Akka Trailer: కీర్తి సురేష్ మరో బోల్డ్ అవతార్ లో కనిపిస్తున్న వెబ్ సిరీస్ అక్క. ఈ నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కోసం చాలా రోజులుగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యే ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ కాగా.. తాజాగా గురువారం (అక్టోబర్ 22) మేకర్స్ ఓ ఇంటెన్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. పేర్నూరు అనే ప్రాంతం కోసం జరిగే ఫైట్ ఇందులో చూడొచ్చు.
అక్క ట్రైలర్ ఎలా ఉందంటే?

కీర్తి సురేష్, రాధికా ఆప్టే లీడ్ రోల్స్ లో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అక్క ట్రైలర్ మొదట్లోనే పేర్నూరు అనే ప్రాంతం గురించి పరిచయం చేశారు. 1985 ప్రాంతంలో జరిగిన స్టోరీగా చూపించారు. ఇక్కడ 800 ఏళ్లుగా ఆడాళ్లదే రాజ్యం. ఆ సామ్రాజ్యాన్ని పాలించే వ్యక్తిని అక్క అని పిలుస్తుంటారు. భవాని (కీర్తి సురేష్) నేతృత్వంలో ఆ రాజ్యం నడుస్తుంటుంది. ఆడాళ్లు ఇంటినే కాదు వ్యాపారాన్ని కూడా చక్కదిద్దగలరు అనే డైలాగులు ఈ ట్రైలర్ లో చూడొచ్చు.
అలాంటి అక్క సామ్రాజ్యాన్ని సవాలు చేయడానికి రుద్ర (రాధికా ఆప్టే) రూపంలో మరో లేడీ గ్యాంగ్‌స్టర్ ఎంట్రీ ఇస్తుంది. దీంతో అక్కడి నుంచి ఫైట్ అక్క, రుద్ర మధ్య మొదలవుతుంది. అక్క సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తుంది రుద్ర. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగే ఫైట్ చాలా ఆసక్తి రేపుతుంది. రెండు నిమిషాలకుపైగా ఉన్న ఈ ట్రైలర్ వెబ్ సిరీస్ పై ఉన్న అంచనాలను పెంచేసింది.
“ఒకరు రాజ్యాన్ని స్థాపిస్తే.. మరొకరు విధ్వంసాన్ని సృష్టిస్తారు. చరిత్ర తిరగరాయబడబోతోంది.. అక్క అక్టోబర్ 20 నుంచి కేవలం నెట్‌ఫ్లిక్స్ లో” అనే క్యాప్షన్ తో నెట్‌ఫ్లిక్స్ ఈ ట్రైలర్ ను షేర్ చేసింది.
భారీ తారాగణం.. అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్
ఈ వెబ్ సిరీస్‌కు ఆదిత్య చోప్రా, యోగేంద్ర మోగ్రే, అక్షయ్ విధాని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ నటి తన్వి అజ్మీ సహా పలువురు ప్రముఖ నటీనటులు ఇందులో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
{{/usCountry}}ఈ వెబ్ సిరీస్‌కు ఆదిత్య చోప్రా, యోగేంద్ర మోగ్రే, అక్షయ్ విధాని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ నటి తన్వి అజ్మీ సహా పలువురు ప్రముఖ నటీనటులు ఇందులో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
{{/usCountry}}ధర్మరాజ్ శెట్టి (Dharmaraj Shetty) స్వయంగా రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌తో ఆయన రచయితగా, దర్శకుడిగా డిజిటల్ తెరకు పరిచయమవుతున్నారు. 'పెర్నూర్' (Pernuru) అనే ఒక కల్పిత నగరంలో, మహిళా గ్యాంగ్‌స్టర్ రాణుల పాలనలో సాగే కథాంశంతో అత్యంత పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించారు.
లేడీ డామినేషన్, గ్యాంగ్‌స్టర్ రివేంజ్, పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న 'అక్క' వెబ్ సిరీస్ అక్టోబర్ 30, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్కు రానుంది. కీర్తి సురేష్-రాధికా ఆప్టేల మైండ్ బ్లాకింగ్ కాంబినేషన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.