వెర్సటైల్ హీరో తిరువీర్, టీనా శ్రావ్య జోడీ కట్టిన రూరల్ బ్యాక్‌డ్రాప్ కామెడీ చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. నవంబర్ 7న వచ్చిన ఈ చిత్రాన్ని సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7పీఎమ్ ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు.
మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి కామెంట్స్

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ సినిమాకు టాక్ బాగానే ఉంది. ఈ క్రమంలో ఇటీవల బ్లాక్ బస్టర్ ఫన్ షోని చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
గత ఐదేళ్ల నుంచి
మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ .. "‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్. గత ఐదేళ్ల నుంచి నేను ఓ మంచి సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నాను. ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం" అని అన్నారు.
పాటలు బాగున్నాయి కానీ
"నా పాటలు బాగుంటున్నాయి.. కానీ, సినిమాలు ఆడటం లేదు అని అంతా అంటుండేవారు. కానీ ఇప్పుడు మాత్రం నాకు మంచి గుర్తింపుతో పాటు, మంచి సక్సెస్ వచ్చింది. ఈ సక్సెస్ కోసమే నేను ఇన్నేళ్లు కష్టపడుతూ వచ్చాను. పడుతూ లేస్తూ అథ: పాతాళానికి వెళ్లినా కూడా ఇలా సక్సెస్ సాధించాను. ఈ మూవీని ఇంకా జనాల్లోకి తీసుకెళ్లాలని మీడియాని కోరుకుంటున్నాను" సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి తెలిపారు.
డాక్యుమెంట్ చేసి పెట్టుకోండని
హీరో తిరువీర్ మాట్లాడుతూ .. "సైరాట్ మూవీ మేకింగ్‌ను డాక్యుమెంటేషన్ చేశారు. ఈ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మేకింగ్‌ని కూడా డాక్యుమెంట్ చేసి పెట్టుకోండని చెప్పాను. చిన్న రూమ్‌లోనే సినిమా పనులన్నీ చేసేశారు" అని అన్నాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా ప్రమోట్
{{/usCountry}}హీరో తిరువీర్ మాట్లాడుతూ .. "సైరాట్ మూవీ మేకింగ్‌ను డాక్యుమెంటేషన్ చేశారు. ఈ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మేకింగ్‌ని కూడా డాక్యుమెంట్ చేసి పెట్టుకోండని చెప్పాను. చిన్న రూమ్‌లోనే సినిమా పనులన్నీ చేసేశారు" అని అన్నాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా ప్రమోట్
{{/usCountry}}"‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీని మీడియా చాలా సపోర్ట్ చేసింది. ఈ చిత్రం కోసం మేం ఆర్థికంగా చాలా కష్టపడ్డాం. రోహన్ అయితే మా కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువగా ప్రమోట్ చేశాడు. ఈ ప్రయాణంలో మీడియా మాకు అండగా నిలిచింది. ఎక్కడా కూడా ఒక్క నెగెటివ్ కామెంట్ కనిపించలేదు" అని హీరో తిరువీర్ తెలిపాడు.
మౌత్ పబ్లిసిటీతోనే
"మౌత్ టాక్, మౌత్ పబ్లిసిటీతోనే నా సినిమాలు ఆడుతుంటాయి. ఇప్పుడిప్పుడే మా సినిమా పికప్ అవుతోంది. మా చిత్రాన్ని ఎంకరేజ్ చేస్తున్న మీడియా, సోషల్ మీడియాకు థాంక్స్" అని తన స్పీచ్ ముగించాడు హీరో తిరువీర్.