న‌వీన్ చంద్ర మ‌రో థ్రిల్ల‌ర్‌-సైక‌లాజిక‌ల్ హార‌ర్ మూవీ హ‌నీ టీజ‌ర్ ఔట్-వెన్నులో వ‌ణుకు పుట్టించేలా

థ్రిల్లర్ సినిమాలతో అదరగొట్టే నవీన్ చంద్ర మరో సరికొత్త థ్రిల్లర్ తో ఆడియన్స్ ను భయపెట్టేందుకు వచ్చేస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ టీజర్ రీసెంట్ గా రిలీజైంది. ఈ టీజర్ వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. 

Published on: Jan 21, 2026 1:42 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డిఫరెంట్ స్టోరీ లైన్ ఉన్న సినిమాలు చేస్తూ, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నవీన్ చంద్ర మరో థ్రిల్లర్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాడు. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘హనీ’తో థియేటర్లకు రాబోతున్నాడు నవీన్ చంద్ర. ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజైంది.

హనీ సినిమాలో నవీన్ చంద్ర
హనీ సినిమాలో నవీన్ చంద్ర

హనీ టీజర్

సైకలాజికల్ థ్రిల్లర్ గా హనీ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ టీజర్ రిలీజైంది. ఈ చిత్రం నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ తో మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజిక్ ఎలిమెంట్స్ తో ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. వెన్నులో వణుకు పుట్టించేలా వున్న టీజర్ సినిమాపై అమాంతం ఆసక్తిని పెంచింది.

ఉత్కంఠ రేపేలా

హనీ మూవీ టీజర్ ఉత్కంఠ రేపేలా ఉంది. ఈ సినిమాలో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, దివి, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్నారు. కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ మూవీ హనీ. ఓవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది.

చేతబడులు

మూఢ నమ్మకాలు, మంత్రాలు, చేతబడుల చుట్టూ హనీ కథ సాగుతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు చూసిన హారర్ కు భిన్నంగా, హనీ టీజర్ పూర్తిగా రిచ్యువల్ బేస్ట్ హారర్ తో.. నిశ్శబ్దం, చీకటి, మర్మమైన చూపులు, తెలియని శక్తులు— ఇవన్నీ కలిసి ఒక మార్మిక ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నాయి.

దర్శకుడు కరుణ కుమార్ ఇప్పటివరకు ఎన్నడూ చూడని కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడనే సంకేతాలు టీజర్‌లో బలంగా వినిపిస్తున్నాయి. హారర్‌ను కేవలం భయపెట్టే అంశంగా కాకుండా ఊహకు అతీతంగా ప్రజెంట్ చేస్తున్న విధానం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ “ఏదో పెద్ద రహస్యం దాగుంది” అన్న ఫీలింగ్ కలుగుతుంది.

నవీన్ చంద్ర లుక్

నవీన్ చంద్ర లుక్, పెర్ఫార్మెన్స్ స్టన్నింగ్ గా ఉండబోతుందనే టీజర్ టాక్ వినిపిస్తోంది. దివి, రాజా రవీంద్ర పాత్రలు కూడా భిన్నంగా కనిపించాయి. అజయ్ అరసాడ సంగీతం, బీజీఎం గూస్ బంప్స్ తెప్పించింది. ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, నాగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

హనీ రిలీజ్ డేట్

సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాల సమ్మేళనంతో రూపొందిన ‘హనీ’ ఫిబ్రవరి 6న ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 6, 2026న థియేటర్లలోకి రానుంది ఈ మూవీ.