ్దుల్ కబీజ్ ఈ సిరీస్‌ను రూపొందించారు.
అసలు కథ ఏంటంటే?
అరివు, ఐశ్వర్య జంటకు పెళ్లి అవుతుంది. అరివు పని చేసే సాఫ్ట్ వేర్ కంపెనీలోనే అరివు జాయిన్ అవుతుంది. అయితే ఆ కంపెనీ రూల్స్ ప్రకారం భార్యాభర్తలు లేదా ఒకే కుటుంబానికి చెందిన వారు ఒకే ఆఫీసులో కలిసి పనిచేయకూడదు. దీంతో తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి అరివు, ఐశ్వర్య ఆఫీస్‌లో ఒకరికొకరు పరిచయమే లేని అపరిచితులుగా నటిస్తారు.
ఇంట్లో ఎంతో అన్యోన్యంగా ఉండే అరివు, ఐశ్వర్య.. ఆఫీస్ లో మాత్రం స్ట్రేంజర్స్ లాగా వ్యవహరిస్తూ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? కఠినమైన బాస్ నుంచి వీరు పడ్డ ఇబ్బందులు ఏంటి? తమ పెళ్లి విషయాన్ని ఎవరికీ తెలియకుండా ఎలా దాచిపెట్టారు? అనే విషయాలను ఎంతో హాస్యభరితంగా ఈ మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్ సిరీస్‌లో చూపించారు.
ఈ నటీనటులు
ఈ మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్ వెబ్ సిరీస్‌లో అరివు పాత్రలో యువ నటుడు ప్రదీప్ ఆంటోనీ నటించగా, ఐశ్వర్య పాత్రలో స్నేహ మణిమేగలై అద్భుతంగా నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయి. అలాగే ప్రముఖ నటి సనమ్ శెట్టి కూడా ఈ సిరీస్‌లో ఒక కీలక పాత్ర పోషించి మెప్పించారు. జెగన్ భాస్కరన్ నిర్మాణంలో వచ్చిన ఈ ఒరిజినల్ సిరీస్ తెలుగులోనూ అందుబాటులో ఉంది.
ఎన్ని ఎపిసోడ్స్?
{{/usCountry}}ఈ మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్ వెబ్ సిరీస్‌లో అరివు పాత్రలో యువ నటుడు ప్రదీప్ ఆంటోనీ నటించగా, ఐశ్వర్య పాత్రలో స్నేహ మణిమేగలై అద్భుతంగా నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయి. అలాగే ప్రముఖ నటి సనమ్ శెట్టి కూడా ఈ సిరీస్‌లో ఒక కీలక పాత్ర పోషించి మెప్పించారు. జెగన్ భాస్కరన్ నిర్మాణంలో వచ్చిన ఈ ఒరిజినల్ సిరీస్ తెలుగులోనూ అందుబాటులో ఉంది.
ఎన్ని ఎపిసోడ్స్?
{{/usCountry}}మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్ వెబ్ సిరీస్ నవంబర్ 18 నుంచి జియో హాట్‌స్టార్ లో (JioHotstar) అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌ను చాలా భారీగా మొత్తం 100 ఎపిసోడ్స్ ఉండేలా ప్లాన్ చేశారని సమాచారం. ప్రతి బుధవారం నాలుగు కొత్త ఎపిసోడ్స్ చొప్పున ఓటీటీలో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. దీనివల్ల ప్రేక్షకులకు ప్రతి వారం నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సిరీస్ ఎందుకు చూడాలి?
ఆఫీస్ టార్గెట్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, బాస్ తో ఉండే చిరాకులు.. ఇలాంటి విషయాలను నేటి తరం యువత తమ నిజ జీవితంతో సులభంగా రిలేట్ చేసుకుంటారు. సీరియస్ అంశాలకు కడుపుబ్బా నవ్వించే కామెడీని జోడించి రూపొందించిన ఈ సిరీస్ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. మంచి వర్క్ ప్లేస్ కామెడీ డ్రామా చూడాలనుకునేవారికి ఇదొక బెస్ట్ ఆప్షన్.