తెలుగు క్రేజీ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన లేటెస్ట్ కామెడీ మూవీ అనగనగా ఒక రాజు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాతో మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇవాళ ఈ సినిమా రిలీజ్ కానుంది. రెండు రోజుల ముందు జరిగిన అనగనగా ఒక రాజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నవీన్ పోలిశెట్టి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వరంగల్‌లోనే జరిగింది

నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. "జాతిరత్నాలు ప్రీ రిలీజ్ వేడుక కూడా ఈ వరంగల్ ప్రాంతంలోనే జరిగింది. ఇప్పుడు 'అనగనగా ఒక రాజు' ప్రీ రిలీజ్ వేడుక ఇక్కడ జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.
పది షోలు మాత్రమే
"'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమా సమయంలో మాకు షోలు కూడా దొరకని పరిస్థితి. పది షోలు మాత్రమే ఇస్తామన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ సినిమాని మీరు మౌత్ టాక్‌తో పెద్ద హిట్ చేశారు. నా ప్రతి సినిమాకి ప్రేక్షకులే మార్కెటింగ్ చేస్తుంటారు. నా సినిమాని భుజాల మీద మోస్తూ ముందుకు తీసుకువెళ్తున్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు" అని నవీన్ పోలిశెట్టి తెలిపాడు.
రెట్టింపు వినోదం అందించాలని
"మీ ప్రేమ, మీ అభిమానం, మీరు నాకు అందించిన మూడు విజయాలు.. నాలో ఎంతో ఎనర్జీని నింపాయి. ఆ ఎనర్జీకి రెట్టింపు వినోదాన్ని మీకు అందించాలని అనుకున్నాను. ఈ క్రమంలోనే 'అనగనగా ఒక రాజు' కథ రాయడం జరిగింది. టీంలో ప్రతి ఒక్కరూ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు" అని నవీన్ పోలిశెట్టి పేర్కొన్నాడు.
అదే నమ్మకంతో టికెట్ బుక్ చేసుకోండి
"మీరు ఏ నమ్మకంతో అయితే నా సినిమాలకు వచ్చి, వాటిని హిట్ చేశారో.. అదే నమ్మకంతో 'అనగనగా ఒక రాజు'కి టికెట్స్ బుక్ చేసుకోండి. ఆలస్యమైనా కానీ మంచి సినిమా అందించాలనేదే మా ప్రయత్నం. అలాంటి ప్రయత్నంలోనే ఈ 'అనగనగా ఒక రాజు' సినిమా వస్తుంది" అని చెప్పాడు హీరో నవీన్ పోలిశెట్టి.
నిల్చుని చప్పట్లు కొట్టారు
{{/usCountry}}"మీరు ఏ నమ్మకంతో అయితే నా సినిమాలకు వచ్చి, వాటిని హిట్ చేశారో.. అదే నమ్మకంతో 'అనగనగా ఒక రాజు'కి టికెట్స్ బుక్ చేసుకోండి. ఆలస్యమైనా కానీ మంచి సినిమా అందించాలనేదే మా ప్రయత్నం. అలాంటి ప్రయత్నంలోనే ఈ 'అనగనగా ఒక రాజు' సినిమా వస్తుంది" అని చెప్పాడు హీరో నవీన్ పోలిశెట్టి.
నిల్చుని చప్పట్లు కొట్టారు
{{/usCountry}}మేము ఇప్పటికే సినిమాని చాలాసార్లు చూసుకున్నాము. అలాగే చిత్ర బృందంలో భాగం కాని కొందరికి ప్రత్యేక షోలు వేసి సినిమా చూపించాము. వారు సినిమా చూస్తున్నంతసేపూ కడుపుబ్బా నవ్వుతూనే ఉన్నారు. అలాగే భావోద్వేగ సన్నివేశాలు చూసి హత్తుకున్నారు. సినిమా అయిపోగానే అందరూ నిల్చొని చప్పట్లు కొట్టారు. ఇలాంటి స్పందన చూసి మాకు చాలా సంతోషం కలిగింది" అని నవీన్ పోలిశెట్టి వెల్లడించాడు.
మూడు విజయాల తర్వాత
ఇదిలా ఉంటే, మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి ఇప్పుడు అనగనగా ఒక రాజుతో రానున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ ఈ సినిమాను సమర్పిస్తోంది.