గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుందని, వారు స్నేహితులుగా ఉండలేరని చాలామంది భావిస్తుంటారు. కానీ, నేటితరం హీరోయిన్లు ఆ పాత ముద్రను చెరిపేస్తున్నారు. ముఖ్యంగా మృణాల్ ఠాకూర్, తమన్నా భాటియా మధ్య ఉన్న 'సిస్టర్‌హుడ్' ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. డెకాయిట్ ప్రమోషన్లలో భాగంగా తమన్నాతో తన రిలేషన్ షిప్ పై మృణాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.
తమన్నాపై మృణాల్ కామెంట్లు

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మూవీ ‘డెకాయిట్’. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రణవీర్ అల్లాబాడియా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మృణాల్.. తమన్నా గురించి ఎంతో గొప్పగా మాట్లాడింది. అలాగే అమ్మాయిలతో ఫ్రెండ్ షిప్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని కూడా చెప్పింది.
విమానంలో కలిసి
తమన్నా గురించి మృణాల్ మాట్లాడుతూ.. "తమన్నా చాలా స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి. ఆమె నా హృదయాన్ని గెలుచుకుంది. నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. 'చిల్ అవ్వు, జీవితాన్ని ఆస్వాదించు' అని ఎప్పుడూ చెబుతుంటుంది. నిజానికి మేమిద్దరం హైదరాబాద్‌కు వెళ్లే విమానంలో తొలిసారి కలిశాం. అక్కడ మొదలైన మా పరిచయం ఇప్పుడు అక్కాచెల్లెల మధ్య ప్రేమలా మారింది’’ అని చెప్పింది.
అమ్మాయిలతో స్నేహం
"నేను ఎప్పుడూ అబ్బాయిలతోనే స్నేహం చేసేదాన్ని. గ్యాంగ్ లో ఐదుగురు అబ్బాయిలు ఉంటే అందులో ఏకైక అమ్మాయిని నేనే. అమ్మాయిలతో స్నేహం చేయడం నాకు కుదరదేమో అనుకున్నా. కానీ ఇప్పుడు అమ్మాయిలతో ఫ్రెండ్ షిప్ ను నిజంగా ఎంజాయ్ చేస్తున్నా. అది చాలా అందంగా ఉంటుంది. మా ఇద్దరి మధ్య ఎటువంటి ఫిల్టర్లు ఉండవు. నేను ఏదైనా సమస్య గురించి చెబితే, తమన్నా దగ్గర దానికి కచ్చితంగా పరిష్కారం ఉంటుంది" అని మృణాల్ తెలిపింది.
లస్ట్ స్టోరీస్ 2 నుంచి
2023లో నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన ఆంథాలజీ 'లస్ట్ స్టోరీస్ 2'లో తమన్నా, మృణాల్ నటించారు. అప్పటి నుంచి వీళ్ల మధ్య రిలేషన్ షిప్ మరింత స్ట్రాంగ్ గా మారింది. గత ఏడాది ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా తమన్నా కూడా మృణాల్, కాజల్ అగర్వాల్‌లతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. 'అడల్ట్ ఫ్రెండ్షిప్స్' చాలా గొప్పవని పేర్కొంది.
వరుస సినిమాలతో బిజీ
{{/usCountry}}2023లో నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన ఆంథాలజీ 'లస్ట్ స్టోరీస్ 2'లో తమన్నా, మృణాల్ నటించారు. అప్పటి నుంచి వీళ్ల మధ్య రిలేషన్ షిప్ మరింత స్ట్రాంగ్ గా మారింది. గత ఏడాది ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా తమన్నా కూడా మృణాల్, కాజల్ అగర్వాల్‌లతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. 'అడల్ట్ ఫ్రెండ్షిప్స్' చాలా గొప్పవని పేర్కొంది.
వరుస సినిమాలతో బిజీ
{{/usCountry}}మృణాల్ ఠాకూర్ ఇటీవల సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి నటించిన 'దో దీవానే షెహెర్ మే' ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు ఆమె ఆశలన్నీ 'డెకాయిట్' సినిమాపైనే ఉన్నాయి. అడివి శేష్ హీరోగా, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాతో మృణాల్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతానని ధీమాగా ఉంది.