...
...
Next Story

Netflix Thriller: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో మైండ్‌బ్లోయింగ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. సరికొత్త కథ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Netflix Thriller: నెట్‌ఫ్లిక్స్ లోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా నటిస్తున్న ఈ సిరీస్ సెప్టెంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సిరీస్ స్టోరీ ఏంటి? ఎవరెవరు నటిస్తున్నారనే విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Sep 7, 2026, 12:19:23 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Netflix Thriller: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఓటీటీ స్పేస్‌లోకి అడుగుపెట్టడానికి గ్రాండ్ ప్లానింగ్ చేసుకున్నారు. ఆమె నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'షక్: ట్రస్ట్ నో వన్' (Shaque: Trust No One) నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌కు రెడీ అయింది. సెప్టెంబర్ 24 నుంచి ఈ మైండ్ బ్లోయింగ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా అనౌన్స్ చేసింది.

నీటి ప్రవాహం మొదలైంది.. డేట్ దగ్గర పడుతోంది

Netflix Thriller: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో మైండ్‌బ్లోయింగ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. సరికొత్త కథ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Netflix Thriller: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో మైండ్‌బ్లోయింగ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. సరికొత్త కథ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ ఓ ఇంటెన్స్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసింది. “నీటి ప్రవాహం మొదలైంది.. తేదీ దగ్గర పడుతోంది.. షక్ సెప్టెంబర్ 24 నుంచి కేవలం నెట్‌ఫ్లిక్స్ లో” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

ఈ పోస్టర్ లో పరిణీతి చోప్రా తన మిస్సయిన కూతురి అన్వేషణలో భాగంగా తన చేతిలో ఓ రివార్డు ప్లకార్డు పట్టుకొని కనిపిస్తుంది. ఆమెతోపాటు ఈ వెబ్ సిరీస్ లోని ప్రధాన పాత్రలన్నీ ఈ పోస్టర్ లో కనిపిస్తాయి.

9 ఏళ్ల అన్వేషణ.. నమ్మకం వర్సెస్ అనుమానం

ఈ షక్ వెబ్ సిరీస్ కథాంశం మొత్తం ఒక తల్లి తన కనుమరుగైన బిడ్డ కోసం చేసే తొమ్మిదేళ్ల పోరాటం చుట్టూ తిరుగుతుంది. మిస్సయిన పాప కోసం వెతికే క్రమంలో ఆమెకు కొన్ని దిగ్భ్రాంతికరమైన నిజాలు వెల్లడవుతాయి.

ఆ నిజాలు తెలిసే కొద్దీ తను అత్యంతగా నమ్మే సొంత మనుషులనే అనుమానించాల్సి వస్తుంది. "నమ్మకానికి, అనుమానానికి మధ్య ఉన్న సన్నని గీత దాటితే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుంది?" అనే పాయింట్‌ను డైరెక్టర్ రెన్సిల్ డిసిల్వా గ్రిప్పింగ్ నరేషన్‌తో తెరకెక్కించారు.

స్టార్ కాస్టింగ్‌తో మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

'మహారాజ్', 'త్రిభంగ' లాంటి బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్‌లను నెట్‌ఫ్లిక్స్‌కు అందించిన సిద్ధార్థ్ పి. మల్హోత్రా ఆల్కెమీ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ మదర్ సెంటిమెంట్ డ్రామా ఉండటం ఈ సిరీస్‌కు బిగ్గెస్ట్ హైలైట్ కానుంది.

పరిణీతి కెరీర్‌లో కొత్త మైలురాయి

గతంలో 'అమర్ సింగ్ చమ్‌కీలా' సినిమాలో తన యాక్టింగ్‌తో అందరినీ మెప్పించిన పరిణీతి.. ఈ వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌లో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. పెళ్లి తర్వాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న పరిణీతి చోప్రా.. ఇలాంటి ఒక పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ ఎంచుకోవడం పట్ల అభిమానులు హ్యాపీగా ఉన్నారు.

సెప్టెంబర్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న ఈ డార్క్ సస్పెన్స్ థ్రిల్లర్ బింజ్ వాచర్స్ అందరినీ ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe