Nani Movies: నేచురల్ స్టార్ నాని తన కొడుకు అర్జున్ వల్ల సినిమాల ఎంపికలో మార్పులు చేసుకుంటున్నట్లు సంచలన విషయాలు వెల్లడించాడు. రీసెంట్‌గా రిలీజైన తన మాస్ యాక్షన్ థ్రిల్లర్ 'ది పారడైజ్' (The Paradise) ప్రమోషన్లలో మాట్లాడిన నాని.. తన 9 ఏళ్ల కొడుకు ఈ సినిమా చూడటానికి అసలు వీల్లేదని స్పష్టం చేశాడు. 'A' సర్టిఫికేట్ రావడం వల్ల తన కొడుకును ఈ సినిమాకి దూరంగా ఉంచాల్సి వచ్చిందని ఓపెన్‌గా చెప్పాడు.
"నా కొడుకు ముందర కంఫర్ట్‌గా చూడగలగాలి!"

టికెటింగ్ యాప్ 'డిస్ట్రిక్ట్' కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని.. తన స్క్రిప్ట్ సెలెక్షన్ వెనుక ఉన్న అసలు సీక్రెట్‌ను బయటపెట్టాడు. "రేపు నా కొడుక్కి 15 ఏళ్లు వచ్చాక నా సినిమా టీవీలో వస్తే చూసి నేను సిగ్గుపడకూడదు. ఆ సీన్ రాగానే టీవీ ఛానెల్ మార్చేయాల్సిన పరిస్థితి నాకు రాకూడదు" అని క్లారిటీ ఇచ్చాడు.
తన పెంపకం, ఫ్యామిలీ బాండింగ్ తన ఫిల్మ్ ఛాయిస్‌లను చాలా పాజిటివ్‌గా మార్చాయని నాని చెప్పాడు. 'ది పారడైజ్' సినిమా థియేటర్లలోకి వచ్చినప్పుడు "నాన్న నేను ఈ సినిమా చూడొచ్చా?" అని అర్జున్ అడిగితే, "ఇప్పుడు కాదురా.. నువ్వు ఈ సినిమా చూడటానికి రెడీ అయినప్పుడు నేనే చూపిస్తా" అని నచ్చజెప్పినట్లు వెల్లడించాడు.
'A' సర్టిఫికేట్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్ మిస్ అవుతున్నారా?
ఒక నటుడిగా ఎప్పుడూ ఒకే తరహా ఫ్యామిలీ క్లాస్ రోల్స్ చేయలేనని, వైవిధ్యమైన ప్రయోగాలు చేయడం చాలా అవసరమని నాని వ్యాఖ్యానించాడు. 'వి' (V) సినిమా నుంచి తన రూట్ మార్చి 'దసరా', 'సరిపోదా శనివారం', ఇప్పుడు 'ది పారడైజ్' వరకు డార్క్, ఇంటెన్స్ యాక్షన్ రోల్స్ చేస్తూ వస్తున్నానని గుర్తుచేశాడు.
ఇలాంటి ఇంటెన్స్ రోల్స్ చేయాలంటే సినిమాకి కచ్చితంగా ఓ ప్రత్యేకమైన టోన్, రా-నెస్ అవసరమని, అందుకే 'A' సర్టిఫికేట్ వచ్చినా వెనకడుగు వేయలేదని ధీమా వ్యక్తం చేశాడు. క్లాస్, మాస్, ఫ్యామిలీ.. ఇలా ప్రతీ ఆడియెన్‌ని అలరించడమే తన మెయిన్ టార్గెట్ అని స్పష్టం చేశాడు.
క్లాప్ డైరెక్టర్ నుంచి టాప్ హీరో వరకు..
{{/usCountry}}ఇలాంటి ఇంటెన్స్ రోల్స్ చేయాలంటే సినిమాకి కచ్చితంగా ఓ ప్రత్యేకమైన టోన్, రా-నెస్ అవసరమని, అందుకే 'A' సర్టిఫికేట్ వచ్చినా వెనకడుగు వేయలేదని ధీమా వ్యక్తం చేశాడు. క్లాస్, మాస్, ఫ్యామిలీ.. ఇలా ప్రతీ ఆడియెన్‌ని అలరించడమే తన మెయిన్ టార్గెట్ అని స్పష్టం చేశాడు.
క్లాప్ డైరెక్టర్ నుంచి టాప్ హీరో వరకు..
{{/usCountry}}టాలీవుడ్ లో నాని ప్రస్థానం ప్రత్యేకం. లెజండరీ డైరెక్టర్ బాపు దగ్గర అసిస్టెంట్ క్లాప్ డైరెక్టర్ స్థాయి నుంచి టాప్ హీరోల్లో ఒకరిగా ఎదిగిన తీరు అద్భుతం. క్లాప్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు తాను నటీనటులకు ఎక్కడ నిలబడాలి.. ఎలా చేయాలో చెప్పేవాడినని, అప్పుడే తనలోని నటుడు బయటకు వచ్చాడని నాని చెప్పాడు.
ట్రోల్స్‌ని ఎంజాయ్ చేశా.. తప్పులు సరిదిద్దుకుంటా
ది పారడైజ్ సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన మిశ్రమ స్పందన, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై కూడా నాని అత్యంత పరిణతితో స్పందించాడు. "మీరు చూపించిన ప్రేమతో పాటు నాపై వచ్చిన నవ్వు తెప్పించే ట్రోల్స్‌ని కూడా సమానంగా ఎంజాయ్ చేశాను. రివ్యూవర్స్, ఆడియెన్స్ వేలెత్తి చూపించిన తప్పుల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను" అంటూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు.
రక్తం, చెమట చిందించి ఒక డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికే 'ది పారడైజ్' సినిమా తీశామని, ప్రేక్షకుల ఆదరణకు ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పాడు. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, నాని కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఓపెనింగ్స్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించడం విశేషం.