పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో కొత్త సినిమాల పండగ రాబోతుంది. నెట్‌ఫ్లిక్స్ పండగలో భాగంగా ఈ ఓటీటీ వేదికలో రాబోతున్న న్యూ మూవీస్ ను ఈ ప్లాట్ ఫామ్ ఇవాళ అనౌన్స్ చేస్తోంది. ఇందులో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి నాని మూవీ ప్యారడైజ్ వరకు కొత్త సినిమాలున్నాయి. వీటిపై ఓ లుక్కేయండి.
ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఈ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్-హరీష్ కాంబినేషన్ అనగానే క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా నుంచి రిలీజైన దేఖ్ లేంగే సాంగ్ ఊపేస్తుంది. ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి రాబోతుంది.
‘‘అనుమతి కోసం న్యాయం ఎదురు చూడదు. అతను కూడా అంతే. థియేట్రికల్ రిలీజ్ తర్వాత సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడలో నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తుంది’’ అని నెట్‌ఫ్లిక్స్ పోస్టు చేసింది.
ప్యారడైజ్ ఓటీటీ
నేచురల్ స్టార్ నాని రా అండ్ రస్టిక్ లుక్ లో అదరగొట్టబోతున్న మూవీ ప్యారడైజ్. ఇందులో నాని వేరే లెవల్ మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. నానికి దసరా లాంటి హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల దీనికి డైరెక్టర్. ఈ మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తుంది.
‘‘ప్రపంచం మొత్తం నిన్ను వెలివేస్తే, రెబల్ గా నీ గుర్తింపు మారుతుంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడలో నెట్‌ఫ్లిక్స్ లో రానుంది’’ అని నెట్‌ఫ్లిక్స్ ఎక్స్ లో పంచుకుంది.
ఆకాశంలో ఒక తార
{{/usCountry}}‘‘ప్రపంచం మొత్తం నిన్ను వెలివేస్తే, రెబల్ గా నీ గుర్తింపు మారుతుంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడలో నెట్‌ఫ్లిక్స్ లో రానుంది’’ అని నెట్‌ఫ్లిక్స్ ఎక్స్ లో పంచుకుంది.
ఆకాశంలో ఒక తార
{{/usCountry}}దుల్కర్ సల్మాన్ అప్ కమింగ్ మూవీ ఆకాశంలో ఒక తార. దీనికి పవన్ సాదినేని డైరెక్టర్. దుల్కర్ తెలుగులో చేస్తున్న సినిమా ఇది. ఆకాశంలో ఒక తార చిత్రం కూడా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
‘‘స్పేస్ లోకి కొన్ని ప్రయాణాలు పగిలిన రోడ్ల మీదే ప్రారంభమవుతాయి’’ అని పేర్కొన్న నెట్‌ఫ్లిక్స్ ఆకాశంలో ఒక తార సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంది.
ఛాంపియన్
టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన మూవీ ఛాంపియన్. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో హిట్ గా నిలిచింది. ఈ మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది.
‘‘ఇది ఒక అందమైన ఆటతో మొదలైంది. కానీ ముగింపు మాత్రం అలా లేదు. ఇధి ఒక మనిషిని ఛాంపియన్ గా మార్చే రివల్యూషన్’’ అని నెట్‌ఫ్లిక్స్ పోస్టు చేసింది.
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్
ఫాహద్ ఫాజిల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న మూవీ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఈ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్ లో ఓటీటీ రిలీజ్ కానుంది. ‘‘సూరిని కలవండి. సైరెన్స్ అండ్ స్క్రీమ్స్ మధ్య అతను తన ఫార్చ్యూన్ కోసం వెతుకుతున్నాడు’’ అని ఈ మూవీ గురించి తెలిపింది నెట్‌ఫ్లిక్స్.