Chay on Sing Geetham: టాలీవుడ్ అగ్ర హీరోలంతా ఇప్పుడు ఒకే ఒక్క సినిమాను ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నారు. నిన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేసి మెచ్చుకోగా.. తాజాగా మరో యువ హీరో నాగచైతన్య కూడా ఈ మూవీ చూసి ఫిదా అయిపోయారు. 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు చేసిన ఈ వినూత్న ప్రయోగానికి చైతూ సెల్యూట్ చేశారు.
నేటి తరం వేగానికి లొంగని ప్యూర్ సినిమా

ఈ సింగ్ గీతం సినిమా అందించిన అనుభూతిని నాగ చైతన్య సోషల్ మీడియాలో పంచుకున్నారు. "సింగ్ గీతం.. కచ్చితంగా థియేటర్లలోనే ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన ఒక అద్భుతమైన సినిమా. ఈ రోజుల్లో ఇంత ప్యూర్ గా ఉండే సినిమాలు రావడం చాలా అరుదు. నేటి తరం రన్నింగ్ రేస్ వేగానికి లొంగకుండా, ఎలాంటి కల్మషం లేని ఒక అద్భుతమైన విజన్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. సింగీతం శ్రీనివాసరావు లెజెండరీ వర్క్ అనేది.. ఈరోజు మనం చేస్తున్న సినిమాలకు ఒక గట్టి పునాది లాంటిది. అంతేకాదు రాబోయే రోజుల్లో మనం చేయబోయే సినిమాలకు కూడా ఈ సినిమా ఒక పెద్ద ఇన్‌స్పిరేషన్ గా నిలుస్తుంది" అని ఎమోషనల్ గా రాసుకొచ్చారు.
Masterclass | జడ్జ్‌మెంట్స్ అన్నీ పక్కకు వెళ్తాయి
సినిమాలోని కంటెంట్ నిజాయితీ గురించి చైతూ చెప్తూ.. "మనం థియేటర్ లో కూర్చుని సినిమా చూడటం మొదలుపెట్టిన కొద్ది నిమిషాలకే.. మనకున్న జడ్జ్‌మెంట్స్, అంచనాలు అన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. ఈ సినిమాలోని ప్రతి ఒక్క అంశం అంత నిజాయితీగా ఉంటుంది. ఈ మూవీ చూశాక నేను పూర్తిగా అబ్బురపోయాను. ఈ టీమ్ కు, ఇందులో యాక్ట్ చేసిన నటీనటులకు నా మనసులో ఉన్న గౌరవాన్ని చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు. మీరంతా థియేటర్లకు వెళ్లి ఈ గొప్ప విజన్ ను సెలబ్రేట్ చేసుకోండి" అని నాగచైతన్య ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను అద్భుతంగా సపోర్ట్ చేసినందుకు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ (DSP), క్రియేటివ్ ప్రొడ్యూసర్ నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ లపై చైతూ ప్రశంసలు కురిపించారు.
హెచ్టీ విశ్లేషణ
{{/usCountry}}ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను అద్భుతంగా సపోర్ట్ చేసినందుకు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ (DSP), క్రియేటివ్ ప్రొడ్యూసర్ నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ లపై చైతూ ప్రశంసలు కురిపించారు.
హెచ్టీ విశ్లేషణ
{{/usCountry}}'సింగ్ గీతం' సినిమాకు టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోల నుంచి లభిస్తున్న ఈ భారీ సపోర్ట్ సినిమా రేంజ్ ను పెంచేస్తోంది. నిన్న ఎన్టీఆర్, ఇవాళ నాగచైతన్య లాంటి క్లాస్ అండ్ మాస్ హీరోలు వరసగా ట్వీట్స్ చేయడంతో యూత్ లో ఈ సినిమాపై విపరీతమైన ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.
పాత్రల మధ్య డైలాగ్స్ అన్నీ పాటల రూపంలోనే సాగే ఈ రేర్ మ్యూజికల్ ఫాంటసీ మూవీకి చైతూ చెప్పిన 'ప్యూర్, హానెస్ట్ కంటెంట్' అనే మాట పెద్ద ప్లస్ కానుంది. ఇప్పటి వరకూ ఈ మూవీ చూసి ఉండకపోతే వెంటనే చూసేయండి మరి.