Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌లో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూకుడు.. గ్లోబల్ లెవెల్లో నంబర్ వన్ ట్రెండింగ్

నెట్‌ఫ్లిక్స్‌లోకి తాజాగా వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దుమ్ము రేపుతోంది. గ్లోబల్ లెవెల్లో నాన్ ఇంగ్లిష్ కేటగిరీలో నంబర్ వన్ ట్రెండింగ్ లో ఉండటం విశేషం. ఇమ్రాన్ హష్మి లీడ్ రోల్లో నటించిన వెబ్ సిరీస్ ఇది.

Published on: Jan 21, 2026 1:53 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నెట్‌ఫ్లిక్స్‌లోకి ఈ మధ్యే వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తస్కరీ: ది స్మగ్లర్స్ వెబ్. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చినా ఇప్పుడు మాత్రం దుమ్ము రేపుతోంది. ఇప్పటి వరకూ ఈ ఓటీటీలో వచ్చిన ఈ ఇండియన్ వెబ్ సిరీస్‌కూ దక్కని ఘనతను సొంతం చేసుకుంది. మరి అదేంటో చూడండి.

Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌లో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూకుడు.. గ్లోబల్ లెవెల్లో నంబర్ వన్ ట్రెండింగ్
Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌లో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూకుడు.. గ్లోబల్ లెవెల్లో నంబర్ వన్ ట్రెండింగ్

తస్కరీ వెబ్ సిరీస్ రికార్డు

ఇండియన్ ఓటీటీ చరిత్రలో ఒక అరుదైన రికార్డు నమోదైంది. నీరజ్ పాండే క్రియేట్ చేసిన, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించిన ‘తస్కరీ: ది స్మగ్లర్స్ వెబ్’ (Taskaree: The Smuggler’s Web) సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతోంది. గ్లోబల్ చార్టుల్లో అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇది కొరియన్ షోలను దాటి నంబర్ 1గా నిలవడం విశేషం. నెట్‌ఫ్లిక్స్ డేటా విభాగం ‘టుడుమ్’ (Tudum) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత వారం అంటే జనవరి 12 నుంచి 18 మధ్య ప్రపంచవ్యాప్తంగా నాన్-ఇంగ్లిష్ షోల జాబితాలో ‘తస్కరీ’ మొదటి స్థానంలో నిలిచింది. ఈ వెబ్ సిరీస్ కేవలం వారంలోనే 5.4 మిలియన్ల (54 లక్షలు) వ్యూస్ సాధించింది.

పాపులర్ కొరియన్ రొమాంటిక్ కామెడీ ‘కెన్ దిస్ లవ్ బి ట్రాన్స్‌లేటెడ్?’ (4 మిలియన్ల వ్యూస్)ను వెనక్కి నెట్టి మరీ తస్కరీ టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది. జుజుత్సు కైసెన్, ఆల్ఫా మేల్స్ వంటి అంతర్జాతీయ షోలను కూడా ఇది అధిగమించింది. టాప్-10లో ఉన్న ఏకైక ఇండియన్ వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం.

తస్కరీ వెబ్ సిరీస్ విశేషాలు

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ ఆఫీసర్లు.. గ్లోబల్ స్మగ్లింగ్ సిండికేట్‌ను ఎలా అడ్డుకున్నారనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఇందులో ఇమ్రాన్ హష్మీతో పాటు జోయా అఫ్రోజ్, శరద్ కేల్కర్, అమృతా ఖాన్విల్కర్ కీలక పాత్రల్లో నటించారు.

తమ వెబ్ సిరీస్ సాధించిన ఈ విజయంపై ఇమ్రాన్ హష్మీ స్పందిస్తూ.. "ఎయిర్‌పోర్ట్‌లో అవిశ్రాంతంగా పనిచేసే అధికారుల పట్ల గౌరవంతో ఈ కథను రూపొందించాం. నిజాయితీగా చెప్పిన కథలు ఎక్కడి వరకైనా వెళ్తాయని ఈ విజయం నిరూపించింది" అని అన్నాడు.

దర్శకుడు నీరజ్ పాండే మాట్లాడుతూ.. "గ్లోబల్ టాప్ 10లో ఒక ఇండియన్ వెబ్ సిరీస్ నంబర్ 1గా నిలవడం కేవలం ఈ షో విజయమే కాదు, ఇండియన్ స్టోరీలకు దక్కిన గౌరవం" అని ఆనందం వ్యక్తం చేశాడు.