Nani Bloody Romeo Look: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో అఫీషియల్‌గా అనౌన్స్ అయిన చిత్రం 'బ్లడీ రోమియో' (Bloody Romeo). 'ది ప్యారడైజ్' లాంటి పక్కా రూటెడ్ మాస్ యాక్షన్ మూవీ తర్వాత నాని సరికొత్త మేకోవర్‌తో రాబోతున్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ టచ్ చేయని ఒక క్లాసీ, మోడ్రన్ గ్యాంగ్‌స్టర్ జోనర్‌ను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంచుకున్నారు.
అల్ట్రా స్టైలిష్ మేకోవర్

దర్శకుడు సుజీత్ తన హీరోలను స్టైలిష్‌గా, సరికొత్త యాటిట్యూడ్‌తో ప్రెజెంట్ చేయడంలో దిట్ట. ఈ బ్లడీ రోమియో గ్యాంగ్‌స్టర్ డ్రామా కోసం నానికి రఫ్ అండ్ ట్రెండీ లుక్‌ను డిజైన్ చేశారు. కొత్త హెయిర్‌స్టైల్, స్టైలిష్ స్పెక్స్‌తో కనిపించనున్న నాని మేకోవర్ గ్లింప్స్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ఈ మేకోవర్ వీడియోను మేకర్స్ ఇవాళ (అక్టోబర్ 10) రిలీజ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
చెఫ్ టు గ్యాంగ్‌స్టర్ కాన్సెప్ట్
ఈ బ్లడీ రోమియో చిత్రంలో నాని పాత్ర చాలా విభిన్నమైన షేడ్స్‌తో సాగనుంది. ఒక వైపు నైపుణ్యం కలిగిన చెఫ్‌గా కనిపిస్తూనే, మరోవైపు డేంజరస్ గ్యాంగ్‌స్టర్‌గా అలరించబోతున్నారు. 'ఒక వయొలెంట్ వ్యక్తి నాన్-వయొలెంట్ గా మారితే అతని ప్రపంచం ఎలా తలకిందులైంది' అనే క్రేజీ పాయింట్, డార్క్ హ్యూమర్ తో కథ నడుస్తుందని తెలిసింది.
భారీ ప్రొడక్షన్ & షూటింగ్ ప్లాన్స్
ఈ పాన్-ఇండియా బ్లడీ రోమియో మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ బోయనపల్లి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్‌లో మొదలవుతోందని సమాచారం. హైదరాబాద్, ఢిల్లీలతో పాటు దాదాపు 70 రోజుల పాటు లండన్ పరిసర ప్రాంతాల్లో కీలక షెడ్యూల్ చిత్రీకరించనున్నారని తెలిసింది.
క్రేజీ క్యాస్టింగ్
ఈ బ్లడీ రోమియో మూవీలో హీరోయిన్ గా ప్రీతి ముకుందన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ బ్యూటీఫుల్ హీరోయిన్ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. మరోవైపు ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారని సినీ వర్గాలు అంటున్నాయి.
{{/usCountry}}ఈ బ్లడీ రోమియో మూవీలో హీరోయిన్ గా ప్రీతి ముకుందన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ బ్యూటీఫుల్ హీరోయిన్ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. మరోవైపు ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారని సినీ వర్గాలు అంటున్నాయి.
{{/usCountry}}అలాగే బ్లడీ రోమియో మ్యూజిక్ కోసం ముగ్గురు సంగీత దర్శకులను రంగంలోకి దించుతున్నారని టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తానే తెలుస్తుంది. బ్లడీ రోమియో మూవీని 2027 సమ్మర్ లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.