Nag Ashwin: సోషల్ మీడియాకు జనరల్‌గా దూరంగా ఉండే టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఎట్టకేలకు 'కల్కి 2898 AD' చుట్టూ జరుగుతున్న ఆన్‌లైన్ వివాదాలపై తన మౌనాన్ని బ్రేక్ చేశారు. ముఖ్యంగా అఖిల్ లేటెస్ట్ యాక్షన్ బ్లాక్ బస్టర్ 'లెనిన్' రిలీజ్ తర్వాత అందులో ప్రమోద్ పంజు యాక్టింగ్‌ని చూసిన నెటిజన్లు.. నాగ్ అశ్విన్‌ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
అసలు వివాదం ఎక్కడ మొదలైంది?

రీసెంట్‌గా జులై 10న వరల్డ్ వైడ్‌గా రిలీజై బాక్సాఫీస్ దగ్గర రూ.37.2 కోట్ల కలెక్షన్స్‌తో దుమ్ముదులుపుతున్న అఖిల్ అక్కినేని 'లెనిన్' మూవీ ఈ మొత్తం వివాదానికి ప్రధాన కారణమైంది. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్‌లో వచ్చిన ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో వసంత్ క్యారెక్టర్‌లో కన్నడ యాక్టర్ ప్రమోద్ పంజు ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్‌ని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో తెగ పొగిడేశాడు.
"సిల్వర్ స్క్రీన్ మీద కర్ణుడి క్యారెక్టర్‌ని ఇలా ప్రెజెంట్ చేయాలి" అంటూ ఆ నెటిజన్ చేసిన పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. ఇది మెల్లిగా 'కల్కి 2898 AD' సినిమాపై డైరెక్ట్ ఎటాక్‌గా మారిపోయింది. ఈ పాన్ ఇండియా సెన్సేషన్‌లో నాగ్ అశ్విన్ కర్ణుడి క్యారెక్టర్‌ని మరీ గ్లోరిఫై చేశాడని, సినిమా క్లైమాక్స్ అసలు ఒరిజినల్ కథకు పూర్తి విరుద్ధంగా దైవ దూషణ చేసేలా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి.
మహాభారతంతో నాగ్ అశ్విన్ కౌంటర్
ఈ చర్చ ఆన్‌లైన్‌లో హాట్ టాపిక్ అవ్వడంతో ఫ్యాన్స్, క్రిటిక్స్ రెండు వర్గాలుగా విడిపోయారు. అయితే ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న నాగ్ అశ్విన్.. వాళ్ల ఆరోపణలను అలా వదిలేయకుండా ఈసారి మాత్రం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏకంగా ఒరిజినల్ మహాభారతం నుంచే ఆధారాలు తీసుకొచ్చి విమర్శకుల నోరు మూయించారు.
ప్రముఖ రచయిత వివేక్ దేబ్రాయ్ (Bibek Debroy) ఇంగ్లీష్ లోకి ట్రాన్స్‌లేట్ చేసిన మహాభారతం పుస్తకంలోని ఒక పేజీని నాగ్ అశ్విన్ షేర్ చేశారు. "ద్రోణ వధ పర్వంలో అర్జునుడితో సాక్షాత్తూ శ్రీకృష్ణుడు చెప్పిన మాటలివి. దయచేసి మహాభారతం చదవండి. అందులోనూ వివేక్ దేబ్రాయ్ వెర్షన్ చదవమని నా సలహా" అంటూ నాగ్ అశ్విన్ ఓపెన్ అయ్యాడు.
'కల్కి పార్ట్ 2' కోసం వెయిట్ చేయండి
{{/usCountry}}ప్రముఖ రచయిత వివేక్ దేబ్రాయ్ (Bibek Debroy) ఇంగ్లీష్ లోకి ట్రాన్స్‌లేట్ చేసిన మహాభారతం పుస్తకంలోని ఒక పేజీని నాగ్ అశ్విన్ షేర్ చేశారు. "ద్రోణ వధ పర్వంలో అర్జునుడితో సాక్షాత్తూ శ్రీకృష్ణుడు చెప్పిన మాటలివి. దయచేసి మహాభారతం చదవండి. అందులోనూ వివేక్ దేబ్రాయ్ వెర్షన్ చదవమని నా సలహా" అంటూ నాగ్ అశ్విన్ ఓపెన్ అయ్యాడు.
'కల్కి పార్ట్ 2' కోసం వెయిట్ చేయండి
{{/usCountry}}అంతేకాదు.. "శ్రీకృష్ణుడు అర్జునుడి దగ్గర కర్ణుడిని ఎన్నిసార్లు పొగిడాడో ఒకసారి గూగుల్ చేసి చూడండి. మన హిస్టరీ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. నేను ఏం చేస్తున్నానో నాకు పక్కాగా తెలుసు. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి" అని నాగ్ అశ్విన్ చాలా కాన్ఫిడెంట్‌గా బదులిచ్చారు.
ఫస్ట్ పార్ట్‌లో ప్రభాస్ ఎలివేషన్ సీన్స్, దానికి సంతోష్ నారాయణన్ ఇచ్చిన బీజీఎం థియేటర్లలో పూనకాలు తెప్పించాయి. అయితే కర్ణుడి పాత్రలో ఉన్న గ్రే షేడ్స్‌ని డైరెక్టర్ సరిగ్గా చూపించలేదని వస్తున్న నెగిటివ్ కామెంట్స్‌కు ఈ సింగిల్ పోస్ట్‌తో చెక్ పెట్టాడు నాగ్ అశ్విన్.
ఆయన ఇచ్చిన ఈ రిప్లై ఇప్పుడు ఆన్‌లైన్‌లో మళ్లీ రచ్చ రేపుతోంది. నెటిజన్లు ఆయన వాడిన ప్రతి పదాన్ని డీకోడ్ చేసే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఆయన లాస్ట్‌లో చెప్పిన 'వెయిట్ ఫర్ పార్ట్ 2' అనే మాట.. ఇప్పుడు 'కల్కి 2898 AD' సీక్వెల్‌పై అంచనాలను అమాంతం పెంచేసింది. కర్ణుడి స్టోరీని నెక్స్ట్ పార్ట్‌లో ఎలా డీల్ చేయబోతున్నారో చూడాలని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
లెజెండరీ డైరెక్టర్‌కు సపోర్ట్
ఇదిలా ఉంటే నాగ్ అశ్విన్ తన ఫోకస్ అంతా కేవలం కల్కి పైనే కాకుండా ఇతర ప్రాజెక్ట్స్ పై కూడా పెట్టారు. రీసెంట్‌గా ఆయన లెజెండరీ ఫిల్మ్ మేకర్ సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేస్తున్న 'సింగ్ గీతం' ప్రాజెక్ట్‌కు తన పూర్తి సపోర్ట్ అందించారు.