బాలీవుడ్ హీరో వరున్ ధావన్ తన లేటెస్ట్ మూవీ బోర్డర్ 2 విజయంతో మంచి జోష్ మీదున్నాడు. కానీ అతని ఉత్సాహానికి ఎండ్ కార్డు వేస్తూ ముంబై మెట్రో సీరియస్ వార్నింగ్ జారీ చేసింది. మెట్రో ట్రైన్ లో బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించింది. రైల్లో వరుణ్ ధావన్ స్టంట్స్ చేయడమే ఇందుకు కారణం.
మెట్రోలో వరుణ్ ధావన్

వరుణ్ ధావన్ ముంబై ట్రాఫిక్‌ను తప్పించుకుని, అభిమానులను ఆశ్చర్యపరిచేందుకు సినిమా హాల్‌కు మెట్రోలో ప్రయాణించాలని అనుకున్నాడు. ధావన్ ఇంతకుముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పర్యటనను టీజ్ చేశాడు. మెట్రో లోపలి నుండి ఒక స్టోరీని పోస్ట్ చేసి, ఏ థియేటర్‌కు వెళ్తున్నాడో ఊహించమని అడిగాడు. వెంటనే అతను రైల్లో పైనున్న మెటల్ రాడ్‌కు వేలాడుతూ తోటి ప్రయాణికులు సమీపంలో నిలబడి ఉండగా పుల్-అప్స్ చేశాడు.
మెట్రో కార్పోరేషన్ సీరియస్
మెట్రో రైల్లో వరుణ్ ధావన్ స్టంట్స్ వీడియోలు వైరల్ గా మారాయి. దీనిపై ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMMOCL) సీరియస్ అయింది. ఈ వీడియోను తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో రీషేర్ చేసింది. దానికి పాయింట్‌డ్ అడ్వైజరీని జతచేసింది. నటుడిని ఉద్దేశించి రాసిన క్యాప్షన్‌లో యాక్షన్ సినిమాలలో కనిపించే డిస్‌క్లైమర్‌ల మాదిరిగానే ఈ వీడియో కూడా ఉండాలని, మెట్రోలో అలాంటి ప్రవర్తనను అనుకరించవద్దని ప్రయాణికులను కోరాలని ఆ సంస్థ వ్యాఖ్యానించింది.
స్టంట్స్ కోసం కాదు
‘‘మెట్రో కోచ్‌లలో గ్రేబ్ హ్యాండిల్స్ వంటి ఫిక్చర్‌లు ప్రయాణికుల మద్దతు కోసం మాత్రమే ఉన్నాయి. ఫిజికల్ స్టంట్స్ కోసం కాదు. ది మెట్రో రైల్వేస్ (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) యాక్ట్, 2002లోని నిబంధనల ప్రకారం, ఇబ్బంది కలిగించే లేదా ప్రజా ఆస్తికి నష్టం కలిగించే చర్యలు శిక్షార్హం. తీవ్రతను బట్టి ఇలాంటి ఉల్లంఘనలు జరిమానాలు లేదా జైలు శిక్షకు కూడా దారితీయవచ్చు. హ్యాంగ్ అవుట్ చేయండి, కానీ అక్కడ వేలాడకండి’’ అని తన పోస్టులో వార్నింగ్ ఇచ్చింది ముంబై మెట్రో.
బోర్డర్ 2 గురించి
బోర్డర్ 2 సినిమాలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహన్ శెట్టి, మోనా సింగ్, సోనమ్ బజ్వా, ఆన్య సింగ్ తదితరులు నటించారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. జె.పి. దత్తా 1997 క్లాసిక్ మూవీ 'బోర్డర్'కి సీక్వెల్. ఇది 1971 ఇండో-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కింది. సక్నిల్క్ ప్రకారం బోర్డర్ 2 ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద రూ.158.61 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
{{/usCountry}}బోర్డర్ 2 సినిమాలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహన్ శెట్టి, మోనా సింగ్, సోనమ్ బజ్వా, ఆన్య సింగ్ తదితరులు నటించారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. జె.పి. దత్తా 1997 క్లాసిక్ మూవీ 'బోర్డర్'కి సీక్వెల్. ఇది 1971 ఇండో-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కింది. సక్నిల్క్ ప్రకారం బోర్డర్ 2 ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద రూ.158.61 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
{{/usCountry}}