...
...
Next Story

Nandi Awards : డిసెంబర్‌లో నంది ఫిల్మ్ అండ్ టీవీ అవార్డులు.. ప్రభుత్వం కీలక ప్రకటన

Nandi Awards : నంది ఫిల్మ్ అండ్ టీవీ అవార్డులపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు. డిసెంబర్‌లో అవార్డుల ప్రదానోత్సం చేయనున్నట్టుగా ప్రకటించారు.

Published on: Sep 22, 2026, 15:47:02 IST
Advertisement

నంది ఫిల్మ్ అవార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నంది ఫిల్మ్, టీవీ అవార్డులకు సెప్టెంబర్‌లో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు. అక్టోబర్‌లో ప్రకటన వెలువడుతుందని, డిసెంబర్లో అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు..

నంది అవార్డులు
నంది అవార్డులు

'ఇది వరలో ప్రకటించిన 2012 నుండి 2016 వరకు నంది ఫిల్మ్ అండ్ టీవీ అవార్డులను ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2017 నుండి 2024 వరకు సంవత్సరానికి 4 అవార్డుల చొప్పున (2 ప్రొడక్షన్, 2 స్పెషల్ జ్యూరీ) ఫిల్మ్ అండ్ టీవీ అవార్డులను ప్రదానం చేయడానికి ప్రభుత్వం అంగీకరిస్తూ జీవో జారీ చేసింది. 2025 సంవత్సరానికి నంది ఫిల్మ్ అండ్ టీవీ అవార్డులు అందించనున్నాం.' అని మంత్రి దుర్గేష్ చెప్పారు.

నంది ఫిల్మ్ అండ్ జాతీయ చలన చిత్ర (నేషనల్ ఫిల్మ్) అవార్డులను అమరావతి లేదా విజయవాడ వేదికగా ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. నంది టీవీ అవార్డులను తిరుపతి వేదికగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ అవార్డులన్నీ కూడా డిసెంబర్ - 2026 లోగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని దుర్గేష్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం మేరకు వైభవంగా నంది అవార్డులు వేడుకలు ఉంటాయని ప్రకటించారు.

నంది నాటకోత్సవాలు

మరోవైపు నాటక సమాజాలు, కళాకారులు, రచయితలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రతిష్టాత్మక నంది నాటకోత్సవాలు-2025తో పాటు కందుకూరి పురస్కారాలు-2026 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ నిర్వహణ కమిటీ ప్రకటన విడుదల చేసింది.

నంది నాటకోత్సవాలు-2025 కోసం పోటీ పడేందుకు నాటక సమాజాలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వ్యక్తుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, పిల్లల నాటకాలు (చైల్డ్ ఆర్టిస్ట్స్/చిల్డ్రన్ ప్లేస్), కాలేజీ/యూనివర్సిటీ నాటకాలు, నాటకరంగం, ప్రదర్శన కళలపై రాసిన గ్రంథాలు/పుస్తకాల కోసం సేవలు అందించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్ www.apsftvtdc.in సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 20, 2026గా నిర్ణయించారు. హార్డ్ కాపీల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 26 సాయంత్రం లోపు ఉంది.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా: మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC), 4వ అంతస్తు, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (PNBS), విజయవాడ – 520013.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks