...
...
Next Story

OTT Telugu: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో క్రైమ్ థ్రిల్లర్- పసుపు కుంకుమ సీరియల్‌తో ప్రయాణం మొదలైందన్న హీరో నరేష్ అగస్త్య

Naresh Agastya About Serial Over Rudravanam PS OTT Release: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రుద్రవనం పీఎస్ రానుంది. ఈ ఓటీటీ స్ట్రీమింగ్ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నరేష్ అగస్త్య, డైరెక్టర్ హరీష్ శంకర్ కామెంట్స్ చేశారు.

Published on: Oct 29, 2026, 11:00:19 IST
Advertisement

Naresh Agastya About Serial Over Rudravanam PS OTT Streaming: ఎల్లో ఫ్లవర్స్, శ్రీ చక్ర మూవీస్ బ్యానర్ల మీద రమేష్ పుప్పాల, సూర్యకాంతి నిర్మాతలుగా శశిధర్ మున్నంగి తెరకెక్కించిన న్యూ ఓటీటీ సిరీస్ ‘రుద్రవనం పీఎస్’.

రుద్రవనం పీఎస్ ఓటీటీ స్ట్రీమింగ్

ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో క్రైమ్ థ్రిల్లర్- పసుపు కుంకుమ సీరియల్‌తో ప్రయాణం మొదలైందన్న హీరో నరేష్ అగస్త్య
ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో క్రైమ్ థ్రిల్లర్- పసుపు కుంకుమ సీరియల్‌తో ప్రయాణం మొదలైందన్న హీరో నరేష్ అగస్త్య

తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన రుద్రవనం పీఎస్ ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో రానుంది. జీ5లో రుద్రవనం పీఎస్ ఓటీటీ రిలీజ్ కానుంది. రేపటి (అక్టోబర్ 30) నుంచి జీ5లో రుద్రవనం పీఎస్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

ఈ నేపథ్యంలో బుధవారం (అక్టోబర్ 28) నాడు రుద్రవనం పీఎస్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ హరీష్ శంకర్‌తోపాటు హీరో నరేష్ అగస్త్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మిరపకాయ్ టైంలో ఎంకరేజ్ చేశారు

హరీష్ శంకర్ మాట్లాడుతూ .. "మా నిర్మాత రమేష్ పుప్పాల గారిని మళ్లీ ఇలా చూడటం ఆనందంగా ఉంది. ‘మిరపకాయ్’ టైంలో రమేష్ గారు నన్నెంతో ఎంకరేజ్ చేశారు. రాజా రవీంద్ర సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. వివేక్ కూచిభోట్ల గారు నా ఫ్యామిలీ మెంబర్‌లాంటి వారు" అని అన్నారు.

హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ .. "పన్నెండేళ్ల క్రితం జీ5లో ‘పసుపు కుంకుమ’ (సీరియల్)తో నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ‘పరువు’, ‘వికటకవి’ ఓటీటీ సిరీసులు చేశాను. ఇప్పుడు ‘రుద్రవనం పీఎస్’ అంటూ రాబోతోన్నాం. నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన జీ5 ఓటీటీ టీంకు థాంక్స్" అని చెప్పారు.

"నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన సూర్యకాంతి గారికి, రమేష్ గారికి థాంక్స్. శశితో నేను ఎన్నో కథల్ని చర్చించాను. అతని వద్ద ఇంకా చాలా గొప్ప గొప్ప కథలున్నాయి. శశి, అష్కర్ ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపారు. ఈ సిరీస్‌లో ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. అక్టోబర్ 30 నుంచి ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి" అని కోరారు హీరో నరేష్ అగస్త్య.

ప్రతీ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా

దర్శకుడు శశిధర్ మున్నంగి మాట్లాడుతూ .. "‘రుద్రవనం పీఎస్’ క్రైమ్, థ్రిల్లర్‌గా రాబోతోంది. ప్రతీ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తెలుగులో గొప్ప క్రైమ్, థ్రిల్లర్‌గా నిలుస్తుంది. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన జీ5 టీంకి, నా నిర్మాతలు, నా ఆర్టిస్టులకు థాంక్స్. జీ5లో అక్టోబర్ 30 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి" అని అన్నారు.

"‘రుద్రవనం పీఎస్’ సిరీస్‌ను మా దర్శకుడు శశి గారు అద్భుతంగా తెరకెక్కించారు. మా ప్రాజెక్ట్‌కి ఎంతో సపోర్ట్ చేసిన జీ5 టీంకి థాంక్స్. హరీష్ శంకర్ గారి వల్లే నేను ఈ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఈ రోజు మా కోసం ఆయన రావడం ఆనందంగా ఉంది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నా టీంకి థాంక్స్" అని నిర్మాత రమేష్ చెప్పారు.

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్

"‘రుద్రవనం పీఎస్’లోని ప్రతీ ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టించకుండా ఉంటుంది. జీ5 టీం ఇచ్చిన సపోర్ట్‌ని మేం ఎప్పుడూ మర్చిపోలేం. మా కోసం వచ్చిన హరీష్ శంకర్ గారికి థాంక్స్. మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా, సోషల్ మీడియాకు ధన్యవాదాలు. అక్టోబర్ 30 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అందరూ చూడండి" అని కోరారు ప్రొడ్యూసర్ సూర్యక్రాంతి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks