SS Rajamouli: రాజమౌళిని కాస్త ఈ సినిమా చూడమని చెప్పండి.. ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని ఉంది: నాగవంశీ

SS Rajamouli: టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను నిర్మించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాను రాజమౌళి చూడాలని, ఆయన అభిప్రాయం తెలుసుకోవాలని ఆయన అనుకుంటున్నారు. దీనికోసం కార్తికేయకు ఓ రిక్వెస్ట్ పంపించారు.

Published on: Aug 24, 2026, 09:39:29 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

SS Rajamouli: వర్సటైల్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై దర్శకధీర ఎస్ఎస్ రాజమౌళి తనయుడు, ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయ రివ్యూ ఇచ్చారు. సినిమా చాలా హృద్యంగా, కూల్‌గా ఉందంటూ ఎక్స్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. దీనికి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ రీ-ట్వీట్ చేస్తూ.. "దయచేసి ఈ సినిమాను రాజమౌళి గారికి చూపించి ఆయన ఓపినియన్ చెప్పు బ్రో" అని కోరడం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

SS Rajamouli: రాజమౌళిని కాస్త ఈ సినిమా చూడమని చెప్పండి.. ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని ఉంది: నాగవంశీ
SS Rajamouli: రాజమౌళిని కాస్త ఈ సినిమా చూడమని చెప్పండి.. ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని ఉంది: నాగవంశీ

"సూర్య ఆ పాత్ర కోసమే పుట్టారు".. కార్తికేయ ట్వీట్ వైరల్

సూర్య నటనపై ఎస్ఎస్ కార్తికేయ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. "విశ్వనాథ్ అండ్ సన్స్ చాలా బ్యూటిఫుల్‌గా, మనసుకు హత్తుకునేలా ఉంది. ఇంత హాయిగా, మనసును మైమరిపించే ఎంటర్‌టైనర్ చూసి చాలా కాలమైంది" అని కార్తికేయ కొనియాడారు.

మనం ఎంతో ఇష్టపడే ఆ పాత వింటేజ్ జోన్‌లో సూర్యను మళ్లీ చూడటం అద్భుతంగా ఉందని కార్తికేయ తెలిపారు. "ఈ రోల్ కోసం సూర్య సర్ పుట్టినట్లు ఉన్నారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మైండ్ బ్లాకింగ్" అంటూ ప్రశంసించారు. 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజును ఎనర్జీ బాంబ్ అని అభివర్ణిస్తూ, ప్రతీ ఫ్రేమ్‌లో ఆమె ఎనర్జీ సినిమాకు బిగ్గెస్ట్ హైలైట్ అని పేర్కొన్నారు. ముఖ్యంగా సినిమాలో వచ్చే ఒక ఇంటర్వ్యూ సీన్ ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ సీన్స్‌లో ఒకటని చెప్పారు.

"జక్కన్నకు సినిమా చూపించవా బ్రో!".. నాగవంశీ స్పెషల్ రిక్వెస్ట్

కార్తికేయ చేసిన ఈ బ్యూటిఫుల్ ట్వీట్‌కు ప్రొడ్యూసర్ నాగవంశీ వెంటనే థ్యాంక్స్ చెబుతూ రిప్లై ఇచ్చారు. "థ్యాంక్యూ కార్తి.. ప్లీజ్ రాజమౌళి గారిని కూడా ఈ సినిమా చూడమని అడుగు. ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది" అంటూ పోస్ట్ చేశారు.

తెలుగు సినిమా స్థాయిని గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లిన దర్శకధీర రాజమౌళి ప్రశంసలు దక్కితే ఆ సినిమాకు వచ్చే హైప్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అందుకే నాగవంశీ తన సినిమాను జక్కన్నకు ప్రత్యేకంగా చూపించాలని కార్తికేయను కోరారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

వెంకీ అట్లూరి మార్క్ మ్యాజిక్.. సూర్య కెరీర్‌లో మరో మైలురాయి

'తొలిప్రేమ', 'సార్', 'లక్కీ భాస్కర్' లాంటి కమర్షియల్ బ్లాక్‌బస్టర్స్ అందించిన డైరెక్టర్ వెంకీ అట్లూరి.. ఈ సారి సూర్యతో కలిసి 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. తనదైన మార్క్ క్లాసిక్ ఎమోషన్స్, క్యూట్ లవ్ స్టోరీతో ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు కార్తికేయ ట్వీట్ ద్వారా స్పష్టమవుతోంది.

సూర్య కెరీర్‌లో 'గజినీ', '24', 'ఆకాశం నీ హద్దురా' లాంటి ఇంటెన్స్ రోల్స్ ఉన్నప్పటికీ, ఆయనలోని ఫీల్-గుడ్ అండ్ రొమాంటిక్ టైమింగ్‌ను చూడటానికి ఆడియన్స్ ఎప్పుడూ ఆసక్తి చూపుతారు. మలయాళ బ్యూటీ మమితా బైజు జోడీగా నటిస్తుండటం, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోవడంతో ఈ సినిమా సుదీర్ఘ కాలం ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మూవీ ఇప్పటికే రూ.200 కోట్లకుపైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More