నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో హారర్ వెబ్ సిరీస్.. స్ట్రేంజర్ థింగ్స్ మేకర్స్ నుంచే.. ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘స్ట్రేంజర్ థింగ్స్’ వెబ్ సిరీస్ నిర్మాతలు (డఫర్ బ్రదర్స్) నెట్‌ఫ్లిక్స్ కోసం మరో కొత్త హారర్ సిరీస్‌ను తీసుకువస్తున్నారు. ‘బేబీ రెయిన్‌డీర్’ దర్శకురాలు దీనికి పనిచేస్తుండటంతో అంచనాలు పెరిగాయి.

Published on: Jan 28, 2026, 22:03:35 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నెట్‌ఫ్లిక్స్ తన రాబోయే కొత్త హారర్ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. దీనికి ‘సమ్‌థింగ్ వెరీ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్’ (Something Very Bad Is Going To Happen) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సిరీస్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా ప్రపంచ ప్రఖ్యాత ‘స్ట్రేంజర్ థింగ్స్’ క్రియేటర్స్ మాట్, రాస్ డఫర్ (డఫర్ బ్రదర్స్) వ్యవహరిస్తుండగా, ‘బేబీ రెయిన్‌డీర్’ ఫేమ్ వెరోనికా టోఫిల్స్కా దర్శకత్వం వహిస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో హారర్ వెబ్ సిరీస్.. స్ట్రేంజర్ థింగ్స్ మేకర్స్ నుంచే.. ఫస్ట్ లుక్ రిలీజ్ (Netflix)
నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో హారర్ వెబ్ సిరీస్.. స్ట్రేంజర్ థింగ్స్ మేకర్స్ నుంచే.. ఫస్ట్ లుక్ రిలీజ్ (Netflix)

హారర్ వెబ్ సిరీస్ స్టోరీ, స్ట్రీమింగ్ డేట్

ఈ హారర్ వెబ్ సిరీస్ కథ ఒక పెళ్లి చేసుకోబోయే జంట చుట్టూ తిరుగుతుంది. దురదృష్టవశాత్తు వారి పెళ్లికి వారం ముందు జరిగే భయానక సంఘటనలే ఈ వెబ్ సిరీస్ కథాంశం. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉండే ఈ సిరీస్ మార్చి 26 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఫిదా అయిన డఫర్ బ్రదర్స్

స్క్రీన్ రైటర్ హేలీ జెడ్ బోస్టన్ ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఆమె ఈ కథను డఫర్ బ్రదర్స్‌కు వినిపించినప్పుడు వారు ఆశ్చర్యపోయారట. "హేలీ స్క్రిప్ట్ చదివినప్పుడు మేము షాక్ అయ్యాము. అద్భుతమైన ప్రతిభ ఆమె సొంతం. ఆమె రైటింగ్ లో ఒక ట్విస్ట్, భయం, వినోదం ఉన్నాయి. ఆమె మొదటి షోను మేము నిర్మిస్తున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము" అని డఫర్ బ్రదర్స్ ఒక ప్రకటనలో తెలిపారు. డఫర్ బ్రదర్స్‌కు చెందిన ‘అప్‌సైడ్ డౌన్ పిక్చర్స్’ బ్యానర్ నుంచి వస్తున్న మొదటి నాన్-స్ట్రేంజర్ థింగ్స్ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.

సమ్‌థింగ్ వెరీ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్

ఈ వెబ్ సిరీస్‌కు వెరోనికా టోఫిల్స్కా (బేబీ రెయిన్‌డీర్), ఆక్సెల్ కరోలిన్ (ది మిడ్‌నైట్ క్లబ్), లిసా బ్రూల్‌మాన్ (కిల్లింగ్ ఈవ్) దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు పాత్రల్లో కెమిలా మోరోన్ (డైసీ జోన్స్ & ది సిక్స్), ఆడమ్ డిమార్కో (ది వైట్ లోటస్) నటిస్తున్నారు. జెన్నిఫర్ జాసన్ లీ, టెడ్ లెవిన్, గస్ బిర్నీ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

ముగిసిన ‘స్ట్రేంజర్ థింగ్స్’ ప్రయాణం

నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక మంది చూసిన వెబ్ సిరీస్‌లలో ఒకటైన ‘స్ట్రేంజర్ థింగ్స్’ న్యూ ఇయర్ రోజున (జనవరి 1) ముగిసింది. చివరి ఎపిసోడ్‌లో హాకిన్స్ హీరోలు, ఎలెవెన్ (మిల్లీ బాబీ బ్రౌన్), విల్ బైర్స్ (నోహ్ ష్నాప్) సహాయంతో విలన్ వెక్నాను ఓడిస్తారు. జాయిస్ (వినోనా రైడర్) విలన్ తలను నరికివేయగా, హాపర్, ముర్రే బాంబులతో దాడి చేస్తారు. ఈ క్రమంలో ఎలెవెన్ తనను తాను త్యాగం చేసుకున్నట్లు కనిపిస్తుంది. కానీ చివరి సీన్‌లో ఆమె బతికే ఉన్నట్లు, ఒక దూరప్రాంతంలో నడుస్తున్నట్లు చూపించారు.

దీనిపై రాస్ డఫర్ మాట్లాడుతూ, "క్లైమాక్స్‌ను మేము అభిమానుల నమ్మకానికే వదిలేశాము. వారు ఏం నమ్ముతారో వారి ఇష్టం" అని అన్నారు. ఇండిపెండెంట్ పత్రిక ఈ వెబ్ సిరీస్‌కు మూడు స్టార్ల రేటింగ్ ఇస్తూ.. ఇది ఒక అద్భుతమైన కథగా మొదలై చివరికి కేవలం గ్రాఫిక్స్ మాయాజాలంగా మారిపోయిందని అభిప్రాయపడింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More