The Paradise: స్క్రీన్‌పై విజువ‌ల్ ట్రీట్‌-నోట్లో క‌మ్మ‌గా క‌రిగే స్నాక్‌-ది ప్యార‌డైజ్ సినిమా థియేట‌ర్ల‌లో స‌ర్వ‌పిండి!

The Paradise: స్క్రీన్ పై నాని మాస్ రా అండ్ రస్టిక్ యాక్టింగ్ చూస్తూ.. నోట్లో కమ్మగా కరిగే సర్వపిండి తింటే ఎలా ఉంటుంది? ఆ మజానే వేరు. ఇప్పుడు అదే నిజం కాబోతుంది. నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ మూవీ స్క్రీనింగ్ సందర్భంగా థియేటర్లలో సర్వపిండిని అందుబాటులోకి తేబోతున్నారు. 

Published on: Sep 23, 2026, 12:41:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

The Paradise: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ మాస్ డ్రామా 'ది పారడైజ్' (The Paradise). ఈ మూవీ ప్రీమియర్స్ తో ఈ రోజు నుంచి రచ్చ చేయడానికి రెడీ అయింది. అయితే తెలంగాణ సంస్కృతి, యాస, లైఫ్‌స్టైల్‌ను రా అండ్ రస్టిక్‌గా చూపించనున్న ఈ మూవీ.. తెలంగాణ రుచులను కూడా అందించనుంది.

స్క్రీన్‌పై విజువ‌ల్ ట్రీట్‌-నోట్లో క‌మ్మ‌గా క‌రిగే స్నాక్‌-ది ప్యార‌డైజ్ సినిమా థియేట‌ర్ల‌లో స‌ర్వ‌పిండి!
స్క్రీన్‌పై విజువ‌ల్ ట్రీట్‌-నోట్లో క‌మ్మ‌గా క‌రిగే స్నాక్‌-ది ప్యార‌డైజ్ సినిమా థియేట‌ర్ల‌లో స‌ర్వ‌పిండి!

థియేటర్‌లో నోరూరించే సర్వపిండి

ది ప్యారడైజ్ సినిమాలోని తెలంగాణ కల్చర్‌ను కేవలం తెరపైనే కాకుండా థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌లోనూ అందిస్తూ మైత్రి మూవీ మేకర్స్ ఒక క్రేజీ అండ్ యునిక్ ఐడియాతో ముందుకొచ్చింది. హైదరాబాద్‌లోని మైత్రి విమల్ (Vimal), శివగంగ (Shiva Ganga) థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు తెలంగాణ సంప్రదాయ పిండి వంటకమైన 'సర్వపిండి' (Sarvapindi) ని స్పెషల్ మెనూగా అందుబాటులోకి తీసుకురానుంది.

విజువల్ ట్రీట్ తో పాటు

నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ రేపు (సెప్టెంబర్ 24) రిలీజ్ కానుంది. ఈ రోజు సాయంత్రం ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఇక బిగ్ స్క్రీన్ పై విజువల్ ట్రీట్ ఖాయమనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ఆడియన్స్ ను ఫుడ్ ట్రీట్ కూడా ఇచ్చేందుకు సర్వపిండితో మైత్రి మూవీ మేకర్స్ సిద్ధమవుతోంది.

సినిమా చూస్తూ లోకల్ డెలికసీని ఆస్వాదించేలా చేసిన ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ ప్రస్తుతం నగరంలో తెగ వైరల్ అవుతోంది. మూవీతో పాటు సర్వపిండిని కూడా ఎంజాయ్ చేస్తామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంటర్వెల్ లో మంచి ట్రీట్ అని పేర్కొంటున్నారు. కానీ రేట్లు మరీ ఎక్కువగా పెట్టకండని రిక్వెస్ట్ చేస్తున్నారు.

మైత్రి పక్కా గేమ్‌ప్లాన్!

రోటీన్ కమర్షియల్ పీఆర్ స్టంట్స్ పక్కనపెట్టి, సినిమా కథలోని ఆత్మను ప్రేక్షకులకు ఫిజికల్‌గా అనుభూతి చెందేలా చేయడం ఒక బ్రిలియంట్ మార్కెటింగ్ ఐడియా అని చెప్పొచ్చు. తెలంగాణ ఐడెంటిటీని, స్థానిక వంటకమైన సర్వపిండితో ముడిపెట్టడం వల్ల నైజాం బెల్ట్‌లో 'కల్చరల్ ప్రైడ్' పెరిగి ఆడియన్స్‌లో విపరీతమైన క్యూరియాసిటీ జనరేట్ అవుతోంది.

శ్రీకాంత్ ఓదెల రస్టిక్ వరల్డ్ బిల్డింగ్, అనిరుధ్ హై-వోల్టేజ్ బిజిఎమ్, మైత్రి మూవీ మేకర్స్ లోకల్ కల్చరల్ ప్రమోషన్స్ అన్నీ కలసి 'ది ప్యారడైజ్' ప్రీమియర్ షోలకు నభూతో నభవిష్యత్ రేంజ్ ఓపెనింగ్స్‌ను రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. నేటి ప్రీమియర్ షోలకు టాక్ పాజిటివ్‌గా వస్తే, ఈ చిత్రం మొదటి రోజే ఆల్-టైమ్ నైజాం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయనుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More