Yami Gautam: 2012లో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించిన 'విక్కీ డోనర్' (Vicky Donor) చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి ఓవర్‌నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న నటి యామీ గౌతమ్ (Yami Gautam). తొలి సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత ఆమెకు బాలీవుడ్ లో సరైన అవకాశాలు రాలేదు. తాజాగా ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన యామీ దీనిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
హిమాచల్‌కు వెళ్లిపోదామనుకున్నా

తొలి సినిమా సక్సెస్ అయినప్పటికీ, తనను ఒక సాధారణ హీరోయిన్‌గా పరిగణించకపోవడం వల్ల చాలా ఏళ్ల పాటు మంచి పాత్రలు రాలేదని యామీ గౌతమ్ చెప్పింది.
"ఉరి, బాలా సినిమాలకు ముందు నేను బాలీవుడ్ సినీ పరిశ్రమను వదిలేయాలని డిసైడ్ అయ్యాను. హిమాచల్ ప్రదేశ్‌లోని మా సొంత ఊరికి వెళ్లిపోదామనుకున్నాను. అక్కడ మాకు వ్యవసాయ భూమి ఉంది. నటనను వదిలేసి ఒక సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నాను’’ అని యామీ గౌతమ్ వెల్లడించింది.
నా లైఫ్ మారిపోయింది
"ఈ విషయం మా తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారు నాకు పూర్తి మద్దతు ఇచ్చారు. 'ఏం పర్లేదు, ఇంటికి వచ్చేయ్' అని ధైర్యం చెప్పారు. విచిత్రం ఏంటంటే.. ఎప్పుడైతే ఇండస్ట్రీపై ఉన్న భయాన్ని, ఆరాటాన్ని వదిలేశానో, అప్పుడే నా జీవితం మలుపు తిరిగింది. 'ఉరి', 'బాలా' సినిమాలు వచ్చాయి. రాత్రికి రాత్రే నా లైఫ్ మారిపోయింది" అని యామీ గౌతమ్ పేర్కొంది.
2019లో విడుదలైన 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' (Uri: The Surgical Strike), 'బాలా' (Bala) సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి, నటిగా యామీ గౌతమ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాయి.
స్టార్ కిడ్స్ సంస్కృతి
ఇండస్ట్రీలో నెపోటిజం, స్టార్ కిడ్స్‌కు లభించే అవకాశాలపై యామీ గౌతమ్ ఘాటుగా స్పందించింది. "ఇండస్ట్రీలో ఔట్సైడర్గా ఉండటం కష్టం కాదు, కానీ ప్రతీసారి మనల్ని మనం నిరూపించుకోవాల్సి రావడం నిజంగా నరకం. ఒక మంచి పాత్రకు మనం పర్ఫెక్ట్ అని భావించినా, అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న కుటుంబాల వ్యక్తులకే ఆ అవకాశం వెళ్తుంది.
{{/usCountry}}ఇండస్ట్రీలో నెపోటిజం, స్టార్ కిడ్స్‌కు లభించే అవకాశాలపై యామీ గౌతమ్ ఘాటుగా స్పందించింది. "ఇండస్ట్రీలో ఔట్సైడర్గా ఉండటం కష్టం కాదు, కానీ ప్రతీసారి మనల్ని మనం నిరూపించుకోవాల్సి రావడం నిజంగా నరకం. ఒక మంచి పాత్రకు మనం పర్ఫెక్ట్ అని భావించినా, అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న కుటుంబాల వ్యక్తులకే ఆ అవకాశం వెళ్తుంది.
{{/usCountry}}ప్లాప్‌లు వచ్చినా వారికి మళ్లీ మళ్లీ అవకాశాలు వస్తాయి. అదే అవకాశాలు మాకు ఇస్తే మేం కూడా నటులుగా ఎదుగుతాం కదా అనే బాధ ఉండేది" అని యామీ గౌతమ్ ఆవేదన వ్యక్తం చేసింది.
ఆ ఛాన్స్ లు
కొన్ని సినిమాల చర్చలు చివరి నిమిషంలో ఎలాంటి కారణం లేకుండా ఆగిపోయేవని, ఆ సమయంలో తీవ్రంగా బాధపడ్డానిన యామీ తెలిపింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయని, ప్రేక్షకులు కేవలం నటనను, మంచి కథలనే ఆదరిస్తున్నారని, ఇది రాబోయే తరం నటీనటులకు గొప్ప అవకాశమని యామీ ఆశాభావం వ్యక్తం చేసింది.
నేషనల్ అవార్డు
యామీ గౌతమ్ తాజాగా నేషనల్ ఫిల్మ్ అవార్డుకు ఎంపికైంది. ఆర్టికల్ 370 సినిమాకు గాను బెస్ట్ హీరోయిన్ గా ఆమెకు అవార్డు దక్కింది. 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో భాగంగా యామీ గౌతమ్ ఈ పురస్కారాన్ని సొంతం చేసుకుంది.