Nani: ది ప్యారడైజ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న నేచురల్ స్టార్ నాని వరుసగా పాన్ ఇండియా ప్రెస్ మీట్లతో సాగిపోతున్నారు. రీసెంట్ గా బెంగళూరులో ప్రెస్ తో నాని మాట్లాడారు. ఆ సమయంలో 'ది పారడైజ్' సినిమాలో తాను పోషించిన 'జడల్' పాత్ర గురించి మాట్లాడుతూ నాని నేటి తరం మహిళల హెయిర్‌స్టైల్స్‌పై వ్యాఖ్యలు చేశారు.
నాని కామెంట్లు

ఈ రోజుల్లో మహిళలు జడలు వేసుకోవడం మానేశారని, జడలు వేసుకుంటే మహిళలు చాలా అందంగా కనిపిస్తారని నాని చెప్పారు. మన తల్లుల కాలంలో జుట్టుకు నూనె రాసి జడ వేసేవారని, కానీ ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ ప్రభావం వల్ల జడలు వేసుకోవడం తగ్గిపోయి జుట్టు రాలే సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు.
ఈ క్రమంలో ప్రెస్ మీట్‌లో ఉన్న ఒక లేడీ జర్నలిస్ట్‌ను చూపిస్తూ మీరు కూడా జడ వేసుకోలేదని నాని అనడం చర్చకు దారితీసింది.
లేడీ రిపోర్టర్ కౌంటర్
నాని వ్యాఖ్యలకు మరో లేడీ రిపోర్టర్ నవ్వుతూనే ఓ కౌంటర్ వేశారు. ‘‘మీరు జడలు పెంచుకొని చెప్పి ఉంటే మేం ఓకే చెప్పేవాళ్లం. మీరు జుట్టు పెంచుకోలేదు. విగ్ పెట్టుకున్నారు. మీరు ఇక్కడికి వచ్చి ఇలా చెప్తే ఎవరు వింటారు’’ అని ఆ రిపోర్టర్ తిరిగి ప్రశ్నించారు.
నాని ఆన్సర్
లేడీ రిపోర్టర్ కౌంటర్ కు నాని నవ్వుతూనే స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. ‘‘నేనెవరు? యాక్టర్ ను. నేను నటిస్తా. నేను సినిమాలో ఏడుస్తా. మీరు రియల్ లైఫ్ లో ఏడుస్తారు. నేను సినిమాలో పెంచుకున్నా. మిమ్మల్ని రియల్ లైఫ్ లో పెంచుకోమంటున్నా’’ అని నాని రిప్లే ఇచ్చారు.
అయితే.. ప్రశాంతంగా జడ వేసుకోవడానికి, జుట్టుపై రోజూ కేర్ తీసుకోవడానికి నేటి మహిళలకు తగినంత సమయం ఉండదని, అది ఎంతో శ్రమతో కూడుకుందని ఆ అమ్మాయి చెప్పారు. నాని చివరకు వారి సమస్యను అంగీకరిస్తూ మహిళల పట్ల తనకు గౌరవం ఉందని చెప్పారు.
{{/usCountry}}అయితే.. ప్రశాంతంగా జడ వేసుకోవడానికి, జుట్టుపై రోజూ కేర్ తీసుకోవడానికి నేటి మహిళలకు తగినంత సమయం ఉండదని, అది ఎంతో శ్రమతో కూడుకుందని ఆ అమ్మాయి చెప్పారు. నాని చివరకు వారి సమస్యను అంగీకరిస్తూ మహిళల పట్ల తనకు గౌరవం ఉందని చెప్పారు.
{{/usCountry}}నెట్టింట ట్రోలింగ్
ఈ ప్రెస్ మీట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే నెటిజన్లు రెండుగా విడిపోయి స్పందించారు. కొంతమంది ఈ సంభాషణను సరదాగా తీసుకున్నప్పటికీ, మెజారిటీ నెటిజన్లు నాని వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మగాళ్లు ఎప్పుడూ షార్ట్స్, బనియన్లతో తిరుగుతున్నప్పుడు సంస్కృతి గుర్తుకురాదా అని, తమ జుట్టు విషయాల్లో ఉచిత సలహాలు ఇవ్వడం ఆపాలని కామెంట్లు చేస్తున్నారు.
ది ప్యారడైజ్ రిలీజ్ డేట్
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరెకెక్కుతున్న 'ది ప్యారడైజ్' చిత్రంలో నాని సరసన కాయదు లోహర్ హీరోయిన్ గా నటించింది. మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.