...
...
Next Story

Paradise Release Date: ప్యారడైజ్ కూడా అప్పుడేనా? దసరా సీజన్ సినిమా రేస్ మామూలుగా లేదు.. నాని నుంచి చిరంజీవి వరకు!

Paradise Release Date: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ పై లేటెస్ట్ బజ్ వైరల్ గా మారింది. ఈ మూవీ కొత్త విడుదల తేదీ ఇదేనంటూ పోస్టులు తెగ చక్కర్లు కొడుతున్నాయి. నాని సినిమా కూడా దసరా సీజన్ రేసులో దిగేలా కనిపిస్తోంది.

Published on: Jul 3, 2026, 10:20:35 IST
Advertisement

Paradise Release Date: మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise) రిలీజ్ డేట్ మారనుందనే టాక్ వైరల్ అవుతోంది. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటోంది.

ప్యారడైజ్ రిలీజ్ డేట్

ప్యారడైజ్ కూడా అప్పుడేనా? దసరా సీజన్ సినిమా రేస్ మామూలుగా లేదు (x/TheParadiseOffl)
ప్యారడైజ్ కూడా అప్పుడేనా? దసరా సీజన్ సినిమా రేస్ మామూలుగా లేదు (x/TheParadiseOffl)

నిజానికి ప్యారడైజ్ మూవీని ఆగస్టు 21న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను సెప్టెంబర్ 25, 2026 (శుక్రవారం) న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందని టాక్.

దీనికి ఒక రోజు ముందు, అంటే సెప్టెంబర్ 24న (గురువారం) ఓవర్సీస్‌తో పాటు పలు ప్రాంతాల్లో గ్రాండ్ ప్రీమియర్స్ వేయడానికి డిస్ట్రిబ్యూటర్లను సన్నద్ధం కావాలని మేకర్స్ సమాచారం అందించారని తెలిసింది.

షూటింగ్ అప్ డేట్

​అయితే మిగిలిన షూటింగ్, గ్రాఫిక్స్ పనులు అనుకున్న సమయానికి పూర్తయితేనే ఈ డేట్‌ను నాని ప్యారడైజ్ మూవీ ప్రకటించే అవకాశముంది. ప్రస్తుతం ఈ నెలాఖరుకల్లా లేదా ఆగస్టు మధ్య నాటికి టాకీ పార్ట్ మొత్తాన్ని క్లోజ్ చేయాలని టీమ్ పక్కా ప్లాన్‌తో ఉంది.

సినిమాకు అత్యంత కీలకమైన భారీ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్‌తో పాటు ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ షూటింగ్ మాత్రమే ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఐటమ్ సాంగ్ కోసం రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం పవర్‌ఫుల్ ట్యూన్‌ను రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఆ ట్యూన్ లాక్ అవ్వగానే సాంగ్ షూటింగ్‌ను కూడా పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేయనున్నారు.

2026 దసరా లైనప్

ఒకవేళ పైన పేర్కొన్న సినిమాలన్నీ అనుకున్న తేదీలకే వస్తే, కేవలం మూడు వారాల వ్యవధిలోనే నాని, వెంకటేష్, రజనీకాంత్, చిరంజీవి వంటి స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద తలపడనున్నారు. ముఖ్యంగా అక్టోబర్ మధ్యలో వచ్చే దసరా పండుగ వారంలో ‘జైలర్ 2’, ‘విశ్వంభర’ చిత్రాలు ఒకే రోజు తేడాతో థియేటర్లలోకి దిగడం ట్రేడ్ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ పోటీలో ఏ సినిమా నిలబడుతుంది, ఏది బాక్సాఫీస్ విజేతగా నిలుస్తుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe