ఈ ఏడాది 2026 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన సినిమాల్లో అనగనగా ఒక రాజు మూవీ ఒకటి. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకోవడంతో ఇటీవల మూవీ యూనిట్‌కు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
అరుదైన సంక్రాంతి

నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. "మా సినిమాలో ఒక డైలాగ్ ఉంది. రాజు గారి పెళ్లి ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోద్దని. అలాగే ఈ సంక్రాంతి మా అందరికీ ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోతుంది. తెలుగు సినీ చరిత్రలోనే ఇది అరుదైన సంక్రాంతి" అని అన్నాడు.
ఇంతటి పోటీలో కూడా
"పెద్ద సినిమాలతో పాటు విడుదలై, మీ సినిమా నిలబడుతుందా అని ఎందరో సందేహం వ్యక్తం చేశారు. ఇంతటి పోటీలో కూడా మా సినిమా నిలబడి, ఘన విజయం సాధించిందంటే దానికి కారణం తెలుగు ప్రేక్షకులే. మీకు ఎంత కృతఙ్ఞతలు చెప్పుకున్నా తక్కువే" అని నవీన్ పోలిశెట్టి తెలిపాడు.
మీరు లేకపోతే నేను లేను
"మా సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమా, మా నాగవంశీ గారి సినిమా, మా నవీన్ సినిమా వస్తుందని నమ్మి.. థియేటర్‌కి వచ్చి సినిమా చూసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మీరు లేకపోతే నవీన్ పొలిశెట్టి అనే వ్యక్తి లేడు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఈ వేదిక మీద నిల్చొని లాభాలు పొందామని చెప్పడం సంతోషాన్ని కలిగించింది" అని హీరో నవీన్ పేర్కొన్నాడు.
ముగ్గురికి నష్టం జరగకూడదు
"నేను కథ విన్నప్పుడు ముగ్గురు గురించి కచ్చితంగా ఆలోచిస్తాను. మొదటగా మా నిర్మాతకు నష్టం జరగకూడదు అనుకుంటాను. రెండు మా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టపోకూడదు. మూడోది కష్టపడి సంపాదించిన డబ్బుని ఖర్చు పెట్టి సినిమా చూసే ప్రేక్షకులు. ఈ ముగ్గురు పెట్టే డబ్బుకి విలువ ఇవ్వాలని నేను ప్రతి కథకి ఆలోచిస్తాను. ఏడాదికి రెండు, మూడు సినిమాలు కూడా చేయవచ్చు. కానీ మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతోనే కాస్త సమయం తీసుకుంటాను" అని నవీన్ వెల్లడించాడు.
మరింత ప్రత్యేకంగా మారింది
{{/usCountry}}"నేను కథ విన్నప్పుడు ముగ్గురు గురించి కచ్చితంగా ఆలోచిస్తాను. మొదటగా మా నిర్మాతకు నష్టం జరగకూడదు అనుకుంటాను. రెండు మా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టపోకూడదు. మూడోది కష్టపడి సంపాదించిన డబ్బుని ఖర్చు పెట్టి సినిమా చూసే ప్రేక్షకులు. ఈ ముగ్గురు పెట్టే డబ్బుకి విలువ ఇవ్వాలని నేను ప్రతి కథకి ఆలోచిస్తాను. ఏడాదికి రెండు, మూడు సినిమాలు కూడా చేయవచ్చు. కానీ మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతోనే కాస్త సమయం తీసుకుంటాను" అని నవీన్ వెల్లడించాడు.
మరింత ప్రత్యేకంగా మారింది
{{/usCountry}}ఇదే ఈవెంట్‌లో కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. "నాకు ఈ సంక్రాంతి మరింత ప్రత్యేకంగా మారింది. ప్రేక్షకులు మాపై ప్రేమను ఇలాగే కురిపించాలని కోరుకుంటున్నాను. మాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులను, ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు" అన్నారు.
లాభాలు వచ్చాయనడమే పెద్ద విజయం
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "డిస్ట్రిబ్యూటర్లు మాకు లాభాలు వచ్చాయని చెప్పడమే.. నిర్మాతకు పెద్ద విజయం. మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ మంచి లాభాలను చూశామని చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది" అని తెలిపారు.