మరో సంక్రాంతి సినిమా రిలీజ్ కు సై అంటోంది. శర్వానంద్ హీరోగా నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ ట్రైలర్ ను ఇవాళ (జనవరి 11) మేకర్స్ రిలీజ్ చేశారు. పంచ్ డైలాగ్ లు, మీమ్స్ తో ఈ ట్రైలర్ కడుపుబ్బా నవ్వించేలా ఉంది. అంతే కాకుండా ఇళయరాజాపై ఓ కౌంటర్ కూడా ఉంది. మరోవైపు మూవీ రిలీజ్ టైమ్ లో ఓ ట్విస్ట్ కూడా ఉంది.
నారీ నారీ నడుమ మురారి ట్రైలర్

సంక్రాంతి 2026 రేసులోకి రాబోతున్న మరో సినిమా నారీ నారీ నడుమ మురారి. ఈ మూవీ జనవరి 14న రిలీజ్ కానుంది. పండగ రోజున ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రాబోతుంది. ఈ మూవీ ట్రైలర్ ను ఆదివారం రిలీజ్ చేశారు మేకర్స్. ఇద్దరు భామల మధ్య నలిగిపోయే మగాడిగా శర్వానంద్ నటించాడు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఫుల్ కామెడీతో సాగిపోతుంది.
కామెడీ ఎంటర్ టైనర్
ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా నారీ నారీ నడుమ మురారి ట్రైలర్ ను రెడీ చేశారు. సత్య ఒక మహిళను హాస్పిటల్ కు ఆటోలో తీసుకొచ్చి, నేను ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గర డబ్బులు తీసుకోనని అంటాడు. నేను గర్భిణిని కాదని ఆమె చెప్తే, ఏంటీ అది పొట్టా? అనే డైలాగ్ నుంచి లాస్ట్ వరకూ ట్రైలర్ లో కామెడీ పండింది. ఇద్దరమ్మాయిలు గౌతమ్ (శర్వానంద్)ను లవ్ చేస్తారు. ఇంజినీరింగ్ చదివి ఆర్కిటెక్ట్ గా పని చేస్తున్న అంకుల్ అని చెప్తాడు గౌతమ్. మరి ఇంజినీరింగ్ ఎందుకు చేశావంటే? ఆ ప్రశ్నకు బీటెక్ చదివిన ఏ కుర్రాడు ఆన్సర్ చెప్పడని పంచ్ వేస్తాడు.
ఎక్స్ లవర్ తిరిగొస్తే
సాఫీగా సాగిపోతున్న హీరో లవ్ స్టోరీలోకి ఎక్స్ లవర్ తిరిగొస్తే ఎలా ఉంటుదనేది కామెడీ జనరేట్ చేసింది. గౌతమ్ ఎక్స్ లవర్ క్యారెక్టర్ లో సంయుక్త నటించింది. ప్రజెంట్ లవర్ గా సాక్షి వైద్య చేసింది. మధ్యలో సునీల్ మార్క్ కామెడీ హైలైట్ గా నిలిచింది.
రాజా గారి పాట వద్దని
{{/usCountry}}సాఫీగా సాగిపోతున్న హీరో లవ్ స్టోరీలోకి ఎక్స్ లవర్ తిరిగొస్తే ఎలా ఉంటుదనేది కామెడీ జనరేట్ చేసింది. గౌతమ్ ఎక్స్ లవర్ క్యారెక్టర్ లో సంయుక్త నటించింది. ప్రజెంట్ లవర్ గా సాక్షి వైద్య చేసింది. మధ్యలో సునీల్ మార్క్ కామెడీ హైలైట్ గా నిలిచింది.
రాజా గారి పాట వద్దని
{{/usCountry}}ట్రైలర్ లో ఇళయరాజాకు కౌంటర్ వేసేలా ఉన్న సీన్ కూడా ఉంది. ఓ మంచి రీల్ చేద్దాం, రాజాగారి పాట పెట్టమని హీరో అడుగుతాడు. రాజా గారి పాట వద్దులే మామా, కేసులు వేస్తున్నాడంటా అని కమెడియన్ సత్య చెప్తాడు. తన పాటలను ఇతర సినిమాల్లో వాడినందుకు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కౌంటర్ వేసినట్లు అర్థమవుతోంది.
రిలీజ్ టైమ్
నారీ నారీ నడుమ మురారి మూవీ జనవరి 14న రిలీజ్ కానుంది. అయితే సాధారణంగా ఏ మూవీ అయినా మార్నింగ్ షోతో సినిమా రిలీజ్ అవుతుంది. కానీ నారి నారి నడుమ మురారి మూవీ జనవరి 14న సాయంత్రం 5.49 గంటలకు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని ట్రైలర్ లో స్పష్టం చేశారు మేకర్స్. అదే రోజు అనగనగా ఒక రాజు సినిమా రిలీజ్ కూడా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.