OTT: నవ్వించే, ఏడిపించే, మదిని దోచే 6 సౌత్ సినిమాలు.. ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన మూవీస్.. ఓ లుక్కేయండి

ఓటీటీలో వేల సినిమాలున్నాయి. డిఫరెంట్ జోనర్లలో, వేర్వేరు స్టోరీలతో ఎన్ని చిత్రాలు వచ్చాయి. అయితే వీటిలో కొన్ని మాత్రమే స్పెషల్ గా ఉంటాయి. ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతాయి. ఈ ఆరు సౌత్ ఇండియన్ సినిమాలు అలాంటివే. వెంటనే ఓ లుక్కేయండి. 

Published on: Feb 01, 2026 3:26 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నవ్వించేవి కొన్ని, ఏడిపించేవి కొన్ని, సస్పెన్స్ తో ఉర్రూతలూగించేవి కొన్ని.. ఇలా డిఫరెంట్ సినిమాలు ఓటీటీలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఇందులో సౌత్ సినిమాల డామినెన్స్ ఎక్కువ. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోని సినిమాలకు ఓటీటీ ఆడియన్స్ కూడా ఎక్కువే. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన ఈ 6 సౌత్ ఇండియన్ మూవీస్ మిమ్మల్ని కచ్చితంగా ఇంప్రెస్ చేస్తాయి.

ఓటీటీ సౌత్ ఇండియన్ సినిమాలు
ఓటీటీ సౌత్ ఇండియన్ సినిమాలు

మెయ్యాజగన్

తమిళంలో వచ్చిన అదిరిపోయే ఎమోషనల్ డ్రామా ‘మెయ్యాజగన్’. ఇందులో కార్తి, అరవింద్ స్వామి అద్భుతమైన నటనతో కట్టిపడేశారు. చిన్నప్పుడు సరదాగా కలిసి గడిపిన ఇద్దరు చుట్టాలు.. పెద్దయ్యాక తమ గతాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవడం హైలైట్ గా నిలిచింది. మనలో చాలా మంది చాలా కాలం పాటు కుటుంబానికి దూరంగా ఉంటారు. అలాంటి వాళ్ల కథ ఇది.

ఇడ్లీ కడై

మనసును హత్తుకునే మరో తమిళ డ్రామా ‘ఇడ్లీ కడై’. ఇందులో స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్ ప్లే చేశాడు. మీ తండ్రి తన అడుగుజాడల్లో మీరు నడవాలని కోరుకుంటాడు. కానీ మీ కలలు అతని చిన్న ఇడ్లీ దుకాణం కంటే పెద్దవి అయితే అతను మిమ్మల్ని వెళ్లనిస్తాడు. కానీ మీరు తిరిగి వచ్చినప్పుడు మీ తండ్రి కేవలం తన ఇడ్లీలకు అభిమానులనే కాదు ఆత్మీయులను సంపాదించుకున్నారని తెలుసుకుంటారు. ఇడ్లీ కడై మూవీ ఓటీటీలో సత్తాచాటుతోంది.

ఇరుగపట్రు

భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉండాలో చాటే ఫీల్ గుడ్ మూవీ ఇరుగపట్రు. ఇది మూడు జంటల స్టోరీ. ఒక జంట పెళ్లి తర్వాత గొడవల కారణంగా విడిపోవాలనుకుంటుంది. మరో జంటలో భార్య లావుగా ఉందని భర్త తక్కువ చేసి చూస్తాడు. మూడో జంట మధ్యలో ఈగో సమస్యలు వస్తాయి. ఈ మూడీ జోడీలను కలిపేందుకు మ్యారేజ్ కౌన్సిలర్ ఎలా ప్రయత్నించాడన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

ఎకో

అడవిలోని మనుషుల జీవితాలను అక్కడి రహస్యాలతో ముడిపెడుతూ సస్పెన్స్ తో అలరించడంతో పాటు ఎమోషనల్ గానూ కనెక్ట్ అయ్యే సినిమా ఎకో. ఈ మలయాళ థ్రిల్లర్ ఓటీటీలో అదరగొడుతోంది. అడవిలో ఓ క్రిమినల్ దాక్కొని ఉంటాడు. అతణ్ని పట్టుకునేందుకు పోలీస్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇందులో కుక్కల ప్రాధాన్యత ఏంటీ అన్నది ఆసక్తి రేపుతుంది.

కడశీల బిర్యానీ

ఓ మానసిక రోగి చేతిలో తండ్రి చనిపోతాడు. తమ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇద్దరు కొడుకులు రెడీ అవుతారు. అప్పుడు వాళ్ల తమ్ముడి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుంది. ఏం చేయాలో తేల్చుకోలేకపోతాడు. ఈ కథతో వచ్చిన సినిమా కడశీల బిర్యానీ.

సినిమా బండి

ఆటోలో సినిమా కెమెరా ఒకటి దొరుకుతుంది. దీంతో సినిమా తీయాలని ఊర్లోని యువకులు ప్రయత్నించడమే సినిమా బండి మూవీ కథ. ఇది అచ్చమైన పల్లెటూరి తెలుగు సినిమా. ఇందులో ప్రతి పాత్ర సహజంగా ఉంటుంది. కచ్చితంగా మీ మనసులను తాకుతుంది.