...
...
Next Story

Today OTT: దట్టమైన అడవిలో ప్రాణాలు తీసే ప్రమాదం.. ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సర్వైవల్ థ్రిల్లర్.. ఎందుకు చూడాలంటే?

Today OTT: సండే రోజు ఓటీటీ ఎంటర్ టైన్మెంట్ ను డబుల్ చేస్తూ ఓ అదిరిపోయే మూవీ వచ్చేసింది. ఇవాళ నుంచి ఈ తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ అవుతోంది. దట్టమైన అడవిలో అనుకోని ప్రమాదం, ఆ తర్వాత జరిగే సంఘటలను చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

Published on: Oct 18, 2026, 11:15:31 IST
Advertisement

Today OTT: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్.. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతులను పంచేందుకు విలక్షణమైన కథలతో ముందుకు వస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం ప్రత్యేకంగా అందిస్తున్న 'కథాసుధ' (Katha Sudha) సిరీస్‌లో భాగంగా నేడు (అక్టోబర్ 18, 2026) 'నల్లజర్ల రోడ్డు' (Nallajerla Road) అనే మూవీ రిలీజైంది. దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన ప్రసిద్ధ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

నల్లజర్ల రోడ్డు ఓటీటీ

దట్టమైన అడవిలో ప్రాణాలు తీసే ప్రమాదం.. ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సర్వైవల్ థ్రిల్లర్.. ఎందుకు చూడాలంటే?
దట్టమైన అడవిలో ప్రాణాలు తీసే ప్రమాదం.. ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సర్వైవల్ థ్రిల్లర్.. ఎందుకు చూడాలంటే?

ఈటీవీ విన్ లోకి ఇవాళ నల్లజర్ల రోడ్డు అనే చిన్న సినిమా వచ్చేసింది. దాదాపు 44 నిమిషాల నిడివి గల ఈ చిత్రం ఒక భయంకరమైన అడవి మార్గంలో సాగే ప్రయాణం చుట్టూ సాగుతోంది. అసలు ఆ అడవిలో ఏం జరిగింది? అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. సండే రోజు ఓటీటీలో తక్కువ టైమ్ లో సర్వైవల్ థ్రిల్లర్ చూడాలనుకునేవాళ్లకు నల్లజర్ల రోడ్డు అనేది మంచి ఆప్షన్.

స్టోరీ ఏంటంటే?

నల్లజర్ల రోడ్డు సినిమా కథ 1965వ సంవత్సరంలో సాగుతుంది. రామం (రాజీవ్ కనకాల), అతని స్నేహితులు ఒక ప్రమాదకరమైన అడవి మార్గంలో చిక్కుకుపోతారు. ఆ సమయంలో వారిలో ఒకరైన చంద్రానికి అత్యంత విషపూరితమైన పాము కరుస్తుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చంద్రానికి అక్కడ నివసించే ఒక నాటు వైద్యుడు చికిత్స చేసి ప్రాణాలు కాపాడతాడు.

అయితే, ఆ తర్వాత కొద్దిసేపటికే.. తమ ప్రాణాలు కాపాడిన అదే వైద్యుడిపై కొందరు దారుణంగా దాడి చేస్తారు. అతను తీవ్ర రక్తగాయాలతో కొట్టుమిట్టాడుతుంటాడు. తన తండ్రిని రక్షించాలంటూ అతని కూతురు సూరిడు ఎంతగానో బతిమాలుకుంటుంది. కానీ, అక్కడ ఉన్న పరిస్థితులకు తీవ్రంగా భయపడిపోయిన రామం వాళ్లు అతణ్ని కాపాడకుండా వెళ్లిపోతారు.

ఈ చిత్రంలో రామం పాత్రలో విలక్షణ నటుడు రాజీవ్ కనకాల అద్భుతంగా నటించారు. భయం, పశ్చాత్తాపంతో కూడిన హావభావాలను ఆయన తన నటనతో పండించారు. ఆయనతో పాటు వజ్జ వెంకట గిరిధర్, సమ్మేత గాంధీ, మహాదేవ్, యాషోర, పూజా కేంద్రే, అనిల్ బొట్ట ఇతర ముఖ్య పాత్రల్లో మెప్పించారు. పాత్రల పరిధి మేరకు ప్రతి ఒక్కరూ సహజసిద్ధమైన నటనను కనబరిచారు.

ఎందుకు చూడాలి?

'నల్లజర్ల రోడ్డు' కేవలం ఒక సాధారణ కథ కాదు. విపత్కర పరిస్థితుల్లో మనుషులు ఎంత స్వార్థంగా ఆలోచిస్తారు, ఆ తర్వాత వారి వివేకం వారిని ఎలా ప్రశ్నిస్తుంది అనే సామాజిక, మానసిక కోణాలను ఈ చిత్రం చక్కగా ఆవిష్కరించింది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడదగ్గ ఒక మంచి సందేశాత్మక చిత్రం ఇది. ప్రస్తుతం ఈ షార్ట్ ఫిలిం ఈటీవీ విన్ యాప్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks