Vrushakarma Release Date: నాగ చైతన్య లేటెస్ట్ మిస్టికల్ థ్రిల్లర్ 'వృషకర్మ' థియేటర్లలోకి రావడానికి డేట్ లాక్ చేసుకుంది. 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ వర్మ దండు డైరెక్షన్ లో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ డిసెంబర్ 4, 2026న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మూవీ టీమ్ చైతూ పవర్ ఫుల్ పోస్టర్ వదులుతూ ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.
పోస్టర్ లో నాగ చైతన్య వైల్డ్ అవతార్

కొత్తగా రిలీజ్ చేసిన పోస్టర్ లో నాగ చైతన్య సరికొత్త ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తూ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాడు. చేతిలో ఆయుధం, కళ్లలో పగతో కనిపిస్తున్న చైతూ మాస్ అవతార్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. 'కొన్ని కథలు చెబుతారు, కొన్ని కథలు తెలుసుకుంటారు, కొన్ని కథలు బయటకు రావడానికి వెయిట్ చేస్తాయి' అంటూ క్యాప్షన్ జోడించి సినిమాపై అంచనాలను పెంచేశారు.
కార్తీక్ వర్మ దండు కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ పై భారీ హైప్ క్రియేట్ అయింది. 'విరూపాక్ష' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసిన కార్తీక్.. ఈసారి అంతకుమించిన మైథలాజికల్ మిస్టరీ ఎలిమెంట్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా సినిమా రూపుదిద్దుకుంటోంది.
వృషకర్మ మూవీ విశేషాలు
ఈ బిగ్ బడ్జెట్ మిస్టికల్ థ్రిల్లర్ లో హీరోయిన్ గా క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఆమె క్యారెక్టర్ కథలో చాలా కీలకమైన మలుపులు తిప్పుతుందని సమాచారం.
బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'లాపతా లేడీస్' ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ్ ఈ సినిమాతో టాలీవుడ్ కి విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. అతని క్యారెక్టర్ డెప్త్, పర్ఫార్మెన్స్ సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలవబోతున్నాయని టాక్ వినిపిస్తోంది.
{{/usCountry}}బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'లాపతా లేడీస్' ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ్ ఈ సినిమాతో టాలీవుడ్ కి విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. అతని క్యారెక్టర్ డెప్త్, పర్ఫార్మెన్స్ సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలవబోతున్నాయని టాక్ వినిపిస్తోంది.
{{/usCountry}}అలాగే శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్ పై ప్రముఖ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'కాంతార', 'విరూపాక్ష' చిత్రాలకు మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు.
2026 బాక్సాఫీస్ రేస్.. ప్రభాస్ 'ఫౌజీ' డౌటేనా?
డిసెంబర్ 4, 2026న 'వృషకర్మ' రావడం ఖాయం కావడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ రేస్ ఆసక్తికరంగా మారింది. ఈ డేట్ లాక్ కావడంతో ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న 'ఫౌజీ' సినిమా 2026 చివర్లో వచ్చే ఛాన్స్ లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
వరుస సక్సెస్ లతో జోరు మీదున్న నాగ చైతన్య 'తండేల్' తర్వాత చేస్తున్న ఈ మిస్టికల్ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.