...
...
Next Story

King 100: నాగార్జున బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్‌- 100వ సినిమా టైటిల్ ఇదే- గ్లింప్స్‌తో రిలీజ్ డేట్- కొడుకుల రియాక్షన్ వైరల్!

Nagarjuna King 100: అక్కినేని నాగార్జున బర్త్ డే సందర్భంగా అదిరిపోయే సర్ ప్రైజ్ వచ్చేసింది. ఇవాళ ఆయన హీరోగా నటిస్తున్న 100వ సినిమా టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ ప్రకటించారు. వీడియో గ్లింప్స్ వైరల్ గా మారింది. దీనిపై నాగ చైతన్య, అఖిల్ రియాక్షన్ ఏంటో చూసేయండి.

Published on: Aug 29, 2026, 14:15:22 IST
Advertisement

Nagarjuna King 100: అక్కినేని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన సర్ ప్రైజ్ వచ్చేసింది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున మైల్‌స్టోన్ 100వ ప్రాజెక్ట్‌కు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఇవాళ (ఆగస్టు 29) పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది.

నాగార్జున మూవీ టైటిల్

నాగార్జున బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్‌- 100వ సినిమా టైటిల్ ఇదే- గ్లింప్స్‌తో రిలీజ్ డేట్- కొడుకుల రియాక్షన్ వైరల్! (x/chay_akkineni)
నాగార్జున బ‌ర్త్‌డే స‌ర్‌ప్రైజ్‌- 100వ సినిమా టైటిల్ ఇదే- గ్లింప్స్‌తో రిలీజ్ డేట్- కొడుకుల రియాక్షన్ వైరల్! (x/chay_akkineni)

అక్కినేని నాగార్జున 100వ సినిమా టైటిల్, రిలీజ్ డేట్ ను ఇవాళ మేకర్స్ ప్రకటించారు. ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న 'కింగ్ 100' (King 100) అనే వర్కింగ్ టైటిల్‌నే మూవీకి పెట్టేశారు. తమిళ దర్శకుడు రా. కార్తీక్ ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

రివర్స్ ఏజింగ్‌తో నాగార్జున రాయల్ లుక్

తాజాగా విడుదలైన కింగ్ 100 ఫస్ట్ గ్లింప్స్‌లో నాగార్జున లుక్, రాయల్ మేకోవర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వయసు పెరుగుతున్న కొద్దీ మరింత గ్లామరస్‌గా మారుతూ 'రివర్స్ ఏజింగ్'తో కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేలా నాగార్జున తన లుక్స్‌తో సంచలనం సృష్టిస్తున్నారు. తనదైన ఐకానిక్ మేనరిజం, అపరిమితమైన ఎనర్జీ, రాచరికం ఉట్టిపడే రాజసంతో ఆయన ఈ గ్లింప్స్‌లో మెరిశారు.

పక్కా మాస్ ఎంటర్‌టైనర్

కింగ్ 100 సినిమా కథ విషయానికి వస్తే, ఇది పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. శూన్యం నుంచి శిఖరానికి ఎదిగిన ఒక సాధారణ వ్యక్తి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే బలమైన ఎమోషన్ కూడా కథకు కీలకంగా నిలవబోతుంది.

కింగ్ 100 గ్లింప్స్‌లో కనిపించిన విజువల్స్, దేవి శ్రీ ప్రసాద్ బీజీఎం అద్భుతంగా ఉన్నాయి. ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు, సుస్మితా భట్, విజయేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ మైల్‌స్టోన్ ప్రాజెక్ట్‌ను క్రిస్మస్ కానుకగా 2026 డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

కొడుకుల రియాక్షన్

కింగ్ 100 గ్లింప్స్ పై నాగార్జున కొడుకు నాగ చైతన్య, అఖిల్ రియాక్షన్లు వైరల్ గా మారాయి. ‘‘మా కింగ్ ఫైర్ మీదున్నారు. నాన్న హ్యాపీ బర్త్ డే. గ్లింప్స్ అదిరిపోయింది. నీకు నచ్చిన క్యారెక్టర్లో చూడటం బాగుంది. టీమ్ కు థ్యాంక్ యూ’’ అని నాగ చైతన్య ఎక్స్ లో రాసుకొచ్చాడు.

‘‘లాంగ్ లీవ్ కింగ్. హ్యాపీ బర్త్ డే నాన్న’’ అని గ్లింప్స్ ను అఖిల్ షేర్ చేశాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks