Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వీకెండ్ మస్ట్ వాచ్ టాప్ 8 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. ఆరు తెలుగులోనే..

Netflix: నెట్‌ఫ్లిక్స్ ఈ వారం తమ సబ్‌స్క్రైబర్ల కోసం ఏకంగా 8 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చింది. ఇందులో బత్తా, సిగ్మా, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, అక్క వెబ్ సిరీస్ లాంటివి ఉన్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Oct 29, 2026, 22:10:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Netflix: ఓటీటీ ప్రియులకు నెట్‌ఫ్లిక్స్ ఈ వీకెండ్ ను మరింత వినోదాత్మకంగా మార్చేందుకు భారీ లైనప్‌తో సిద్ధమైంది. అక్టోబర్ చివరి వారంలో కామెడీ, యాక్షన్, క్రిమినల్ థ్రిల్లర్స్, పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలతో కూడిన 8 విభిన్నమైన ప్రాజెక్ట్‌లను వీక్షకుల ముందుకు తీసుకువస్తోంది. థియేటర్లలో మిస్ అయిన పెద్ద సినిమాల నుంచి డైరెక్ట్ డిజిటల్ ఒరిజినల్స్ వరకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఆ 8 మూవీస్, సిరీస్ వివరాలు ఇవే.

Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వీకెండ్ మస్ట్ వాచ్ టాప్ 8 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. ఆరు తెలుగులోనే..
Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వీకెండ్ మస్ట్ వాచ్ టాప్ 8 మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. ఆరు తెలుగులోనే..

1. సిగ్మా (Sigma) — అక్టోబర్ 30

తమిళ స్టార్ హీరో, సీఎం దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమైన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘సిగ్మా’. యంగ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.

2. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ (Don't Trouble The Trouble) — అక్టోబర్ 30

మలయాళ స్టార్ వర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ సోలో హీరోగా నటించిన తెలుగు ఫాంటసీ కామెడీ చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. దర్శకుడు శశాంక్ ఏలేటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి సమర్పించగా, అర్కా మీడియా వర్క్స్ నిర్మించింది. అంబులెన్స్ డ్రైవర్‌గా ఫహాద్ ఫాజిల్ చేసే హంగామా అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో బహుభాషల్లో అలరించనుంది.

3. అక్క (Akka - Hindi Web Series) — అక్టోబర్ 30

నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన హై-వోల్టేజ్ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'అక్క'. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మోస్ట్ అవేటెడ్ క్రైమ్ సిరీస్ అక్టోబర్ 30 నుంచి హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లోనూ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

4. బత్తా (Baththa) — అక్టోబర్ 29

వర్సటైల్ నటుడు విజయ్ సేతుపతి హీరోగా దర్శకుడు బాలాజీ తరణీధరన్ తెరకెక్కించిన పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ కామెడీ మూవీ 'బత్తా'. దర్శకుడు అట్లీ సమర్పించిన ఈ మూవీ అక్టోబర్ 29 నుంచి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ అరంగేట్రం చేసింది.

5. సబ్‌ఇన్‌స్పెక్టర్: యుగంధర్ (SI Yugandhar) — అక్టోబర్ 30

యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా రాఘవేంద్ర కటారి దర్శకత్వంలో వచ్చిన పోలీస్ యాక్షన్ డ్రామా 'సబ్‌ఇన్‌స్పెక్టర్ యుగంధర్'. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగు ఇతర ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంటుంది.

6. డిండోరా: సీజన్ 1 (Dhindora S1) — అక్టోబర్ 28

యూట్యూబ్ సెన్సేషన్ భువన్ బామ్ నటించి సంచలనం సృష్టించిన 8 ఎపిసోడ్ల హిట్ కామెడీ సిరీస్ 'డిండోరా సీజన్ 1'. లాటరీ తగిలిన ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబంలో జరిగే హస్యస్పద పరిణామాల నేపథ్యంలో సాగే ఈ సిరీస్ అక్టోబర్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.

7. అవరాచన్ అండ్ సన్స్ (Avaraachan & Sons) — అక్టోబర్ 30

మలయాళ సీనియర్ నటుడు బిజు మీనన్ ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు తంబి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎమోషనల్ కామెడీ డ్రామా 'అవరాచన్ అండ్ సన్స్'. తండ్రీకొడుకుల బంధం చుట్టూ తిరిగే ఈ చిత్రం అక్టోబర్ 30 నుంచి తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.

8. మీఠే మే క్యా హై (Meethe Mein Kya Hai) — అక్టోబర్ 30

దీపావళి పండుగ నేపథ్యంలో కుటుంబ సంబంధాలు, ఎమోషనల్ బాండింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రాధికా బన్సల్ దర్శకత్వం వహించిన నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఫ్యామిలీ కామెడీ మూవీ 'మీఠే మే క్యా హై'. రిత్విక్ భౌమిక్, రోహిణి హట్టంగడి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం అక్టోబర్ 30 నుంచి డిజిటల్ వీక్షకులకు అందుబాటులోకి రానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More