...
...
Next Story

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ VFX హబ్‌.. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా?

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ VFX హబ్‌ ప్రారంభం కానుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దీనిని ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు అవుతున్నాయి.

Published on: Mar 7, 2026, 09:36:49 IST
Advertisement

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ నుంచి గ్లోబల్ వీఎఫ్ఎక్స్ హబ్ రానుంది. ముంబైలో ఉన్న కార్యాలయం తర్వాత హైదరాబాద్‌లోని యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగానికి పెద్ద ప్రోత్సాహాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. హైదరాబాద్‌లో మంచి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల లభ్యతతో పాటు మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి ఉన్న క్రేజ్ చూసి నెట్‌ఫ్లిక్స్ ఈ సిటీని ఎంచుకుంది.

నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ VFX హబ్‌
నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ VFX హబ్‌

నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ వీఎఫ్ఎక్స్ హబ్ 30,000 చదరపు అడుగులతో ఉంటుంది. హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఉనికి, డిజిటల్ కంటెంట్ సృష్టికి ప్రముఖ కేంద్రంగా, AVGC రంగంలో అగ్రగామిగా హైదరాబాద్ ఆవిర్భావాన్ని ఈ కార్యాలయం బలోపేతం చేస్తుంది.

మార్చి 12వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల మంత్రి డి.శ్రీధర్ బాబు ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, ఐలైన్ స్టూడియోస్ సీఈవో జెఫ్ షాపిరో, నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

హై వాల్యూ పోస్ట్-ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్, వర్చువల్ ప్రొడక్షన్ సామర్థ్యాలకు ఈ హబ్ కేంద్రంగా ఉంటుంది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌లో భాగంగా రాష్ట్రాన్ని సాంకేతికత, ఆవిష్కరణ, క్రియేటివిటీ పరిశ్రమలలో ముందంజలో ఉంచడంపై దృష్టి సారించింది ప్రభుత్వం. రాష్ట్ర యువత కోసం అధునాతన నైపుణ్య కార్యక్రమాలలో భాగంగా నెట్‌ఫ్లిక్స్ భాగస్వామ్యంపై కూడా ఆసక్తి చూపుతుంది.

హైదరాబాద్‌ను దక్షిణ భారత చలనచిత్ర, AVGC సూపర్‌హబ్‌గా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ వీఎఫ్ఎక్స్ హబ్ AVGC స్టార్టప్‌ల కోసం పెట్టుబడులు, ప్రపంచ సహకారాలను ఒకచోట చేర్చుతుంది. AI-ఆధారిత VFX సామర్థ్యాలు, పార్టనర్‌షిప్ స్టూడియోలను నిర్మిస్తుంది. వీఎఫ్ఎక్స్ రంగంలో ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్‌ నుంచి పని చేస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks