...
...
Next Story

Naga Chaitanya: ఏడవాలని ఉంటుంది కానీ కన్నీళ్లు రావు.. నాగ చైతన్య ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య తన ఎమోషన్స్, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై చేసిన తాజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. తనకు ఏడవాలని అనిపిస్తుంది కానీ కన్నీళ్లు రావని చెప్పుకొచ్చారు. తన సినిమా ‘వృషకర్మ’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో చైతూ తన మనసులోని మాటలను ఓపెన్‌గా బయటపెట్టారు.

Published on: Nov 25, 2026, 05:57:32 IST
Advertisement

Naga Chaitanya: సాధారణంగా వివాదాలకు, హంగామాకు దూరంగా ఉంటూ ఎంతో ప్రశాంతంగా కనిపించే నాగ చైతన్య.. తాజాగా విడుదలైన ఒక ప్రోమో వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించారు. డిసెంబర్ 4న విడుదల కానున్న తన భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ ప్రచారం కోసం ఆయన ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్న చారిత్రక రామగిరి ఖిల్లాపై సుమారు ఎనిమిది గంటల పాటు ట్రెక్కింగ్ చేస్తూ కంటెంట్ క్రియేటర్ జాస్తి శ్రీనివాస్‌తో ముచ్చటించారు.

లోపల బాధ ఉన్నా.. ఏడవలేకపోతున్నా

ఏడవాలని ఉంటుంది కానీ కన్నీళ్లు రావు.. నాగ చైతన్య ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
ఏడవాలని ఉంటుంది కానీ కన్నీళ్లు రావు.. నాగ చైతన్య ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రామగిరి కొండపై నడుస్తూ సాగిన ఈ సంభాషణలో నాగ చైతన్య తన కెరీర్, కుటుంబ జ్ఞాపకాలు, వ్యక్తిగత జీవితంపై ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో మీరు ఎప్పుడైనా ఏడ్చారా అనే ప్రశ్న ఎదురవగా.. చైతూ ఎంతో నిజాయితీగా స్పందించారు. తనకు కొన్ని సందర్భాల్లో బాగా ఏడవాలని అనిపిస్తుందని, కానీ పైకి కన్నీళ్లు రావని ఆయన భావోద్వేగంగా చెప్పారు.

బాధ కలిగినప్పుడు ఆ వేదనను బయటకు వ్యక్తపరచడం తనకు అంత సులభం కాదని, అందుకే లోలోపలే ఎంతో కుమిలిపోతూ బాధపడుతుంటానని చైతన్య వెల్లడించారు. పైకి ఎప్పుడూ చిరునవ్వుతో, కూల్‌గా కనిపించే ఆయనలో ఇంతటి ఎమోషనల్ కోణం ఉండటం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

నా మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు

సోషల్ మీడియాలో తనపై వచ్చే వార్తలు, విమర్శలు, ట్రోలింగ్ గురించి కూడా నాగ చైతన్య ఎంతో మెచ్చూర్డ్ గా మాట్లాడారు. ఏదైనా విషయం జరిగినప్పుడు తాను మౌనంగా ఉండటాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

‘తండేల్’ తర్వాత నాగ చైతన్య తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో చేస్తున్న మిథికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ కథ అందించగా, బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుమారు రూ.110 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి పురావస్తు శాఖ శాస్త్రవేత్త దక్ష పాత్రలో నటిస్తున్నారు.

సినిమా నేపథ్యానికి తగ్గట్లుగానే పురాతన కోటలు, కట్టడాలు ఉన్న రామగిరి ఖిల్లాపై ఈ ట్రెక్కింగ్ ఇంటర్వ్యూను నిర్వహించడం ప్రమోషన్లలో కొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది. ప్రస్తుతం విడుదలైన ప్రోమోలోనే చైతూ ఎమోషనల్ వ్యాఖ్యలు ఈ స్థాయిలో హాట్ టాపిక్ గా మారాయి. నవంబర్ 27న విడుదల కానున్న పూర్తి వీడియో కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks