OTT Telugu: ఐటీ ఉద్యోగుల జీవితాల్లో భాగమైపోయిన ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిన సరికొత్త ఫన్ రైడర్ మూవీ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ (Mr. Work From Home). ఈ తెలుగు సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఓటీటీ

నవ్వుల ఎంటర్‌టైనర్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సౌత్ ఇండియాలోని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'సన్ నెక్స్ట్' (Sun NXT) దక్కించుకుంది. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 14 నుంచి ఈ సినిమా సన్ నెక్స్ట్‌లో నేరుగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేసి ప్రకటించారు.
ఓటీటీలో నవ్వుల జాతర
యంగ్ హీరో త్రిగుణ్ (Thrigun) ఈ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చిత్రంలో హీరోగా నటించాడు. పాయల్ రాధాకృష్ణ హీరోయిన్. టాలీవుడ్ ప్రముఖ కమెడియన్లు వైవా హర్ష, సత్యతో పాటు సీనియర్ నటుడు అనీష్ కురువిల్లా (Anish Kuruvilla) కీలక పాత్రల్లో నటించారు.
థియేటర్లలో ఈ సినిమా మే 15న రిలీజ్ అయింది. మూవీకి బాక్సాఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ వినిపించింది. ఇప్పుడు మూడు నెలలకు ఈ చిత్రం ఓటీటీ బాట పట్టనుంది. మరి డిజిటల్ స్ట్రీమింగ్ లో ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.
స్టోరీ ఏంటంటే?
అరవింద్ (త్రిగుణ్) అమెరికాలో సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి ఇండియాకు వస్తాడు. ఆర్గానికి వ్యవసాయం చేయాలనుకుంటాడు. ఫార్మింగ్ లో కొత్త టెక్నాలజీలు ప్రవేశపెడతాడు. రైతుల కోసం మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే యాప్ డిజైన్ చేస్తాడు.
{{/usCountry}}అరవింద్ (త్రిగుణ్) అమెరికాలో సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి ఇండియాకు వస్తాడు. ఆర్గానికి వ్యవసాయం చేయాలనుకుంటాడు. ఫార్మింగ్ లో కొత్త టెక్నాలజీలు ప్రవేశపెడతాడు. రైతుల కోసం మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే యాప్ డిజైన్ చేస్తాడు.
{{/usCountry}}మరోవైపు మహి (పాయల్ రాధాకృష్ణ)ని అరవింద్ ప్రేమిస్తాడు. అయితే ఒక నెల రోజుల పాటు తన మెయింటేనెన్స్ ఖర్చులు మొత్తం భరించాలని మహి కండీషన్ పెడుతుంది. మరి అరవింద్ ఏం చేశాడు? రైతుల జీవితాలను ఎలా మార్చాడు? తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నదే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ స్టోరీ.
ఐటీ ఆడియన్స్ అండ్ యూత్‌కు పర్ఫెక్ట్
ఆగస్టు 15 వీకెండ్ సెలవులను పురస్కరించుకుని కుటుంబ సమేతంగా, ముఖ్యంగా ఐటీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ సరదాగా రిలాక్స్ అవుతూ చూసేందుకు 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' పర్ఫెక్ట్ ఛాయిస్‌గా నిలవనుంది. అంతే కాకుండా యువ రైతులు ఈ మూవీని తప్పకుండా చూడాలి. వ్యవసాయంలో కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఇందులో చూపించారు.