...
...
Next Story

Nani: ఇదో పిచ్చి సినిమా.. రియాక్షన్లు కొత్తగా ఉన్నాయి.. అదే ప్యారడైజ్ గెలుపు.. మోహన్ బాబుతో ప్రేమలో పడిపోతాం: నాని

Nani: నెగెటివ్ లేదా పాజిటివ్.. ఏదైనా కావొచ్చు కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా ది ప్యారడైజ్ మూవీ గురించే చర్చ సాగుతోంది. ఈ మూవీ హీరో నాని కూడా అదే తమ సినిమా విజయమని పేర్కొన్నారు. మీడియా ములాకత్ ఈవెంట్లో ది ప్యారడైజ్ మూవీ గురించి, టీమ్ గురించి నాని చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Published on: Sep 26, 2026, 20:07:18 IST
Advertisement

Nani: భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన ది ప్యారడైజ్ మూవీ స్టార్టింగ్ లోనే షాక్ తగిలింది. ప్రీమియర్స్ తోనే నెగెటివ్ టాక్ వినిపించింది. కానీ ఇప్పుడా టాక్ మారుతుందని అంటున్నారు. అందుకే ది ప్యారడైజ్ మూవీ టీమ్ ఇవాళ (సెప్టెంబర్ 26) మీడియా ములాఖత్ నిర్వహించింది.

నాని కామెంట్లు

ఇదో పిచ్చి సినిమా.. రియాక్షన్లు కొత్తగా ఉన్నాయి.. అదే ప్యారడైజ్ గెలుపు.. మోహన్ బాబుతో ప్రేమలో పడిపోతాం: నాని (x)
ఇదో పిచ్చి సినిమా.. రియాక్షన్లు కొత్తగా ఉన్నాయి.. అదే ప్యారడైజ్ గెలుపు.. మోహన్ బాబుతో ప్రేమలో పడిపోతాం: నాని (x)

మీడియాతో మీట్ లో ది ప్యారడైజ్ హీరో నాని చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ‘‘ది ప్యారడైజ్ మూవీకి వస్తున్న రియాక్షన్ కొత్తగా ఉంది. ఇన్ని సినిమాలు చేశాను కానీ ఎప్పుడూ ఇలా లేదు. ప్యారడైజ్ టాక్ ఒక రకంగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఒక్కో షోకు పాజిటివ్ టాక్ పెరిగిపోతోంది’’ అని నాని పేర్కొన్నారు.

హీరో సినిమా కాదు

‘‘ఆడియన్స్ ప్రేమను యాక్సెప్ట్ చేయాల్సిన టైమ్ వచ్చింది. అందుకే ఈ ఈవెంట్ పెట్టాం. తెలుగు ప్రేక్షకులకు ఎప్పుటికీ రుణపడిపోయి ఉంటా. తెలుగు ఆడియన్స్ వాళ్ల ఒపీనియన్ ను ఎస్టాబ్లిష్ చేయడానికి ఫైట్ చేస్తారు. ప్యారడైజ్ హీరో సినిమా కాదు. సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేసినవాళ్లు ఎంత కష్టపడ్డారో నేను చూశా. మీరందరూ రియల్ హీరోలు’’ అని నాని చెప్పారు.

పిచ్చి సినిమా

‘‘ఇలాంటి పిచ్చి సినిమాకు, అంటే సినిమా అంటే పిచ్చి ఉన్నవాళ్లందరూ కలిసి చేసిన మూవీ. ఈ సినిమాకు ఒక సైలెంట్, మొహమాటస్తుడైన ప్రొడ్యూసర్ ఉన్నారు. సుధాకర్ సైలెంట్ గానే అన్నీ చేశారు. ఇక సంపూ (సంపూర్ణేష్ బాబు)ను చూస్తే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది.

‘‘చిన్నప్పటి నుంచి యాక్టర్ గా మోహన్ బాబు అంటే ఇష్టం. మోహన్ బాబు స్ట్రిక్ట్ అని బయట విని నమ్మా. కానీ మేం కలిశాక నా ఒపీనియన్ మారిపోయింది. ఆయన ఓపెన్ అయిపోతే ఆయనతో అందరూ ప్రేమలో పడిపోతారు. ఒకసారి ఆయన ఓన్ చేసుకున్నారంటే చూపించే ప్రేమ తట్టుకోలేరు. సినిమాలో హీరో పైన ఉన్న హీరో మోహన్ బాబు’’ అని చెప్పారు.

‘‘డైరెక్టర్ శ్రీకాంత్ గురించి చెప్తే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నట్లే ఉంటుంది. అతను ఒరిజినల్ పీస్. శ్రీకాంత్ తో నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటా. నేను అతని గురించి ఎక్కువగా చెప్పలేను. రియాక్షన్లు ఎలా ఉన్నా కూడా ఎక్కడ చూసినా ప్యారడైజ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అదే మా గెలుపు’’ అని నాని తన స్పీచ్ ముగించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks