...
...
Next Story

NBK111 Kajal Aggarwal First Look: షాకింగ్.. కాజల్ అగర్వాల్ డీగ్లామ్ లుక్.. బాలయ్య-గోపీచంద్ మలినేని సెంటిమెంట్ ట్విస్ట్ !

NBK111 Kajal Aggarwal First Look: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ #NBK111 నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ పవర్‌ఫుల్ ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఆమె బర్త్‌డే స్పెషల్‌గా వచ్చిన ఈ డీగ్లామ్ అవతార్ వెనుక ఉన్న కథేంటో ఇక్కడ చూద్దాం.

Published on: Jun 19, 2026, 11:43:52 IST
Advertisement

NBK111 Kajal Aggarwal First Look: టాలీవుడ్‌లో కమర్షియల్ ఎలిమెంట్స్‌ను పీక్ లెవెల్‌లో ప్రెజెంట్ చేసే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా #NBK111 (వర్కింగ్ టైటిల్). 'వీరసింహారెడ్డి' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబోలో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. తాజాగా ఈ మూవీ నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

కాజల్ అగర్వాల్ బర్త్ డే

షాకింగ్.. కాజల్ అగర్వాల్ డీగ్లామ్ లుక్ (x/megopichand)
షాకింగ్.. కాజల్ అగర్వాల్ డీగ్లామ్ లుక్ (x/megopichand)

బాలయ్య-గోపీచంద్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం (జూన్ 19) మేకర్స్ ఒక సర్‌ప్రైజ్ అప్‌డేట్ ఇచ్చారు. ఆమెకు సంబంధించిన అఫీషియల్ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

కంప్లీట్ డీగ్లామ్ ఇంటెన్స్ రోల్!

సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో కేవలం గ్లామర్, సాంగ్స్, రొమాంటిక్ సీన్స్‌కే పరిమితమయ్యే కాజల్ అగర్వాల్.. ఈ సినిమాలో మాత్రం ఊహించని అవతారంలో కనిపించబోతోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆమె మేకప్ లేని డీగ్లామ్ లుక్‌తో, ఎంతో ఇంటెన్స్, సీరియస్ చూపులతో ఆకట్టుకుంది.

ఓ ఆఫీస్ లో టేబుల్ ముందు కాజల్ నిలబడి ఉంది. ఆ ఫొటో చూస్తుంటే ఆమె గవర్నమెంట్ ఉద్యోగి అని అర్థమవుతోంది. కలెక్టర్ క్యారెక్టర్ చేస్తుందనే కామెంట్లు వస్తున్నాయి. మొత్తానికి గోపీచంద్ మలినేని ఈ యాక్షన్ ఎండ్ ఎమోషనల్ డ్రామా కోసం కాజల్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్‌ఫుల్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

శరవేగంగా షూటింగ్

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముంబై పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత వెంకట సతీష్ కిలారు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ తమన్ లౌడ్ అండ్ హెవీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?

దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్‌కు ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్, హిస్టరీ ఉన్నాయి. 'క్రాక్' సినిమాలో శృతి హాసన్ క్యారెక్టర్‌ను కేవలం గ్లామర్ కోసమే కాకుండా ఫస్ట్ హాఫ్‌లో పక్కా హౌస్‌వైఫ్‌గా, సెకండ్ హాఫ్‌లో హై-వోల్టేజ్ ఫైట్ చేసే రోల్‌గా చూపించి మాస్ ఆడియన్స్‌ను మెప్పించారు. అలాగే 'వీరసింహారెడ్డి'లో హనీ రోజ్ పాత్రకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో అందరికీ తెలిసిందే.

ఇప్పుడు #NBK111 లో కూడా కాజల్ అగర్వాల్‌ను డీగ్లామ్ అవతార్‌లో ప్రెజెంట్ చేయడం వెనుక బలమైన కథాంశం ఉందని ఇండస్ట్రీ టాక్. ముంబై అండర్‌వరల్డ్ లేదా లోకల్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో కాజల్ పాత్ర కేవలం లవ్ ఇంట్రెస్ట్ లా కాకుండా.. కథను మలుపు తిప్పే ఎమోషనల్ డ్రైవ్‌గా ఉండబోతోందని అంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe