Geethanjali Re Release: తెలుగు సినీ చరిత్రలో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ సినిమాల్లో ‘గీతాంజలి’ ఒకటి. 1989లో విడుదలైన ఈ మూవీ తెలుగు సినిమా చరిత్రలోనే మోస్ట్ ఎఫెక్టివ్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిలిచింది. ఈ క్లాసిక్ మ్యాజిక్‌ను ఈ జనరేషన్ సినీ లవర్స్ కు అందించడం కోసం మూవీ టీమ్ రీ రిలీజ్ ప్లాన్ చేసింది.
రెండు సార్లు వాయిదా

గీతాంజలి సినిమాను 4K సాంకేతికతతో అందించేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ శ్రీకారం చుట్టింది. నిజానికి ఈ చిత్రాన్ని అక్టోబర్ 2025 ప్రకటన ప్రకారం నవంబర్ 14, 2025న రీ రిలీజ్ చేయాలని భావించారు. కానీ అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఆ తర్వాత ఆగస్టు 28, 2026న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ మళ్లీ వాయిదా పడింది.
గీతాంజలి రీ రిలీజ్ డేట్
తాజాగా ఈ వాయిదాల సస్పెన్స్‌కు తెరదించుతూ మేకర్స్ గీతాంజలి రీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. నాగార్జున హీరోగా నటించిన ఈ మూవీని నవంబర్ 13, 2026న సినిమాను గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీ పద్మిని సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని థియేటర్లలో పంపిణీ చేయనుంది.
మణిరత్నం విజన్
భాగ్యలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్ లో వచ్చిన గీతాంజలి చిత్రం నాగార్జున కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్ లవ్ స్టోరీస్ శైలిని పూర్తిగా మార్చివేసింది. మణిరత్నం విజన్ కు ఇప్పటికీ ప్రశంసలు దక్కుతూనే ఉన్నాయి.
- డెబ్యూ నటి గిరిజా షెట్టర్: హీరోయిన్‌గా పరిచయమైన గిరిజా షెట్టర్ తన చురుకైన నటనతో, క్యూట్‌నెస్‌తో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
- ఇళయరాజా స్వరాలు: 'జగడ జగడ', 'ఓ పాపా లాలి', 'ఓ ప్రియా ప్రియా', 'ఆమని పాడవే కోయిలా' వంటి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ పాటలు, ఆత్మను తాకే నేపథ్య సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.
రీ రిలీజ్ ట్రెండ్
ప్రస్తుతం టాలీవుడ్లో పాత హిట్ సినిమాలను 4Kలో రీ-రిలీజ్ చేయడం పరిపాటిగా మారింది. అయితే ఎక్కువ శాతం యాక్షన్, మాస్ సినిమాలే రీ-రిలీజ్ అవుతున్న తరుణంలో, 'గీతాంజలి' వంటి క్లాసికల్ రోమాంటిక్ డ్రామా 4K రెస్టోరేషన్తో రావడం చాలా ప్రత్యేకమైనది.
{{/usCountry}}ప్రస్తుతం టాలీవుడ్లో పాత హిట్ సినిమాలను 4Kలో రీ-రిలీజ్ చేయడం పరిపాటిగా మారింది. అయితే ఎక్కువ శాతం యాక్షన్, మాస్ సినిమాలే రీ-రిలీజ్ అవుతున్న తరుణంలో, 'గీతాంజలి' వంటి క్లాసికల్ రోమాంటిక్ డ్రామా 4K రెస్టోరేషన్తో రావడం చాలా ప్రత్యేకమైనది.
{{/usCountry}}గతంలో రెండుసార్లు రీ-రిలీజ్ డేట్లు మారినప్పటికీ, అన్నపూర్ణ స్టూడియోస్ క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా విజువల్స్, ఫ్రేమ్ గ్రాన్యులారిటీ, ఆడియో మిక్సింగ్‌ను పర్‌ఫెక్ట్‌గా రీ-మాస్టర్ చేయడానికే సమయం తీసుకున్నట్లు సమాచారం. ఈ రోజుల్లో వస్తున్న రొటీన్ లవ్ స్టోరీలకు భిన్నంగా ఎమోషన్స్, ప్యూర్ లవ్ తో సాగే ఈ మూవీ నేటి నయా ట్రెండ్ ఓటీటీ లవర్స్‌కి కూడా థియేటర్లలో విజువల్ ట్రీట్‌గా నిలిచే ఛాన్స్ ఉంది.