Pritam Slams On Cocktail 2 Mashooqa Song Copy Controversy: బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, కృతి సనన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన తాజా రొమాంటిక్ చిత్రం 'కాక్‌టెయిల్ 2'. ఈ సినిమా నుంచి మే 19న విడుదలైన 'మషూక' అనే మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే, ఈ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.

మషూక సాంగ్ విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ ట్యూన్ కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ వివాదంపై బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ చక్రవర్తి ఎట్టకేలకు నోరు విప్పారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఇటాలియన్ సాంగ్‌తో పోలికలు!
ఈ మషూక పాట ట్యూన్ 1993 నాటి 'సే సో అరుబాతే ఎ నోన్నా' (Se So Arrubate A Nonna) అనే ఒక ఇటాలియన్ కామెడీ సాంగ్‌ను పోలి ఉందంటూ నెటిజన్లు కొన్ని వీడియోలను తెరపైకి తెచ్చారు. బీబీ & కో అనే ఇటాలియన్ మ్యూజిక్ ద్వయం పాడిన ఆ పాట రికార్డింగ్స్‌ను, మషూకా పాటతో పోలుస్తూ మీమ్స్, ట్రోల్స్ చేయడం ప్రారంభించారు.
దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. "నా ప్రతి కొత్త పాట విడుదల కాగానే కొంతమంది స్వయం ప్రకటిత మ్యూజిక్ డిటెక్టివ్‌లు రంగంలోకి దిగుతున్నారు. వారు 'ఊహాజనిత పోలికలు' అనే ఒక కొత్త జోనర్‌ను సృష్టించారు. ఎప్పుడూ అదే మనుషులు, అదే కాపీ సిద్ధాంతాలు పట్టుకుని కూర్చుంటారు" అని ప్రీతమ్ అసహనం వ్యక్తం చేశారు.
నెటిజన్ల ట్రోలింగ్‌కు తనదైన శైలిలో సమాధానమిస్తూ..
"నిజం చెప్పాలంటే, ప్రస్తుతానికి మీరు నా ఫ్రీ పీఆర్ టీమ్‌లా పనిచేస్తూ నా పాటకు పబ్లిసిటీ తెస్తున్నారు. కానీ మీరు చేస్తున్న ఈ పని అస్సలు బాలేదు" అని సంగీత దర్శకుడు ప్రీతమ్ నెటిజన్లకు హితవు పలికారు.
ప్రీతమ్‌కు వివాదాలు కొత్తేమీ కాదు!
{{/usCountry}}"నిజం చెప్పాలంటే, ప్రస్తుతానికి మీరు నా ఫ్రీ పీఆర్ టీమ్‌లా పనిచేస్తూ నా పాటకు పబ్లిసిటీ తెస్తున్నారు. కానీ మీరు చేస్తున్న ఈ పని అస్సలు బాలేదు" అని సంగీత దర్శకుడు ప్రీతమ్ నెటిజన్లకు హితవు పలికారు.
ప్రీతమ్‌కు వివాదాలు కొత్తేమీ కాదు!
{{/usCountry}}సంగీత దర్శకుడు ప్రీతమ్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆయన స్వరపరిచిన పలు సూపర్ హిట్ సాంగ్స్ అంతర్జాతీయ ట్యూన్ల నుంచి ఇన్‌స్పైర్ అయినవేనంటూ నెటిజన్లు ఆధారాలతో సహా నిరూపించారు. 2017లో వచ్చిన 'యే దిల్ హై ముష్కిల్' చిత్రంలోని 'బుల్లెయా' సాంగ్‌ను, పాపా రోచ్ అనే అంతర్జాతీయ బ్యాండ్ మ్యూజిక్ నుంచి కాపీ చేశారనే విమర్శలు వచ్చాయి.
అయితే, 2016లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రీతమ్ మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో తాను కొన్ని పొరపాట్లు చేశానని, ఆ తర్వాత నుంచి సొంత ట్యూన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నానని అంగీకరించడం గమనార్హం.
2012 నాటి సినిమాకు సీక్వెల్
అమితాబ్ భట్టాచార్య సాహిత్యం అందించిన ఈ 'మషూకా' పాటను రాఘవ్ చైతన్య, మహమూద్ రువా కే పాడారు. ఈ కాక్‌టేయిల్ 2 సినిమాకు హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం 2012లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటీ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'కాక్‌టెయిల్' చిత్రానికి సీక్వెల్.
జూన్ 19న 'కాక్‌టెయిల్ 2' విడుదల
అయితే, కాక్‌టేయిల్ 2 కథ పూర్తిగా భిన్నంగా ఉంటుందని హీరోయన్ కృతి సనన్ ఇటీవల స్పష్టం చేశారు. షాహిద్, కృతి సనన్, రష్మిక మందన్నా కలిసి నటించిన కాక్‌టేయిల్ 2 జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'కాక్‌టెయిల్ 2' చిత్రంలోని ఏ పాట వివాదంలో చిక్కుకుంది?
షాహిద్ కపూర్, కృతి సనన్ నటించిన ఈ చిత్రంలోని 'మషూకా' (Mashooqa) అనే పాట కాపీ వివాదంలో చిక్కుకుంది.
2. 'మషూకా' పాటను ఏ అంతర్జాతీయ సాంగ్‌తో పోలుస్తున్నారు?
1993లో విడుదలైన 'సే సో అరుబాతే ఎ నోన్నా' అనే ప్రసిద్ధ ఇటాలియన్ కామెడీ సాంగ్ ట్యూన్‌ను ఈ పాట పోలి ఉందంటూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
3. కాపీ ఆరోపణలపై సంగీత దర్శకుడు ప్రీతమ్ ఎలా స్పందించారు?
ఆ పోలికలన్నీ కేవలం ఊహాజనితమైనవని ప్రీతమ్ కొట్టిపారేశారు. తనను ట్రోల్ చేసేవారంతా తన ఫ్రీ పీఆర్ టీమ్‌లా మారి పాటకు పబ్లిసిటీ కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు.
4. 'కాక్‌టెయిల్ 2' సినిమా ఎప్పుడు విడుదలవుతుంది? ఇందులో తెలుగు నటి ఎవరైనా ఉన్నారా?
ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది. టాలీవుడ్ స్టార్ నటి రష్మిక మందన్న ఇందులో ఒక ప్రధాన పాత్రలో నటిస్తోంది.