Netflix: ఓటీటీ ప్రియులకు నెట్‌ఫ్లిక్స్ ఈ వీకెండ్ ను మరింత వినోదాత్మకంగా మార్చేందుకు భారీ లైనప్‌తో సిద్ధమైంది. అక్టోబర్ చివరి వారంలో కామెడీ, యాక్షన్, క్రిమినల్ థ్రిల్లర్స్, పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలతో కూడిన 8 విభిన్నమైన ప్రాజెక్ట్‌లను వీక్షకుల ముందుకు తీసుకువస్తోంది. థియేటర్లలో మిస్ అయిన పెద్ద సినిమాల నుంచి డైరెక్ట్ డిజిటల్ ఒరిజినల్స్ వరకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఆ 8 మూవీస్, సిరీస్ వివరాలు ఇవే.
1. సిగ్మా (Sigma) — అక్టోబర్ 30

తమిళ స్టార్ హీరో, సీఎం దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమైన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘సిగ్మా’. యంగ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.
2. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ (Don't Trouble The Trouble) — అక్టోబర్ 30
మలయాళ స్టార్ వర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ సోలో హీరోగా నటించిన తెలుగు ఫాంటసీ కామెడీ చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. దర్శకుడు శశాంక్ ఏలేటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి సమర్పించగా, అర్కా మీడియా వర్క్స్ నిర్మించింది. అంబులెన్స్ డ్రైవర్‌గా ఫహాద్ ఫాజిల్ చేసే హంగామా అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో బహుభాషల్లో అలరించనుంది.
3. అక్క (Akka - Hindi Web Series) — అక్టోబర్ 30
నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన హై-వోల్టేజ్ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'అక్క'. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మోస్ట్ అవేటెడ్ క్రైమ్ సిరీస్ అక్టోబర్ 30 నుంచి హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లోనూ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
4. బత్తా (Baththa) — అక్టోబర్ 29
వర్సటైల్ నటుడు విజయ్ సేతుపతి హీరోగా దర్శకుడు బాలాజీ తరణీధరన్ తెరకెక్కించిన పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ కామెడీ మూవీ 'బత్తా'. దర్శకుడు అట్లీ సమర్పించిన ఈ మూవీ అక్టోబర్ 29 నుంచి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ అరంగేట్రం చేసింది.
5. సబ్‌ఇన్‌స్పెక్టర్: యుగంధర్ (SI Yugandhar) — అక్టోబర్ 30
{{/usCountry}}వర్సటైల్ నటుడు విజయ్ సేతుపతి హీరోగా దర్శకుడు బాలాజీ తరణీధరన్ తెరకెక్కించిన పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ కామెడీ మూవీ 'బత్తా'. దర్శకుడు అట్లీ సమర్పించిన ఈ మూవీ అక్టోబర్ 29 నుంచి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ అరంగేట్రం చేసింది.
5. సబ్‌ఇన్‌స్పెక్టర్: యుగంధర్ (SI Yugandhar) — అక్టోబర్ 30
{{/usCountry}}యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా రాఘవేంద్ర కటారి దర్శకత్వంలో వచ్చిన పోలీస్ యాక్షన్ డ్రామా 'సబ్‌ఇన్‌స్పెక్టర్ యుగంధర్'. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగు ఇతర ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంటుంది.
6. డిండోరా: సీజన్ 1 (Dhindora S1) — అక్టోబర్ 28
యూట్యూబ్ సెన్సేషన్ భువన్ బామ్ నటించి సంచలనం సృష్టించిన 8 ఎపిసోడ్ల హిట్ కామెడీ సిరీస్ 'డిండోరా సీజన్ 1'. లాటరీ తగిలిన ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబంలో జరిగే హస్యస్పద పరిణామాల నేపథ్యంలో సాగే ఈ సిరీస్ అక్టోబర్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.
7. అవరాచన్ అండ్ సన్స్ (Avaraachan & Sons) — అక్టోబర్ 30
మలయాళ సీనియర్ నటుడు బిజు మీనన్ ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు తంబి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎమోషనల్ కామెడీ డ్రామా 'అవరాచన్ అండ్ సన్స్'. తండ్రీకొడుకుల బంధం చుట్టూ తిరిగే ఈ చిత్రం అక్టోబర్ 30 నుంచి తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.
8. మీఠే మే క్యా హై (Meethe Mein Kya Hai) — అక్టోబర్ 30
దీపావళి పండుగ నేపథ్యంలో కుటుంబ సంబంధాలు, ఎమోషనల్ బాండింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రాధికా బన్సల్ దర్శకత్వం వహించిన నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఫ్యామిలీ కామెడీ మూవీ 'మీఠే మే క్యా హై'. రిత్విక్ భౌమిక్, రోహిణి హట్టంగడి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం అక్టోబర్ 30 నుంచి డిజిటల్ వీక్షకులకు అందుబాటులోకి రానుంది.