షాకింగ్.. నేపాలీ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. 300కు పైగా సినిమాలు చేసిన లెెజెండరీ నటుడు సునీల్ థాపా కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. 68 ఏళ్ల వయసులో ఆయన మరణించారు.
గుండెపోటుతో

‘ది ఖాట్మండు పోస్ట్’ ప్రకారం శుక్రవారం (ఫిబ్రవరి 6) ఉదయం నేపాల్ రాజధాని ఖాట్మండులో సునీల్ థాపా మరణించారు. గుండెపోటుతో సునీల్ తుదిశ్వాస విడిచారు. తపస్థలిలోని నోర్విక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. హార్ట్ ఎటాక్ తో ఆయన ప్రాణాలు విడిచారు.
మేరీ కోమ్ సినిమాతో
నేపాలీ సినీ ఇండస్ట్రీలో సునీల్ థాపా దిగ్గజం. అక్కడి అభిమానుల్లో ఆయన తెలియని వారు ఉండరు. ముఖ్యంగా విలన్ పాత్రలతో ఆయన ప్రసిద్ధి చెందారు. ఇండియన్ సినీ లవర్స్ కు కూడా సునీల్ పరిచయమే. ప్రియాంక చోప్రా లీడ్ రోల్ ప్లే చేసిన ‘మేరీ కోమ్’ సినిమాలో సునీల్ తన యాక్టింగ్ తో అదరగొట్టారు. ఇందులో మేరీ కోమ్ కోచ్ గా నటించారు. ఈ మూవీ 2014లో రిలీజైంది.
తెలుగులోనూ
సునీల్ థాపా తెలుగులోనూ నటించారు. తేజ సజ్జా హీరోగా 2025లో వచ్చిన మిరాయ్ మూవీలో ఆయన మెరిశారు. మిరాయ్ కోసం హీరో క్యారెక్టర్ వెళ్తున్నప్పుడు హిమాలయాల్లో సంపాతి గొప్పతనం గురించి, అక్కడి వెళ్తే ప్రాణాలతో తిరిగి రావనే విషయాన్ని సునీల్ చేసిన పాత్ర చెప్తుంది. ఆయన మరణం పట్ల మిరాయ్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంతాపం వ్యక్తం చేసింది. ఎక్స్ లో ఆయన ఫొటోతో ఓ పోస్టు పెట్టింది.
హిందీ మూవీతో
నేపాల్ లో పుట్టిన సునీల్ థాపా 1981లో వచ్చిన హిందీ మూవీ ‘ఏక్ దూజే కే లియే’ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత హిందీ, నేపాలీ, భోజ్ పురి, తమిళం, తెలుగు భాషల్లో కలిపి 300కు పైగా సినిమాల్లో నటించారు. విలన్ గా తన యాక్టింగ్ తో అభిమానులను సంపాదించుకున్నారు.
ఆ విలన్ క్యారెక్టర్
కల్ట్ క్లాసిక్ సినిమా ‘చినో’ (1991)లో విలన్ రేట్ కైలాగా సునీల్ థాపా నటన నేపాలీ సినిమా చరిత్రలో అత్యంత ఐకానిక్ ప్రదర్శనలలో ఒకటిగా మిగిలిపోయింది. నటనలోకి ప్రవేశించడానికి ముందు సునీల్ 1970ల మధ్యలో ముంబైలో మోడల్‌గా తన వృత్తిని ప్రారంభించారు. ఆయన ‘ఏక్ దూజే కే లియే’ (1981) చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి, పలు హిందీ చిత్రాలలో నటించారు. 2014లో ‘మేరీ కోమ్’లో కోచ్ నర్జిత్ సింగ్‌గా ఆయన పాత్రకు గొప్ప రెస్పాన్స్ వచ్చింది.
{{/usCountry}}కల్ట్ క్లాసిక్ సినిమా ‘చినో’ (1991)లో విలన్ రేట్ కైలాగా సునీల్ థాపా నటన నేపాలీ సినిమా చరిత్రలో అత్యంత ఐకానిక్ ప్రదర్శనలలో ఒకటిగా మిగిలిపోయింది. నటనలోకి ప్రవేశించడానికి ముందు సునీల్ 1970ల మధ్యలో ముంబైలో మోడల్‌గా తన వృత్తిని ప్రారంభించారు. ఆయన ‘ఏక్ దూజే కే లియే’ (1981) చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి, పలు హిందీ చిత్రాలలో నటించారు. 2014లో ‘మేరీ కోమ్’లో కోచ్ నర్జిత్ సింగ్‌గా ఆయన పాత్రకు గొప్ప రెస్పాన్స్ వచ్చింది.
{{/usCountry}}రీసెంట్ గా ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సీజన్ 2లో సునీల్ థాపా నటించారు. నాగాలాండ్‌లో గౌరవనీయ నాయకుడు, ఎంసిఏ చీఫ్‌గా డేవిడ్ ఖుజౌ పాత్రలో కొద్దిసేపు కనిపించారు.