...
...
Next Story

ఓటీటీలోకి రూ.20 వేల కోట్ల వసూళ్ల యానిమేటెడ్ మూవీ.. ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్ల సినిమా ఇది

ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ మూవీ ఏదో తెలుసా? ఇప్పుడా సినిమా ఇండియాలో ఓటీటీలోకి అందుబాటులోకి వస్తోంది. ఈ చైనీస్ సినిమా ఇండియాలో థియేటర్లలో రిలీజైన సుమారు 10 నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది.

Published on: Feb 18, 2026, 21:31:45 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించి, అత్యధిక వసూళ్లు సాధించిన చైనీస్ యానిమేటెడ్ మూవీ 'నీ జా 2' (Ne Zha 2) ఎట్టకేలకు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. అద్భుతమైన విజువల్స్, ఎమోషనల్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 20 నుంచి జియోహాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2.2 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ.20 వేల కోట్లు వసూలు చేయడం విశేషం.

నీ జా 2 మొత్తానికి ఓటీటీలోకి..

ఓటీటీలోకి రూ.20 వేల కోట్ల వసూళ్ల యానిమేటెడ్ మూవీ.. ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్ల సినిమా ఇది
ఓటీటీలోకి రూ.20 వేల కోట్ల వసూళ్ల యానిమేటెడ్ మూవీ.. ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్ల సినిమా ఇది

యానిమేషన్ సినిమాల చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిన సినిమా 'నీ జా 2'. 2025లో విడుదలైన ఈ చైనీస్ ఎపిక్, తన ప్రీక్వెల్ (మొదటి భాగం) రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, ప్రపంచంలోనే అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా నిలిచింది. హాలీవుడ్ సినిమాలు కాకుండా 1 బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన మొట్టమొదటి యానిమేటెడ్ సినిమాగా ఇది రికార్డు సృష్టించింది.

భారీ యాక్షన్, విజువల్ వండర్‌గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌లపై అలరించడానికి వచ్చేస్తోంది. ఈ సినిమాను జియోహాట్‌స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 20) నుంచి ఇంగ్లిష్, హిందీ భాషల్లో చూడొచ్చు. అయితే తెలుగు వెర్షన్ మాత్రం ఇప్పుడే రావడం లేదు.

నీ జా 2 స్టోరీ ఏంటంటే?

మొదటి భాగం చివర్లో జరిగిన సంఘటనల తర్వాత.. నీ జా (Ne Zha), ఆవో బింగ్ (Ao Bing) తమ శరీరాలను కోల్పోతారు. మాస్టర్ తాయి వారి ఆత్మలను కాపాడటానికి ‘సప్త వర్ణ పవిత్ర పద్మాన్ని’ ఉపయోగిస్తారు. దీనివల్ల వారిద్దరూ బలహీనపడి, ఒకే శరీరంలో జీవించాల్సి వస్తుంది.

ఈ సినిమా 2025 ఏప్రిల్‌లో ఇండియాలో థియేటర్లలో విడుదలైంది. ఇక్కడ దాదాపు రూ. 2.49 కోట్ల గ్రాస్ (రూ. 2.26 కోట్ల నెట్) వసూళ్లను రాబట్టింది. అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ సినిమా పెద్దలని కూడా ఆకట్టుకుంటుంది. నీ జా చిన్ననాటి పాత్రకు లు యాంటింగ్, టీనేజ్ వెర్షన్‌కు జోసెఫ్ కావో వాయిస్ అందించారు. ఆవో బింగ్‌కు హాన్ మో, తండ్రి లి జింగ్‌కు చెన్ హావో వాయిస్ ఇచ్చారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks