...
...
Next Story

Paradise Aaya Sher: ఆయా షేర్ సంచలనం.. నాని పాట మరో రికార్డు.. ప్యారడైజ్ నుంచి క్రేజీ అప్‌డేట్.. త్వరలో బిగ్ సర్ ప్రైజ్!

Paradise Aaya Sher: నేచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మూవీ నుంచి మేకర్స్ కీలక అప్‌డేట్ ప్రకటించారు. ఈ సినిమాలోని 'ఆయా షేర్' సాంగ్ 200 మిలియన్ వ్యూస్ దాటింది. ఈ సందర్భంగా త్వరలోనే బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

Published on: Jul 26, 2026, 21:51:57 IST
Advertisement

Paradise Aaya Sher: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' (The Paradise). ఎస్‌ఎల్‌వి సినిమాస్ (SLV Cinemas) పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలోని ఆయా షేర్ సాంగ్ ఓ రికార్డు ఖాతాలో వేసుకుంది.

"ఆయా షేర్" 200 మిలియన్ల వ్యూస్

ఆయా షేర్ సంచలనం.. నాని పాట మరో రికార్డు.. ప్యారడైజ్ నుంచి క్రేజీ అప్‌డేట్.. త్వరలో బిగ్ సర్ ప్రైజ్! (x/TheParadiseOffl)
ఆయా షేర్ సంచలనం.. నాని పాట మరో రికార్డు.. ప్యారడైజ్ నుంచి క్రేజీ అప్‌డేట్.. త్వరలో బిగ్ సర్ ప్రైజ్! (x/TheParadiseOffl)

'ది ప్యారడైజ్' చిత్రం మ్యూజికల్ చార్ట్‌బస్టర్‌గా సరికొత్త రికార్డ్ సృష్టించింది. సంచలన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ చిత్రంలోని 'ఆయా షేర్' (Aaya Sher) మాస్ సాంగ్ ఏకంగా 200 మిలియన్ల డిజిటల్ వ్యూస్ సాధించి దూసుకుపోతోంది. ఈ గ్రాండ్ మైలురాయిని సెలబ్రేట్ చేసుకుంటూ మూవీ మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.

సర్ ప్రైజ్ అప్‌డేట్

ఆయా షేర్ సాంగ్ 200 మిలియన్ వ్యూస్ అందుకున్న సందర్భంగా మేకర్స్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఫ్యాన్స్‌ను థ్రిల్ చేసేలా త్వరలోనే ఈ సినిమా నుంచి ఒక భారీ సర్ ప్రైజ్ అప్‌డేట్ రాబోతోందని అధికారికంగా వెల్లడించారు.

మొదట మే నెలలో, ఆ తర్వాత ఆగస్టుకు వాయిదా పడి, మరోసారి కొత్త విడుదల తేదీ కోసం సన్నాహాలు చేసుకుంటోంది ది ప్యారడైజ్ మూవీ. రిలీజ్ ఆలస్యమవుతున్నప్పటికీ, ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ చిన్న వార్త సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తూనే ఉంది.

కొత్త రిలీజ్ డేటా?

ది ప్యారడైజ్ నుంచి వచ్చే సర్ ప్రైజ్ ఏంటీ అని ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తుండగానే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. ‘ది ప్యారడైజ్ టీజర్ సూన్’ అని ఓ పోస్టు పెట్టాడు. కాయాదు లోహర్ (Kayadu Lohar) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్, బాబు మోహన్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

హైప్ మరింతగా

ట్రేడ్ విశ్లేషణ ప్రకారం సినిమా రిలీజ్ వాయిదా పడినప్పటికీ, అనిరుధ్ అందించిన చార్ట్‌బస్టర్ మ్యూజిక్, విజువల్ ప్రామిస్ వల్ల ది ప్యారడైజ్ సినిమాపై పాన్-ఇండియా స్థాయిలో బిజినెస్ అంచనాలు నిలకడగా ఉన్నాయి. మేకర్స్ త్వరలో అందించబోయే తదుపరి అప్‌డేట్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ హైప్‌ను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe