Nagabandham OTT: మూడు వారాల్లోనే ఓటీటీలోకి రూ.100 కోట్ల డిజాస్టర్.. ఈ విజువల్ వండర్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ అంటే?

Nagabandham OTT: థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతోంది తెలుగు మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ నాగబంధం. జులై 3న థియేటర్లలోకి రాగా.. ఈ వారమే అంటే జులై 24 న నాలుగు భాషల్లో డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది.

Published on: Jul 23, 2026, 16:36:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Nagabandham OTT: ఎన్నో అంచనాల మధ్య ఏకంగా రూ. 110 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మైథాలజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ 'నాగబంధం' (Nagabandham) సైలెంట్‌గా డిజిటల్ ఎంట్రీకి రెడీ అయింది. జులై 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. ఆడియన్స్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ ప్రాజెక్ట్.. థియేట్రికల్ రిలీజ్ అయిన కేవలం 21 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Nagabandham OTT: మూడు వారాల్లోనే ఓటీటీలోకి రూ.100 కోట్ల డిజాస్టర్.. ఈ విజువల్ వండర్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ అంటే?
Nagabandham OTT: మూడు వారాల్లోనే ఓటీటీలోకి రూ.100 కోట్ల డిజాస్టర్.. ఈ విజువల్ వండర్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ అంటే?

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

యంగ్ హీరో విరాట్ కర్ణ, గ్లామరస్ భామలు నభా నటేష్, ఐశ్వర్య మీనన్ లీడ్ రోల్స్ చేసిన నాగబంధం సినిమా ప్రముఖ ఓటీటీ జెయింట్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ శుక్రవారం అంటే జులై 24 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్‌కు అందుబాటులోకి రాబోతోంది. అయితే హిందీ వెర్షన్ డిజిటల్ రిలీజ్‌పై మేకర్స్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

110 కోట్ల భారీ బడ్జెట్.. బాక్సాఫీస్ డిజాస్టర్

భారతీయ పురాణాలు, గుప్త నిధుల అన్వేషణ బ్యాక్‌డ్రాప్‌లో ప్రసిద్ధ నిర్మాత, దర్శకుడు అభిషేక్ నామా ఈ సినిమాను పెద్ద విజువల్ వండర్ గా ప్లాన్ చేశారు. ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా కోసం నెక్స్ట్ లెవెల్ విజువల్ ఎఫెక్ట్స్ (VFX), ప్రమోషన్స్ చేసినప్పటికీ.. బలహీనమైన స్క్రీన్‌ప్లే వల్ల ప్రేక్షకులు థియేటర్లలో కనెక్ట్ కాలేకపోయారు. రూ. 110 కోట్ల బడ్జెట్‌కు తగ్గట్లుగా కలెక్షన్స్ రాబట్టడంలో దారుణంగా విఫలమవ్వడంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు.

భారీ తారాగణం.. అయినా ఫ్లాప్

ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామాలో జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్ష నాగర్కర్, రిషబ్ సాహ్ని లాంటి పాపులర్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ప్రతి పాత్రనూ కథలోని మిస్టరీకి లింక్ చేస్తూ డైరెక్టర్ అభిషేక్ నామా డిజైన్ చేశారు.

టెక్నికల్ సైడ్ చూస్తే.. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ గ్రాండ్ విజువల్స్ అందించగా, హాలీవుడ్ రేంజ్ వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం టాప్ ప్రొడక్షన్ హౌసెస్ పనిచేశాయి. వ్లాడ్ రింబర్గ్ కొరియోగ్రఫీ చేసిన ఫైట్ సీన్స్, జునైద్ కుమార్-అభే అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి మెయిన్ అసెట్‌గా నిలిచాయి.

ఓటీటీలో అయినా మ్యాజిక్ చేస్తుందా?

బాక్సాఫీస్ దగ్గర ఆశించిన వసూళ్లు సాధించలేకపోయినా, ఫాంటసీ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కంటెంట్ ఉన్న సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పై మంచి వ్యూయర్‌షిప్ సాధిస్తుంటాయి. హోమ్ ఆడియన్స్ తరచుగా ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్స్‌ను చూడటానికి ఆసక్తి చూపిస్తారు.

మరి 21 రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్‌ వీడియోలోకి అడుగుపెడుతున్న ఈ 'నాగబంధం' సినిమా, ఓటీటీ స్పేస్‌లో ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి. ఒకవేళ మీరు థియేటర్లలో ఈ మూవీని మిస్ అయి ఉంటే.. ఈ వీకెండ్ ఓటీటీలో చూడటానికి ప్లాన్ చేేసేయండి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More